- రాజకీయ జీవితాన్నిచ్చింది చిత్తూరు జిల్లానే
- ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను..
- నంద్యాల, తిరుపతిలో చివరి సభలని ముందే అనుకున్నా
- 89 ప్రజాగళం సభలు సూపర్ సక్సెస్
- ఆడబిడ్డల సంపద రెట్టింపు చేస్తా..
- చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ సాధిద్దాం
- సంపద సృష్టించి.. సంక్షేమం అందిస్తా..
- అన్ని వర్గాల అభ్యున్నతికీ నాదీ పూచీ..
- భూచట్టం వస్తే ప్రజల మెడకు ఉరితాడే.. జాగ్రత్త
- ఎన్నికల్లో సైకో జగన్‌ను తరిమికొట్టడమే లక్ష్యం
- చిత్తూరు ప్రజాగళంలో చంద్రబాబు పిలుపు
చిత్తూరు (చైతన్య రథం): రాష్ట్రంలో కూటమి అనుకూల గాలి.. తుపాను వేగానికి మారుతోంది. ఆ ప్రచండ వేగానికి ఎవ్వరు ఎదురొచ్చినా బంగాళాఖాతంలోకి పోవడం ఖాయం. ఈ ఎన్నికలకు ఇదే చివరి సభ. జగన్ సర్కారు నన్ను అరెస్ట్ చేసిన నంద్యాల, నాకు రాజకీయ జీవితాన్నిచ్చిన చిత్తూరులో ఎన్నికల ప్రచార చివరి సభ పెట్టాలనుకున్నాను. నన్ను అభిమానించిన జనం మీరు. మీ గౌరవాన్ని కాపాడటానికి అనునిత్యం పని చేస్తాను. చిత్తూరు జిల్లా రుణం తీర్చుకోడానికి పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేశాను. మరింత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
హైవే రోడ్ల బీజానికి కారణం టీడీపీనే….
చిత్తూరు జిల్లాలో పరిశ్రమలు రావాలని, తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్‌గాపెట్టి టీసీఎల్, హీరో, జోహాన్, కార్బన్, డిక్సన్‌వంటి కంపెనీలు తీసుకొచ్చాను. అన్ని జాతీయ వర్శిటీలు ఏర్పాటు చేశాం. దేశంలోనే మంచి రోడ్లు ఉండాలని మలేషియాలో రోడ్లను పరిశీలించి వాజ్‌పేయితో చెప్పి నెల్లూరు`చెన్నై హైవేలకు బీజం వేశాం. ఇప్పుడు అన్నిచోట్ల హైవేలు వచ్చేస్తున్నాయి. టెలీకమ్యూనికేషన్ సెక్టార్‌లో డీ రెగ్యులేషన్ తెచ్చాను. అందుకే ఈ రోజు సెల్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఆరోజు అవహేళన చేసినోళ్లే ఈరోజు ఆనందిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన వ్యక్తి ఎన్టీఆర్. కృష్ణా జలాలు సీమకు రావాలని, తెలుగు గంగ, ఎస్‌ఆర్బీసీ, గాలేరు నగరి ప్రాజెక్టులు చేపట్టారు. రూ.65వేల కోట్లతో అన్ని ప్రాజెక్టులను చేపట్టాను. నేను మళ్లీ అధికారంలోకి వచ్చివుంటే అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరుకు నీళ్లు అందేవి. జగన్ ఐదేళ్లుగా ఒక్క ప్రాజెక్టు కట్టాడా? తట్ట మట్టి ఎత్తాడా? సినిమా సెట్టింగ్‌ల సీఎం వచ్చి కుప్పం గేట్లు పెట్టి, లారీ ట్యాంకెర్లతో నీళ్లు వదిలారు. జగన్ ఇలా విమానం ఎక్కగానే అక్కడ నీళ్లు ఆగిపోయాయి. అలాంటి మోసకారిని నమ్ముతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
జగన్‌పై ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాట….
