టిడిపి అధికారంలోకి రాగానే అన్నక్యాంటన్లను పునరుద్దరించి పేదల ఆకలి తీరుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం నంద్యాల పట్టణ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
నూనెపల్లి గాంధీనగర్, బొగ్గులైన్, నూనెపల్లె ఫ్లై ఓవర్ సర్కిల్, అయిలూరు మెట్ట సర్కిల్ ప్రాంతాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
నూనెపల్లి బొగ్గులైనులో మంచినీటి కుళాయి ఒక్కటే ఉంది. వేసవిలో నీటి సమస్య అత్యధికంగా ఉంది.
రైల్వే స్టేషన్, బొగ్గులైన్ రోడ్డుకు ఇరువైపులా దశాబ్ధులగా పేదలు షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు. వీరిని వైసీపీ ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయిస్తోంది.
వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి. లేదంటే మాకు స్థలాలు కేటాయించి మమ్మల్ని ఇక్కడి నుండి ఖాళీ చేయించాలి.
గాంధీనగర్ లో మురుగునీటి సమస్య అత్యధికంగా ఉంది. పరిష్కరించాలి.
నూనెపల్లి ఫ్లై ఓవర్ సర్కిల్ వద్ద ప్రభుత్వ ఆసుపత్రి , రైల్వేస్టేషన్ వద్ద అక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలి.
అయ్యలూరి మెట్ట సర్కిల్ వద్ద నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్యాంకు సామర్థ్యం సరిపోవడం లేదు. సమస్యను పరిష్కరించాలి. అని విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
లక్షలాదిమంది పేదల ఆకలితీర్చిన అన్నా క్యాంటన్లను రద్దుచేసి పేదల పొట్టగొట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.
వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం.
నంద్యాల పట్టణ ప్రజల అవసరం మేరకు అదనపు వాటర్ ట్యాంకులను ఏర్పాటుచేస్తాం.
రైల్వేస్టేన్, బొగ్గులైన్ ప్రాంతాల్లో ఖాళీచేయించిన పేదలకు ప్రత్యామ్నయ స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.