• ఆత్మకూరు నియోజకవర్గం పడమటి నాయుడుపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మెట్టప్రాంతమైన మర్రిపాడు మండలానికి సోమశిల ప్రాజెక్టు ద్వారా నీరందించాలన్న ఉద్దేశంతో 2013లో ఆనం రాంనారాయణరెడ్డి నేతృత్వంలో అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి దివంగత ఆనం సంజీవరెడ్డి హైలెవల్ కాల్వకు శంకుస్థాపన చేశారు.
• పేజ్ -1 లో పడమటి నాయుడుపల్లిలో రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. సుమారు 10 సంవత్సరాలైనప్పటికీ గ్రామంలోని పొలాలు, ఇళ్లకు ఎటువంటి పరిహారం అందించలేదు, పనులు కూడా ప్రారంభం కాలేదు.
• ముంపు ప్రాంతమనే సాకుతో మా పంచాయితీలో అధికారులు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు.
• పదేళ్లుగా మా పంచాయితీ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
• మీరు అధికారంలోకి వచ్చాక హైలెవల్ కాల్వ పనులు ప్రారంభించి, నిర్వాసితులకు పరిహారం అందించేలా చూడండి.
• రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.
• సోమశిల ముంపు బాధితులకు సుదీర్ఘకాలంగా పరిహారం అదించకపోవడం దురదృష్టకరం.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆనం సంజీవరెడ్డి హైలెవల్ కెనాల్ ను పూర్తిచేస్తాం.
• సోమశిల ప్రాజెక్టు నిర్వాసితులకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పరిహారాన్ని అందజేస్తాం.