వైసీపీ ఏలుబడిలో పాపాల పెద్దిరెడ్డి, ఏ2 విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జలరెడ్డి, జగన్మోహన్‌రెడ్డిలు తప్ప మరెవ్వరూ బాగుపడలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. ఏ రెడ్డికైనా ఆదాయం పెరిగిందా? మామిడి తోటలు ఉన్న రైతులు ఎవరైనా బాగుపడ్డారా? ప్రజలకు ఏమాత్రమైనా న్యాయం జరిగిందా? అని ప్రశ్నిస్తూ.. పాపాల పెద్దిరెడ్డి అవినీతి పెరిగిపోయింది. పదవులు, హోదాలు, కాంట్రాక్టులు అన్నీ ఆయనకు, కుటుంబసభ్యులకే కావాలా? పెద్దిరెడ్డి తిన్నదంతా మక్కెలిరగదన్ని కక్కిస్తాను. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఒక ఎర్రచందనం స్మగ్లర్. జగన్ ఎర్రచందనం స్మగ్లర్‌కు సీటు ఇచ్చి జిల్లాను తాకట్టు పెట్టాడు. స్మగ్లర్లకు ప్రజలు భయపడాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఐదేళ్లల్లో రాష్ట్రం ఎంత నష్టపోయింది? ప్రజలు ఎంతో నష్టపోయారు. ప్రజల్లో ఆవేదన, బాధ ఉంది. అనుభవించిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి ఉంది. ప్రచండ వేగంతో కూటమికి అనుకూలంగా వీస్తున్న గాలుల్లో వైసీపీ మూక కొట్టుకుపోవడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు.
రాయలసీమలో బలిజలకు ఎందుకు సీటివ్వలేదు జగన్….
జగన్ రాయలసీమలో ఒక్క సీటు బలిజలకు ఇచ్చారా? కమ్మలకు ఎందుకు ఇవ్వలేదు? పలమనేరు అమర్‌నాథ్ రెడ్డి, పుంగనూరు చెల్లాబాబు, తంబళ్లపల్లి జైచంద్రారెడ్డి, పీలేరు కిషోర్‌కుమార్ రెడ్డి, కాళహస్తి బొజ్జలసుధీర్ రెడ్డికి ఇచ్చాం. బీసీలకు రాయలసీమలో జగన్ ఎందుకు ఇవ్వలేదు. కాని టీడీపీ తరఫున బోయలు, కురబలకు ఇచ్చాం. బీజేపీ తరుపున కిరణ్‌కుమార్‌రెడ్డి రాజంపేట నుంచి పోటీచేస్తున్నారు. అదీ సామాజిక న్యాయం. జగన్ ఎలాంటి సామాజిక న్యాయం పాటించుకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ఒకటీ అరా ఇచ్చినా అధికారం మాత్రం ఆ ఐదుగురివద్దే ఉంటుందని ధ్వజమెత్తారు. తాను నేరాలు చెయ్యనని, చేసిన వ్యక్తికి శిక్షపడే వరకు సహించనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడిన ఎవ్వరినీ వదిలేది లేదని, అందరికీ తిరిగి ఇచ్చేస్తానని చంద్రబాబు తీవ్రస్థాయిలో జగన్ ముఠాను హెచ్చరించారు.
ఎవరైనా ప్రశ్నిస్తే సాక్షితో వ్యక్తిత్వ హననం….
జగన్‌ను ఎవరైనా ప్రశ్నిస్తే సహించలేడని, ప్రశ్నించిన వారిపై సాక్షి నీలి పత్రికతో వ్యవత్వ హననానిక పాల్పడి ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వస్తే పథకాలు ఆగిపోతాయని ప్రజలకు బెదిరిస్తున్న జగన్‌కు సమాధానమిస్తూ.. కూటమి వచ్చాక సిసలైన సంక్షేమం అమలు చేస్తామన్నారు. బటన్ నొక్కడానికి జగన్ ఎందుకు అని ప్రశ్నిస్తూ.. ఉద్యోగాలు సాధించడానికి, పేదవాళ్లను ఆదుకోవడానికి, సంపాదన పెంచడానికి, రోడ్లు వేయడానికి ముఖ్యమంత్రి కావాలన్నారు. జగన్ వచ్చిన వెంటనే అమర్ రాజా కంపెనీని పక్క రాష్ట్రాలకు పంపేశారని అంటూ, అంటే భారతీ కంపెనీనే ఉండాలా? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే భారతీ కంపెనీ మూయించలేనా? అని తీవ్రస్వరంతో విరుచుకుపడ్డారు.
జగన్‌కి ఓటేస్తే మీ భూమికి భద్రత లేనట్టే….
