- ఐదేళ్ల నిద్ర తరువాత రాష్ట్ర ప్రయోజనాలు గుర్తొచ్చాయా?
- రాష్ట్రంలో ప్రజల మూడ్ పూర్తిగా జగన్‌కు వ్యతిరేకం
- నైరాశ్యంతో హడావిడిగా ఢల్లీికి జగన్‌రెడ్డి
- ధ్వజమెత్తిన టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు
అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆక స్మికంగా ఢల్లీి పర్యటన పెట్టుకున్న ముఖ్య ఉద్దేశ్యమేమి టని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నిం చారు. శుక్రవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పత్రికా సమావేశంలో ముఖ్యమంత్రికి పలు ప్రశ్నలు సంధించారు.
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేనుబలోపేతం చేయ డానికి బీజేపీ అగ్ర నాయకత్వం ఆ సంకీర్ణాన్ని గతంలో వదలి వెళ్లిన పార్టీలను తిరిగి ఆహ్వానిస్తూ పలు పార్టీల నాయకులతో చర్చిస్తున్నదని.. అందులో భాగంగానే తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారంనాడు చర్చలుజరిపారని ఉమా అన్నారు. చంద్రబాబు ఢల్లీి నుంచి తిరిగివచ్చిన గురు వారం నాడే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి హడావిడిగా ఢల్లీి వెళ్లారని, ఇందులోని ఆంతర్యమేమిటో వెల్లడిరచాలని ఆయన డిమాండ్‌చేశారు. ‘‘ఎట్టి పరిస్థితుల్లో తెలుగు దేశంతో పొత్తు పెట్టుకోవద్దని బీజేపీ అగ్రనాయకత్వా న్ని కోరడానికా’’అని బొండా సూటిగా ప్రశ్నించారు.
తెదేపా-బీజేపీ పొత్తుపై చర్చలు ముగిసిన తరువాత తీసుకునే నిర్ణయాన్ని ప్రజలకు వివరంగా వెల్లడిస్తామ ని, జగన్‌రెడ్డిలాగ లోపాయికారి ఒప్పందాలు పెట్టుకునే నైజం చంద్రబాబుది కాదని బొండా స్పష్టం చేశారు. కేంద్రంతో నిరంతరం పలు విషయాలపై పోరాడుతు న్నామని తరచుగా చెప్పే జగన్‌రెడ్డి తలుపులు మూసిన గదుల్లో నడుచుకునే తీరు ప్రజలకు తెలుసని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ప్రజల మూడ్ జగన్‌రెడ్డికి పూర్తిగా వ్యతి రేకంగా మారిందని.. తాజాగా గురువారంనాడు విడు దలైన ఇండియా టుడే`సీ ఓటర్ సర్వే తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తుందని వెల్లడిరచడంతో కలవరపడిన జగన్‌రెడ్డి నైరాశ్యంతో హడావిడిగా ఢల్లీికి పరిగెత్తారని బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
ఐదేళ్లుగా నిద్రపోయారా?
రాష్ట్రానికి రావాల్సిన నిధుల సాధన కోసం ముఖ్య మంత్రి ఢల్లీి వెళ్లారని ప్రభుత్వ సలహాదారు సజ్జల వివ రణ ఇచ్చిన నేపథ్యంలో..4 సంవత్సరాల 10నెలలు నిద్రపోయి ఎన్నికల తరుణంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నామంటే నమ్మటానికి ప్రజలు పిచ్చి వాళ్లు కాదని బొండా అన్నారు. భారీ గెలుపునిస్తే కేం ద్రం మెడలువంచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధిస్తామ ని డాంబికాలు పలికిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఏం సాధించాడని ఆయన నిలదీశారు. ఈ ఐదేళ్లుగా రాష్ట్రా నికి కనీసం ఒక చిల్లర దుకాణం కూడా సాధిం చలేని ముఖ్యమంత్రి అవసాన దశలో ఏం సాధించగలరని ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల్లో ప్రజలు భారీ మద్దతిచ్చినా ఈ ఐదేళ్లుగా రాష్ట్రానికి ఒక్క ప్రయోజనం చేకూర్చలేదని, పార్ల మెంట్‌లో వైసీపీకి ఉన్న సంఖ్యా బలాన్ని స్వీయ ప్రయో జనాల కోసం, తనపై నమోదైన పలు కేసుల నుండి రక్షించుకునేందుకు,బాబాయి హత్యకేసులో తన కుటుం బం ఇరుక్కోకుండా చూసుకునేందుకు, సోదరుడు అవి నాష్‌రెడ్డి అరెస్టుకాకుండా చూసేందుకు మాత్రమే దుర్వి నియోగం చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తీవ్ర హాని కలిగించాడని బొండా ఆగ్రహం వెలిబుచ్చారు.
జగన్ ఖేల్ ఖతమ్-దుకాన్ బంద్
రాష్ట్రంలో ప్రజల మూడ్ పూర్తిగా రివర్స్ అయిం దని, ఈ మేరకు పలు సంస్థలు చేపట్టిన సర్వేలు వెల్లడి స్తూ వచ్చాయని, తాజాగా ఇండియా టుడే ` సీ ఓటర్ సర్వే రానున్న ఎన్నికల్లో టీడీపీ 45శాతం ఓట్లతో 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడిరచడంతో ఈ జగన్ వ్యతిరేక ట్రెండ్ నిర్ధారణ అయిందని బొండా అన్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుది రిందని, జనసేనకు ఉన్న దాదాపు 15శాతం ఓట్లతో ఈ కూటమి రానున్న ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తుం దని, దీంతో ‘జగన్ ఖేల్ ఖతమ్-దుకాన్ బంద్’ అవు తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇండియా టుడే విడుదలచేసిన సర్వే ఫలితాల విశ్వ సనీయతను వైసీపీ ప్రశ్నించిందని, అదే సంస్థ 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వెల్లడిరచిందని గుర్తు చేస్తూ, తమకు అనుకూలంగా వస్తే ఒప్పు`వ్యతిరేకంగా వస్తే తప్పు అన్న రీతిలో అధికారపార్టీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బొండా వ్యాఖ్యానించారు.
గురువారంనాడు వెల్లడైన ఇండియా టుడే సర్వే ఫలితాలను తక్కువ చేసి చూపడానికి అదే రోజున వైసీపీ మీడియా టీమ్ ‘రిపబ్లిక్ సర్వే’ పేరుతో ఒక ఫేక్ సర్వేను విడుదల చేసి అధికార పార్టీకి 132 అసెంబ్లీ స్థానాలు వస్తాయంటూ దుష్ప్రచారానికి పాల్పడిరదని, అయితే ఒక గంట లోపలే జాతీయ ఆంగ్ల టీవీ ఛానల్ ‘రిపబ్లిక్ టీవీ’ రాష్ట్రంలో తామెలాంటి సర్వే చేయలేదని స్పష్టం చేసిందని ఆధారాలతో సహా బొండా చూపారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిది, వైసీపీ నేతలవి ఫేక్ బ్రతుకు లని, తమ ఫేక్ ప్రచారాలతో తెదేపా విజయాన్ని అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు.