అమరావతి, చైతన్యరథం: మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అవమానకర రీతిలో ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీని వదులుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్, తెలుగు తేజం హనుమ విహారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశేష గౌరవంతో తిరిగి స్వాగతం పలుకుతున్నదని రాష్ట్ర మానవ వనరుల, ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళవారం నాడు సచివాలయంలో మంత్రి లోకేష్‌ను హనమ విహారీ కలిసి అభినందనలు తెలుపుతూ పుష్ఫగుచ్ఛం ఇచ్చారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ ‘‘క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు అనే ప్రాథమిక సూత్రాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించిన వారిని ప్రజలు తిరస్కరించారు. ఢల్లీి లిక్కర్ స్కామ్ లో నిందితుడైన పి.శరత్ చంద్రారెడ్డిని ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమించుకోవడంతో గత ప్రభుత్వం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో ‘రాజకీయ క్రీడ’ మొదలుపెట్టింది. తమ పార్టీ నాయకుడి కుమారుడు, జట్టులో 17వ ఆటగాడు అయిన కుంట్రపాకం పృధ్వీరాజ్ ను ప్రోత్సహించేందుకు అసమాన ప్రతిభాపాటవాలు ఉన్న హనుమ విహారి లాంటి క్రికెటర్ ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా వేధించింది, అవమానించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రవర్తించిన తీరుతో విసిగిపోయిన హనుమ విహారి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నేను స్పందించి..హనుమ విహారికి అండగా ఉన్న విషయం మీకు తెలిసిందే. క్రికెట్ అభిమానులు ఎందరో హనుమ విహారికి సంఫీుభావం తెలిపారు. హనుమ విహారి తన క్రికెట్ అనుభవాన్ని ఇతరులకు నేర్పేందుకు కూడా ఆనాటి వ్యవస్థ అడ్డుపడిరది. దేశంలోని ఇతర రాష్ట్రాల క్రికెట్ జట్టుకు నేతృత్వం వహించేలా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభంజనం చూసిన తర్వాతే హనుమ విహారికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారంటే ఏ స్థాయిలో కక్షపూరితంగా వ్యవహరించారో అర్ధం చేసుకోవచ్చు. రాజకీయాలకు అతీతంగా క్రీడలను ప్రోత్సహించడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుంటుంది. అన్ని ఆటల్లో క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటాం. క్రికెటర్ హనుమ విహారికి పూర్తి న్యాయం చేసేందుకు మాట ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉంది’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.