- బాబాయ్‌ని చంపిన నరహంతకుడు
- మాఫియా ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్
- మీ నాన్న, తాతలకే భయపడలా.. నువ్వొక లెక్కా?
- ప్రత్తికొండకు రోడ్డేయలేనోడు 3రాజధానులు కడతాడా?
- రాజకీయ వ్యాపారి జగన్ రెడ్డి
- రాష్ట్రంలో మద్యం కంపెనీలన్నీ ఆయనవే!
- ప్రత్తికొండ రోడ్ షోలో నిప్పులు చెరిగిన చంద్రబాబునాయుడు
కర్నూలు : మాటతప్పిన ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చిపా రేయాలి, ఉరితీయాలని ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రగ ల్భాలు పలికిన నేటి సిఎం జగన్‌రెడ్డిని ఏంచేయాలో ప్రజలే చెప్పాలని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర బాబునాయుడు ప్రజలను ప్రశ్నించారు. మూడురో జుల పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాకు వెళ్లిన చంద్రబాబునాయుడుకు అడుగడుగునా జనం నీరాజ నాలు పట్టారు. కర్నూలు ఎయిర్ పోర్టునుంచి ప్రారం భమైన చంద్రబాబు పర్యటన పత్తికొండలో సభకు చేరేసరికి రాత్రి 9.30గంటలైంది. నిర్ణీత సమయాని కంటే నాలుగు గంటల ఆలస్యంగా చంద్రబాబునా యుడు ప్రత్తికొండ చేరుకున్నప్పటికీ వేలాదిమంది ప్రజలు ఆయన కోసం వేచిచూశారు. ప్రత్తికొండ రోడ్ షో అనంతరం సభలో చంద్రబాబునాయుడు మాట్లా డుతూ… అధికారంకోసం సొంత బాబాయ్‌ని హత మార్చిన నరహంతకుడు జగన్‌రెడ్డి అంటూ నిప్పులు చెరిగారు. నందిగామలో నాపైన, విశాఖలో పవన్ కళ్యాణ్‌పైన జగన్‌రెడ్డి పేటిఎం బ్యాచ్ దాడులకు దిగి అరాచకం సృష్టించారు, నేను ఈ రోజు మీటింగ్ కు వస్తున్నానని తెలిసి చెడగొట్టే ప్రయత్నం చేశారు. పత్తి కొండ ఎమ్మెల్యే పేటిఎం బ్యాచ్‌ను పంపారు, జగన్ నాన్నను… వాళ్ల నాన్నను కూడా చూశా… ఆకురౌడీ లకు భయపడతానా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. జగన్‌రెడ్డి అరాచకాలను ప్రశ్నించిన టివి 5 మూర్తి వంటివారిపై జర్నలిస్టులపైనా కేసులు పెడుతు న్నాడు. ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా నేనే ముందుంటా. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం నా బాధ్యత అని అన్నారు. ప్రత్తికొండ రోడ్‌షోలో చంద్ర బాబునాయుడు ఏమన్నారో ఆయన మాటల్లోనే…!
తప్పుడు పోలీసులను జగన్ కాపాడలేరు
తుగ్లక్ పాలనవల్ల రాష్ట్ర ప్రజల జీవితాలన్నీ నాశ నమయ్యాయి. కడపలో స్టీల్ ప్లాంట్ కట్టలేని సిఎం మూడు రాజధానులు కడతారా? సిఐడి ఉన్నది అక్ర మ కేసులు పెట్టడానికా? నాడు బకాసురుడిని అంతం చేసిన భీముడిలా… రాష్ట్రంలో భూ బకాసురులను, జగన్‌రెడ్డిని జనమే కట్టడి చెయ్యాలి. పత్తి కొండ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో భారీఎత్తున అక్రమాల కు పాల్పడుతున్నారు. ఇసుక దందాను ప్రశ్నించిన వారిపై ఎమ్మెల్యే కేసులు పెట్టిస్తున్నారు. నేను ధర్మం కోసం పోరాడుతున్నా…ఈ చోటామోటా నాయకులకు భయపడను. నిబంధనలు పాటించని పోలీసులను జగన్ రెడ్డి కూడా కాపాడలేరు.
నేను జగన్ లా ఆలోచిస్తే ఏమయ్యేది?
నేను జగన్ మాదిరి ఆనాడు ఆలోచిస్తే హైదరా బాద్ అభివృద్ధి చెందేదా? పాతికేళ్లక్రితం పుట్టిన, పుట్ట బోయే పిల్లలకోసం ఆలోచించా. నా ముందుచూపు వల్లే ఈరోజు పిల్లలకు బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చాయి. ఆడపడుచులు ఇబ్బందుల్లో ఉన్నారని, వారి ఆత్మగౌరవం పెంచడానికి డ్వాక్రా సంఘాలు ప్రవేశ పెట్టా. ఇటీవల విశాఖపట్నం వచ్చిన ప్రధాని మోడీ బిజెపినేతలతో చంద్రబాబు డ్వాక్రాసంఘాలు దేశానికే ఆదర్శమయ్యాయని చెప్పాడు. రాష్ట్రంలో రైతుల పరి స్థితి దయనీయంగా తయారైంది. పత్తికొండలో టమా టా రోడ్డుపై పారబోసే పరిస్థితి వచ్చింది. నకిలీ విత్త నాలతో పత్తిరైతులు నష్టపోయారు. జగన్ ఒక్కరైతును పరామర్శించాడా… ఒక్క పొలానికి వచ్చాడా? మీలో చైతన్యం తేవడానికి ఇక్కడికి వచ్చాను. జగన్ ఇచ్చేది గోరంత…దోచేది కొండంత. అన్నిధరలు పెరిగాయి.. ప్రజలపై పన్నులు పెరిగాయి. ప్రతిఏటా ఒక్కో కుటుం బంపై లక్షభారం మోపుతున్నాడు ఈ ముఖ్యమంత్రి.
రాజకీయ వ్యాపారి జగన్
ముఖ్యమంత్రి జగన్ రాజకీయవ్యాపారస్తుడు. రాష్ట్రం లో మద్యం కంపెనీలు అన్నీ ఆయనవే. జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. వైసిపి ప్రభుత్వంలో ఇరిగే షన్ పనులన్నీ నిలిపివేశారు. సిఎం జగన్‌కు రంగుల పిచ్చి. టిడిపి హాయంలో కట్టిన భవనాలకు సిగ్గులేకుండా రంగులు వేసుకుంటున్నాడు. రంజాన్ తోఫాకు డబ్బులు లేవు కానీ… రంగులకు డబ్బులెలా వచ్చాయి? బిసిలకు పథకాలు లేవు…కానీ సాక్షికి మాత్రం కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తు న్నారు. సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వంలో పదవులు ఇస్తున్నారు. సాక్షి గుమస్తా ఇప్పుడు రాష్ట్రంలో సకల శాఖా మంత్రి. రాష్ట్రంలో ప్రజల మెడపై కత్తిపెట్టి వైసిపి నేతలు ఆస్తులు ఖాజేస్తున్నారు. నంద్యాలలో అబ్బు ల్ సలాం కుటుంబాన్ని ఎలా వేధించి చంపారో అంతా చూశాం. మైనారిటీలకు ఇచ్చే అన్ని పథకాలు రద్దు చేశా రు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది టిడిపి. వక్ఫ్ బోర్డు అస్తులు కాపాడిరది కూడా టిడిపినే.
ఫిట్‌గా ఉన్నా.. రాష్ట్రాన్ని బాగు చేసి చూపిస్తా!
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నేతృత్వంలోని జె-గ్యాంగ్ నాపై చెప్పడానికి ఏమీ లేక వయసును ప్రస్తావిస్తూ తప్పుడు ప్రచారంచేస్తున్నారు.నేను ఫిట్ గానే ఉన్నా. ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల చెరనుంచి విడిపించి బాగుచేసి చూపిస్తా. తెలుగు మహిళలం టే నా తోబుట్టువులు. ఆడపిల్లలకు కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు పెట్టాను. రాష్ట్రం విడిపోయిన సమయంలో నన్ను గెలిపిస్తే.రాత్రింబవళ్లు పని చేశాను. 2029లో ఎపి దేశంలో నెంబర్‌వన్ రా ష్ట్రంగా ఉండాలి అని ప్రయత్నించాను. అయితే జగన్‌కు ఇచ్చిన ఒక్కచాన్స్‌తో అంతా రివర్స్‌లో పోతుంది.జగన్‌రెడ్డి 42 నెలల హయాంలో యువ తకు ఒక్క ఉద్యోగం వచ్చిందా? టిడిపి హయాం లో 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. అవి కార్యరూపం దాలిస్తే 30లక్షల ఉద్యోగాలు వచ్చేవి. అప్పటికే 6లక్షల ఉద్యోగాలు వచ్చాయి.కర్నూలులో ఎయిర్‌పోర్ట్ తెచ్చాను. జిల్లా లో సీడ్‌పార్క్ తెచ్చాను. అనంతపురంలో కియా మోటార్స్ సహా సీమలో అనేక పరిశ్రమలు తెచ్చా ను. టిడిపి అధికారంలో ఉండి ఉంటే కడపలో స్టీల్ ప్లాంట్ కూడా వచ్చేది.
ప్రత్తికొండకు రోడ్డేయలేనోడు 3రాజధానులు కడటాడా?
పత్తికొండకు వస్తుంటే రోడ్డు చేశాను. దారు ణంగా ఉంది. పత్తి కొండకు రోడ్డు వేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా? ఆయన సొంత జిల్లా కడపలో స్టీల్ ప్లాంట్ కట్టాడా? ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా? కర్నూ లుకు హైకోర్టు వస్తే నేను అడ్డుపడుతున్నానని తప్పు డు ప్రచారం చేస్తున్నారు. కర్నూల్‌లో మేంకట్టిన ఎయిర్ పోర్ట్‌లో జగన్ దిగాడు. మనం తెచ్చిన సోలార్‌ప్లాంట్ తాను ప్రారంభించాడు. స్థానికంగా పంటల బీమా చెల్లింపులు లేవు. ధరల స్థిరీకరణ నుంచి ఉల్లి, టమాటా పంటల రైతు లను ఆదుకోవాలి. నకిలీ విత్తనాల కారణంగా పత్తి దెబ్బ తిన్నది. దీనికి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి. రైతులకు డ్రిప్ సబ్సిడీలు కొనసాగించాలి.