- సంధ్య ఆక్వాతో తప్పుడు ప్రకటన ఇప్పించారన్న టీడీపీ నేత పట్టాభి
- జనవరి 14న రవాణా అయితే 17న సర్టిఫికెట్ ఇచ్చారని బొంకిన కంపెనీ
- కంటెయినర్‌ను రవాణా చేసిన కంపెనీ వెబ్‌సైట్‌లో వివరాలున్నాయి
- ఆధారాలను మాయం చేసేలా పోలీసుల తీరు
- డ్రగ్ మాఫియాను నడిపిస్తున్న జగన్‌రెడ్డికి బుద్ధి చెప్పాలి
అమరావతి(చైతన్యరథం): జగన్‌రెడ్డి డ్రగ్‌మాఫియా సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీతో తప్పుడు ప్రకట నలు ఇప్పిస్తూ.. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్ కంటెయినర్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని తెలుగుదేశంపార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మా రెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. మరోపక్క రాష్ట్ర పోలీ సులు దొరికిన ఆధారాలను విచారణ చేస్తున్న సీబీఐ అధికారులకు అప్పగించకుండా కంపెనీకే తిరిగి అప్ప గించి నేరస్థులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విరు చుకుపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాల యంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ విశాఖ డ్రగ్ కంటెయినర్ వ్యవహారంలో సంచలనాత్మక విషయాలు బయటపడ్డాయన్నారు.
సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీకి చెందిన బస్సు కాకినాడలోని కొత్త మూలపేట ఎస్‌ఈజెడ్ పక్కన రెండు, మూడు రోజులు గా అనుమానాస్పదంగా నిలిచి ఉండటాన్ని గమనించిన స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. పోలీసుల తనిఖీలో సంధ్యా ఆక్వాకుచెందిన కీలక ఫైళ్లు, హార్డ్ డిస్క్‌లు, చెక్‌బుక్‌లు బస్సు నిండా దొరికాయి. తనిఖీ చేసిన పోలీసు అధికారులు వాటిని డ్రగ్ కేసును విచారిస్తున్న సీబీఐకి అప్పగించకుండా తిరిగి సంధ్యా ఆక్వా కంపెనీవారికే అప్పగించడం అత్యంత విడ్డూరం. వేల కోట్ల రూపాయలు విలువ గల మత్తు పదార్ధాల దిగుమతి కేసులో దొరికిన కీలక ఆధారాలను తిరిగి నిందితులకే అప్పగించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని పట్టాభి ఘాటుగా ప్రశ్నించారు.
తోలుబొమ్మల్లా పోలీసులు
సీబీఐ అధికారులు తనిఖీ చేసే అవకాశం ఉందని భావించిన సంధ్యా ఆక్వా కంపెనీ.. వారికి సంబంధిం చిన కీలక ఫైళ్లు, హార్డ్ డిస్క్‌లు, చెక్‌బుక్స్, ఇతర ముఖ్య డాక్యుమెంట్లను దొరక్కుండా చేయాలనే ఉద్దేశంతో బస్సులో నింపి అక్కడ నుంచి తరలించారు.ఇది సామా న్యుడికి సైతం అర్థమయ్యే విషయం. కానీ, పోలీసు అధికారులు తాడేపల్లిప్యాలెస్ ఆదేశాలతోనే తమ చేతికి చిక్కిన సంధ్యా ఆక్వా బస్సును తిరిగి వారికే భద్రంగా అప్పగించారు. ఈ విధంగా దర్యాప్తును నీరుగారుస్తూ, ఆధారాలను మాయం చేస్తూ, జగన్ డ్రగ్ మాఫియా చేతిలో తోలుబొమ్మల్లా మారిన పోలీసు అధికారులు.. పైకి మాత్రం తాము అన్ని రకాలుగా సీబీఐ విచారణకు సహకరిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదం. విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ సైతం తాము ఎక్కడా విచారణకు అడ్డుపడటం లేదని, సీబీఐకి అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తున్నామని కొద్ది రోజుల క్రితం మీడియా ముఖంగా తెలియజేశారు. విచారణకు తోడ్పడటం అంటే దొరికిన ఆధారాలను మాయం చేయడమా? నేటి పరిణామాలు చూస్తుంటే జగన్‌రెడ్డి డ్రగ్ మాఫియాను కాపాడేందుకే పోలీసులు 24 గంట లు శ్రమిస్తున్నారనిపిస్తోందని పట్టాభి దుయ్యబట్టారు.
