పత్తికొండ(చైతన్యరథం):ఆర్థిక పరిస్థితు లు అనుకూలించని కారణంగా మన ఆడ బిడ్డలు ఇంటికే పరిమితం కాకూడదు అన్న ఆశయంతో, ‘కలలకు రెక్కలు’ అనే పథకాన్ని మన ప్రభుత్వం వచ్చాక అమలు చేయబోతున్నామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ పథ కం గురించి శుక్రవారం ఎక్స్‌లో చంద్ర బాబు పోస్ట్ చేశారు. ముందుగా మహిళా సోదరీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహి ళలంటే సమాజంలో సగం జనాభా మాత్ర మే కాదు, సమాజ శక్తిలో సగం. అందుకే మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ తెలుగుదేశం. వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఆర్థిక స్వావలంబనకు నిరంతరం పని చేసింది తెలుగుదేశం. విద్య, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఆడబిడ్డల జీవితాల్లో వెలు గులు నింపింది తెలుగుదేశం.
నేడు మళ్లీ మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు హామీ ఇచ్చిందే మహాశక్తి పథకం. ఈపథకం కింద ఇంట్లో చదువు కునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ 15,000 చొప్పున ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు నెలకు రూ.1,500ల ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున అందిస్తాం.
ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకు న్న ఆడబిడ్డలుపై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీక త్తుగా ఉంటుంది. అంతేకాకుండా కోర్సు కాలానికి ఋణంపై వడ్డీ కూడా ప్రభుత్వ మే భరిస్తుంది. కలలకు రెక్కలు పథకంలో మీపేరును ఇప్పుడే నమోదు చేసుకోవచ్చు. అందుకోసం సaశ్రీaశ్రీaసబతీవససaశ్రీబ.షశీఎ వెబ్ సైట్‌కు వెళ్లాలని చంద్రబాబు సూచించారు.