గతంలో పట్టాదారు పుస్తకంపై రాజముద్ర ఉండేది. నేడు దానిస్థానంలో సైకో ఫోటో వచ్చింది. జగన్ ఏలుబడిలో భూములకు రక్షణ లేదు. ప్రయివేట్ భూముల దోపిడీకీ కొత్త చట్టం తెచ్చారు. సైకో ఫొటోలున్న పాస్‌బుక్ నకళ్లు చించేస్తున్నా. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో పట్టాదారు పుస్తకం ఇస్తాను. మీ భూములపై మీకుండే పెత్తనాన్ని కూడా జగన్ లాక్కుంటున్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నల్లచట్టాన్ని చించేసి చెత్తబుట్టలో వేస్తున్నా. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకంతో జగన్ ల్యాండ్ గ్రాబియింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.
టీడీపీ అంటే అభివృద్ధి `వైసీపీ అంటే విధ్వంసం…..
ప్రజాగళం మేనిఫెస్టో, సూపర్ సిక్స్, షన్ముఖ వ్యూహాన్ని నేను, పవన్ కలిసి తయారు చేశాం. మరో వైపు మోడీ గ్యారెంటీ కూడా ఉంటుంది. ఈ దేశంలోనే సంపద సృష్టించి ప్రజలకు మార్గం చూపించాను. గతంలోనే 2020 పేరుతో అభివృద్ధి చేశాను. 2029 విజన్‌తో అభివృద్ధికి బ్లూప్రింట్ సిద్ధంగావుంది. కేంద్రం సహకారంతో అమరావతి, పోలవరం పూర్తి చేస్తాం. కూటమి గెలుపు ఖాయమవ్వడంతో పెట్టుబడిదారులు రాష్ట్రంపట్ల ఆసక్తి చూపిస్తున్నారు. విధ్వంసంతో పాలన మొదలెట్టిన జగన్‌ను చూసి ఐదేళ్లలో పెట్టుబడిదారులు అసలు రాష్ట్రంవైపు కన్నెత్తి చూడలేదు అని చంద్రబాబు అన్నారు. టీడీపీ అంటే అభివృద్ధి, వైసీపీ అంటే విధ్వంసమని చలోక్తి విసిరారు. కొన ఊపిరితోవున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే `సైకోని ఇంటికి పంపాలని, అందుకు ఓటును వజ్రాయుధంగా వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆడబిడ్డల సంపద రెట్టింపు చేస్తాం…..
ఆడబిడ్డల సంపద రెట్టింపు చేయడానికి సూపర్ సిక్స్ పథకాలు తెస్తున్నామన్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని, తల్లికి వందనం పేరిట పిల్లల చదువులకు ఒక్కొక్కరికీ ఏటా రూ.15వేలు ఇస్తామని, ఏడాది మూడు సిలెండర్లు గ్యాస్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, డ్వాక్రాలకు వడ్డీలేని పదిలక్షల రుణం ఇవ్వనున్నట్టు చెప్పారు. 4 కోట్ల డ్వాక్రా సంఘాలను లక్షాధికారులుగా చేయాలన్నది మోడీ ఆశయమైతే, 2029 నాటికి చట్టసభల్లో 33 శాతం ఆడబిడ్డలు ఉంటారంటూ ఆ దిశగా అడుగులేద్దామని బాబు పిలుపునిచ్చారు. యువత కోసం ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు, రూ.3వేలు నిరుద్యోగ భృతి, ఏటా జాబ్ క్యాలెండర్, ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డిపస్సీపైనేనని ప్రకటించారు. రైతే రాజును చేసానని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. అన్నదాత కింద రూ.20వేలు, 90శాతం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తామన్నారు. అన్న క్యాంటీన్లు పునరుద్ధరించి, వృద్ధులకు పింఛన్ రూ.4వేలు మొదటి తారీఖున ఇంటిదగ్గరే అందిస్తామన్నారు. సందప సృష్టించి వచ్చిన ఆదాయం పేదవాళ్లకు పంచుతానని బాబు హామీ ఇచ్చారు.
చంద్రన్న బీమా ద్వారా సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు ఇస్తామని, ఆరోగ్య బీమా రూ.20 లక్షలు కల్పిస్తామన్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించామని, రూ.1.50 లక్షల కోట్లతో బడ్జెట్ పెడతామని, కార్పొరేషన్లు, ఆదరణ, స్వయంఉపాధి పెంచుతామన్నారు. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా బీసీలను పైకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మార్పీఎస్‌కు జనాభా దామాషా ప్రకారం న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మైనారిటీలను అన్ని విధాలుగా ఆదుకున్నామని, ముస్లింల అభ్యున్నతే లక్షంగా సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరును విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు.