కేసు పక్కరాష్ట్రానికి.. అబ్బాయి జైలుకి: లోకేష్
అమరావతి : వివేక హత్య కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు సంచలనాత్మక తీర్పు వెలు వరించడంపై తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. సొంత బాబాయ్ హత్య కేసువిచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ చేశా రు. అది కూడా నువ్వు సీఎంగా ఉండగా.. తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్‌రెడ్డీ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వివేకా కేసును పొరుగు రాష్ట్రానికి తరలించడంపై ట్విట్టర్‌లో స్పందించారు. బాబాయ్ హత్యకేసు పక్క రాష్ట్రానికి. అబ్బాయి చం చల్ గూడా జైలుకి అంటూ సిఎం జగన్‌కు చురకలంటించారు. బాబాయ్‌ని లేపేసి గుండె పోటుగా చిత్రీకరించి సిబిఐ విచారణకు తరచూ అడ్డుపడుతున్న జె-గ్యాంగ్‌కు జైలు గడియలు దగ్గరపడినట్లే కన్పిస్తు న్నారు. సాక్షులను భయభ్రాంతులను చేస్తూ విచారణ అధికారుల మీదే కేసులు పెడుతూ, సొంత బాబుయ్ కేసు విచారణ సక్రమంగా జరగుకుండా అడ్డుపడుతున్న జె-గ్యాంగ్ అరాచకాలకు చెక్ పెడుతూ మంగళ వారం సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు జగన్‌రెడ్డి సర్కార్ కు చెంప పెట్టు లాంటిది.
వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ : సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కేసును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తు న్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడిరచింది.ఈ విచా రణపై మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసు కుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్ బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ ఎం.ఆర్.షా పేర్కొన్నారు.ఈ కేసులో సాక్షులను, నిందితులు బెదిరిస్తున్నారని, కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడిరచింది.