- పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా
- నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పర్యటన
నందిగామ, జగ్గయ్యపేట: కుటుంబపెద్దను కోల్పోయామని కుంగిపోవద్దు…మీకు మేమున్నాం అంటూ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో భువనేశ్వరి శుక్రవారం పర్యటించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. మొదటగా నందిగామ నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించారు.
చందర్లపాడు మండలం, కూనాయపాలెం గ్రామంలో పార్టీ కార్యకర్త వనపర్తి మల్లిఖార్జునరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. మల్లికార్జునరావు(52), గత ఏడాది సెప్టెంబర్ 13న గుండెపోటుతో మృతిచెందారు. మల్లికార్జునరావు భార్య కస్తూరి, కుమార్తెలు నాగలక్ష్మి, లక్ష్మిలను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించారు. అనంతరం జగ్గయ్యపేట నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించారు. మండల కేంద్రమైన పెనుగంచిప్రోలులో పార్టీ కార్యకర్త అలవాల గోపయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. గోపయ్య(63), గత ఏడాది అక్టోబర్ 22న గుండెపోటుతో మృతిచెందారు. గోపయ్య భార్య పుల్లమ్మ, కుమార్తె రమాదేవిలను భువనేశ్వరి ఓదార్చి, వారి యోగక్షేమాలడిగి తెలుసుకున్నారు. గోపయ్య కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించారు.
అనంతరం జగ్గయ్యపేట రూరల్ మండలం, గౌరవరం గ్రామంలో పార్టీ కార్యకర్త కుక్కుల ప్రభాకరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ప్రభాకరరావు(60), గత ఏడాది సెప్టెంబర్ 10న గుండెపోటుతో మృతిచెందారు. ప్రభాకరరావు భార్య పుష్పమ్మ, కుమారులు సురేష్, జగదీష్, ప్రదీప్ లను భువనేశ్వరి ఓదార్చారు. వారికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించారు. అనంతరం జగ్గయ్యపేట రూరల్ మండలం, బలుసుపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త గండమాల వెంకటేశ్వర్లు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. వెంకటేశ్వర్లు భార్య తేరోజమ్మ, కుమార్తెలు రమాదేవి, బేబిరాణి, లావణ్య, కుమారులు సురేష్, నాగరాజు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారి యోగక్షేమాలడిగి తెలుసుకుని వారికి రూ.3లక్షల చెక్కు అందించారు. పర్యటన ముగిసిన అనంతరం భువనేశ్వరి హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.