- ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతాం
- మఫ్టీలో టిడిపి కార్యకర్తలపై పోలీసుల దాడి
- ఖాకీల కనుసన్నల్లోనే అన్నక్యాంటీన్ విధ్వంసం
- డీజీపీ, ఎస్పీ దీనికి సమాధానం చెప్పాలి
- చెత్తపన్ను కట్టకపోతే ఇళ్లముందు చెత్తవేస్తారా?
- ఆచెత్త తీసుకెళ్లి జగన్ ముఖం మీద కొట్టండి
- వైసిపి ఆరిపోయే దీపం… చివర్లో ఇలాగే ఉంటుంది
- జైలుకెళ్లిన కార్యకర్తలను హీరోల్లా తీసుకొస్తాం
- తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు
కుప్పం : పోలీసులు నిన్న దుర్మార్గంగా వ్యవహరించారు. మా కార్యకర్తలపై దాడి చేసి తిరిగి మా వారిపైనే కేసులు పెడుతున్నారు. యూనిఫాం లేకుండా ర్యాలీలోకి వచ్చి కర్రలతో మా కార్యకర్తల తలలు పగులకొట్టారు. ఎక్కడైనా పోలీసులు సివిల్ డ్రెస్‌లో కర్రలు పట్టుకుని వస్తారా? అన్ని వివరాలు, వీడియోలు మా వద్ద ఉన్నాయి. మఫ్టీలో ఉన్న ఫోటోలపై పోలీసులు ఏమి సమాధానం చెప్తారు? టిడిపి కార్యకర్తలపై రౌడీల మాదిరి వ్యవహరించిన పోలీ సులను కోర్టు కీడుస్తాం. ప్రజా కోర్టులో దోషులుగా నిల బెడతాం. సమయం వచ్చినప్పుడు అటువంటి వారిపై వేటు తప్పదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. కుప్పం నియోజకవర్గంలోని వివిధ గ్రామా ల్లో మూడోరోజైన శుక్రవారం కుప్పం మండలంలో అధినేత విస్తృతంగా పర్యటించారు. మూడో రోజు కుప్పం మోడల్ కాలనీలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు హారతులిచ్చి మహిళలు ఘనస్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గం యానాది పల్లిలో రచ్చబండ వద్ద చంద్రబాబు కూడా గ్రామస్థుల స్వాగతంపలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో చంద్రబాబు నాయుడు మాట్లా డుతూ.. నిన్న ఎస్పీ స్థానికంగా ఉన్నప్పుడే అన్నక్యాంటీన్ పై దాడి చేశారు. ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద వందల మంది పోలీసులను కాపలా పెట్టారు. అదే పోలీసులను అన్న క్యాంటీన్ దగ్గర ఎందుకు పెట్టలేదు? నిన్నటి ఘటన పై డీజీపీ, ఎస్పీ సమాధానం చెప్పాలి నిన్న పోలీసుల కనుసన్నల్లోనే అన్న క్యాంటీన్? విధ్వంసం సాగింది, పోలీసుల సాక్షిగానే టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి రాష్ట్ర డీజీపీయే కారణం. నేరస్థుల పాలన ఎలా ఉంటుందో నిన్న కుప్పంలో చూశామని చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు.
ఎపిలో ఉన్మాదిపాలన
ఏపీలో ఉన్మాది పాలన సాగుతోంది.. రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. నిన్నటి కుప్పం ఘటన లాంటివి తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. పేదలకు ఆకలితీర్చేందుకు ఏర్పాటుచేసిన అన్నక్యాంటీన్ పై వైసీపీ రౌడీ మూకలతో దాడులకు పాల్పడ్డారు, పేదల పొట్టగొట్టే అర్హత వారికి లేదు. అన్న కాంటీన్ పై ఈ ప్రభుత్వానికి ఎందుకంత కోపం? తమిళనాడులో జయలలిత హయాంలో అమ్మ క్యాంటీన్ పెడితే దానిని ఇప్పటికీ స్టాలిన్ కొనసాగిస్తు న్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల కంటే బ్రిటిష్ వాళ్ళే న్యాయంగా వ్యవహరించారు. పోలీసుల తీరు బాధే స్తోంది. నేను 14 ఏళ్లు ఇలాగే వ్యవహరిస్తే జగన్ బయట తిరిగేవాడా అని ప్రశ్నించారు.
కుప్పంపై ఎందుకంత కోపం?
33 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. కుప్పంలో మోడల్ కాలనీలో 650ఇళ్ళు కట్టి ఆదర్శం గా తీర్చిదిద్దాం. అదనంగా ఇళ్ళు కట్టే 100 కోట్ల ప్రాజెక్ట్ ను నిలిపివేశారు. కుప్పంపై నిజంగా సీఎంకు అభిమానం ఉంటే నేను 3వేల కడితే..అతను 10వేల ఇళ్లు కట్టాలి. కుప్పంలో రింగ్ రోడ్ పనులు నిలిపివేశారు. కుప్పంపై ఎందుకంత కోపం? ప్రజల్లో చైతన్యం రావాలి..100 కోట్లతో తాము చేపట్టిన ఇళ్ల నిర్మాణం ఎందుకు ఆపేశారో వైసీపీ వారిని నిలదీయాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే కుప్పం లో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం.
కుప్పం రాకుండా చేసేందుకు విఫలయత్నం
ఒకప్పుడు కుప్పంలో కనీస సౌకర్యాలు ఉండేవి కావు. టీడీపీ పాలనలో అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చాం. విద్య, మౌలిక సదుపాయాలు కల్పించాం. చిన్నచిన్న గ్రామాల్లో పిల్లలు సైతం ఉన్నత ఉద్యోగాలలో ఉండడం ఆనందం ఇస్తుంది. నేను కుప్పం రాకూడదని వైసీపీ వైసిపి విఫలయత్నాలు చేస్తోంది. అందుకే మన క్యాడర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు. మొన్నటి వరకు కుప్పం లో చిన్న గొడవ చెయ్యడానికి భయపడే వాళ్ళు. ఇప్పుడు పొరుగు నుంచి రౌడీలను తెచ్చి గొడవలు చేస్తున్నారు. వైసీపీ తుమ్మితే ఊడే ముక్కు..ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.
పులివెందులలో ఏమని చెప్పి ఓట్లడుగుతారు?
పులివెందులలో ఏమని చెప్పి ఓట్లు అడుగుతారు? బాబాయ్ను చంపానని ఓట్లు అడుగుతారా? తల్లీ, చెల్లిని పొరుగురాష్ట్రానికి పారదోలానని ఓట్లడుగుతారా? పుంగనూరు పుడిరగిని మన పార్టీ ఇంచార్జీ చల్లా బాబు చూసుకుంటాడు. రాబోయే ఎన్నికల్లో ప్రతి చోటా గట్టి నేతలను పోటీకి దించుతున్నాం. పులివెందుల కూడా గెలిచి రికార్డు సృష్టిస్తాం. నేను పులివెందులను అభివృద్ధి చేశాను. గండికోట నుంచి నీళ్లు ఇచ్చానని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
జైలుకెళ్లిన వారిని హీరోల్లా తీసుకొస్తాం
తప్పుడు కేసులతో జైలుకు వెళ్ళిన టిడిపి కార్యకర్తలను హీరోల్లా తీసుకు వస్తాం. దోపిడీ దారులపై పోరాడుతున్నందుకు వారిని స్వాతంత్ర సమరయోధుల మాదిరి సత్కరిస్తాం. ఇప్పుడు కూడా ఒక 40-50 మందిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ ఇంటిదగ్గర 500మంది పోలీసులను పెట్టారు. ఇంత మంది పోలీసులను పెట్టడానికి ఇదేమైనా భారత్ – పాకిస్థాన్ వివాదమా అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు సాగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన శుక్రవారం రాత్రి ఓఎన్ కొత్తూరులో ముగి సింది. ఈ సందర్భంగా అధినేత మాట్లాడుతూ..నా కుప్పం పర్యటనలో వైసీపీ అలజడి సృష్టించే ప్రయత్నం చేసింది. పోలీసులే మఫ్టీలో వచ్చి టీడీపీ వారిపై దాడులు చేశారు. వైసిపికి తొత్తులుగా మారి టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతాం. వారిని కాపాడడానికి ఎవరూ ఉండరు. మా కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టిన వాళ్ళను వదిలేది లేదని చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు.
కిమ్ అన్నలా వ్యవహరిస్తున్న జగన్
రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగిపోయాయి.. కరెంట్ ఛార్జ్‌లు,గ్యాస్ ధరలు పెరిగి సామాన్యులకు భారమయ్యా యి. ఒక ఇంట్లో చెత్త పన్ను కట్టలేదు అని ఇంటి దగ్గర చెత్త వేస్తారా? ఆ చెత్తను జగన్ మొహం మీద కొట్టండి. జగన్ నార్త్ కొరియా నియంత కిమ్ వాళ్ళ అన్నలా ఉన్నాడు. టీడీపీ అన్నం పెట్టే పార్టీ..వైసీపీ సున్నం పెట్టే పార్టీ. 25ఏళ్ల పాటు భవిష్యత్ మద్యం ఆదాయంపై అప్పులు తెచ్చిన సీఎం జగన్. జగన్ దిగి పోయే నాటికి రాష్ట్రంలో అప్పు 10లక్షల కోట్లకు చేరుతుంది. వైసీపీ ఆరిపోయే దీపం. చివర్లో అలాగే ఉంటుంది.