సంధ్యా ఆక్వా కంపెనీ ప్రకటన అవాస్తవం
సంధ్యా ఆక్వా కంపెనీ ఈ నెల 23న ఒక తప్పుడు పత్రికా ప్రకటన విడుదల చేసి ప్రజలను, దర్యాప్తు సం స్థలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అందు లో తాము దిగుమతి చేసుకున్న డ్రై ఈస్ట్ కంటైనర్‌ను బ్రెజిల్ వ్యవసాయ మంత్రిత్వశాఖ ఈ ఏడాది జనవరి 17వ తేదీన తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఎస్‌ఈకెయు 4375380 నంబర్ గల కంటైనర్‌ను ట్రాన్స్‌పోర్టు చేసిన ఓషన్ నెట్వర్క్ సంస్థ దానిని ఏ రోజు ఎప్పుడు, ఎక్కడ నుంచి తరలించారనే పూర్తి వివరాలు వారి వెబ్‌సైట్‌లో చాలా వివరంగా పొందుపరిచారు. దానిని బట్టి చూస్తే.. ఖాళీ కంటెయినర్‌ను గత ఏడాది డిసెంబర్ 29న ట్రాన్సిట్ వరల్డ్ లాజిస్టికా కంపెనీయార్డుకు తరలించారు. అక్కడ లోడ్ అయిన కంటైనర్‌ను ఈ ఏడాది జనవరి 14న శాంటోజ్ పోర్టుకు తీసుకువచ్చి అదేరోజు కంటెయినర్‌్ ను న్యావివోస్ డొమినియో అనే నౌకలోకి మధ్యాహ్నం 3.30 నిముషాలకు చేర్చారు. న్యావివోస్ డొమినియో నౌకలో బ్రెజిల్‌లోని శాంటోజ్ పోర్టు నుంచి బయలు దేరిన సదరు కంటెయినర్ ఫిబ్రవరి 5వ తేదీన జర్మనీ లోని హ్యంబర్గ్ పోర్టుకు చేర్చింది.
ఫిబ్రవరి 8వ తేదీన ఆ కంటెయినర్‌ను జిన్ లియాన్ యున్ గాంగ్ నౌకలోకి చేర్చిన తరువాత హ్యాంబర్గ్ నుంచి బయలు దేరి ఈ నెల 16న విశాఖపట్నం పోర్టుకు చేరింది. జనవరి 14న బయలు దేరిన కంటైనర్‌ను జనవరి 17 న బ్రెజిల్ వ్యవసాయ శాఖ వారు ఏ విధంగా తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేయగలరు? జగన్ డ్రగ్ మాఫియా చేతిలో కీలుబొమ్మ మారిన సంధ్యా ఆక్వా వాస్తవాలను కప్పిపుచ్చుతూ నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలను వండివారుస్తున్నారన డానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి.
వాస్తవాలు ఈ విధంగా ఉంటే.. జగన్‌రెడ్డి డ్రగ్ మాఫియా సంధ్యా ఆక్వా కంపెనీ చేత తప్పుడు ప్రకటనలు ఇప్పించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. ఈరోజు మేం బయటపెట్టిన ఈ కీలకమైన ఆధారాలకు జగన్‌రెడ్డి డ్రగ్ మాఫియా ఏం జవాబు చెబుతుంది. కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నాయని సీబీఐ పరీక్షలు చేసి తేల్చిన తర్వాత ఆవ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి బ్రెజిల్ వ్యవసాయశాఖ సర్టిఫికేట్ నాటకానికి తెరలేపి అడ్డంగా దొరికిపోయారు. ఒకవైపు తప్పుడు ప్రకటనలు ఇప్పిస్తూ.. మరో వైపు దొరికిన కీలక ఆధారాలను ఖాకీల సహాయంతో మాయం చేస్తూ జగన్ డ్రగ్ మాఫియా డ్రగ్ కంటైనర్ వ్యవహారాన్ని సమాధి చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తోందని పట్టాభి విమర్శించారు.
అన్ని వేళ్లూ జగన్ వైపే
గతంలో పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న విశాఖను మాదక ద్రవ్యాల రవాణా ట్రాన్సిట్ పాయింట్‌గా నేడు సైకో జగన్ మార్చాడు. ముంద్రా పోర్టు వ్యవహారం నుంచి విశాఖ డ్రగ్ కంటైనర్ వరకు పట్టుబడిన డ్రగ్ వ్యవహారాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు వేలెత్తి చూపుతున్నాయి. రాష్ట్రాన్ని మత్తుపదార్థాల అడ్డాగా మార్చి వేల కోట్లు మింగుతూ యువత జీవితాలతో సైకో జగన్ ఆడుకుంటున్నాడు. నేడు రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో ఎక్కవ మంది మాదకద్రవ్యాలు, మద్యానికి బానిసలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. జగన్ రెడ్డి తన ధనదాహం తీర్చుకోవడం కోసం బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నాడు. ఎవరైనా సరే ఓషన్ నెట్‌వర్క్ ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కంటైనర్ నంబర్ వివరాలు ఆధారంగా వాస్తవాలను తెలుసుకోవచ్చు. ఆ తరువాత రాష్ట్రంలో డ్రగ్ మాఫియాను నడిపిస్తున్న జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని పట్టాభి కోరారు.