- నాలుగున్నరేళ్లలో రాష్ట్ర విద్యారంగంలో సాధించింది శూన్యం.
- 60 వేల ఉపాధ్యాయ పోస్టుల్లో ఒక్క పోస్ట్ భర్తీ చేయలేదు.
- ఉపాధ్యాయులకు ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని విస్మరించాడు
- యూనివర్శిటీలను వైసీపీ కేంద్రాలుగా మార్చాడు
- అంగన్ వాడీ కేంద్రాలకు అందించే చిక్కీల కొనుగోళ్లలో రూ.200కోట్లు..
- 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్ ల కొనుగోళ్లలో రూ.221 కోట్లు కొట్టేశాడు.
- టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనమండలి మాజీ ఛైర్మన్ మొహమ్మద్ షరీఫ్
అమరావతి : నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశాడని, నాడు- నేడు అంటూ పాఠశాలల్ని ప్రయోగశాల లుగా మార్చి, 7.85 లక్షల విధ్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలకు దూరం చేశాడని, విద్యాప్రమాణాలు గాలికి వదిలేసి.. విద్యారంగాన్ని పాతాళానికి దిగజార్చాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. విద్యానాణ్యతా ప్రమాణాల్లో టీడీపీప్రభుత్వంలో దేశంలో 3వస్థానంలో ఉన్న రాష్ట్రం.. జగన్ హాయాంలో 19వ స్థానానికి పడిపోయిందని వెల్లడిరచారు. టీడీపీ ప్రభుత్వంలో పదోతరగతి ఉత్తీర్ణతాశాతం 92.9శాతముంటే, జగన్ హాయాంలో అది 69.76 కు పడిపోయిందన్నఆరు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం….! ‘‘ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయుల్ని నియమిస్తామని గతంలో మంత్రి బొత్స చెప్పాడు. కానీ ఈ ప్రభుత్వ నిర్వాకంతో ప్రాథమిక పాఠశాలలు చివ రకు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. గతంలో రాష్ట్రంలో 5 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 9,600కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 4,300 ప్రాథమిక పాఠశాలల్ని జగన్ రెడ్డి విలీనం చేయడం ద్వారా, దళిత.. బడుగు బలహీనవర్గాలకు చెందిన దాదాపు లక్షమంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు.
ప్రతిభా పురస్కారాల పథకానికి అబ్దుల్ కలాం పేరు తీసేసి..తన పేరు పెట్టిన జగన్ .. పేదవిద్యార్థులకు ప్రోత్సాహక పురస్కారాలు ఇవ్వడమే ఆపేశాడు
ప్రాథమిక విద్యకు పూర్తిగా పాతరేసిన జగన్ ప్రభుత్వం ఉన్నత విద్యను కూడా పూర్తిగా అటకెక్కించింది. సొంతరాష్ట్రంలో సరైన విద్యాబోధన లేదని ఏపీ విద్యార్థు లు ఇంజనీరింగ్ విద్యాభ్యాసం కోసం పొరుగురాష్ట్రాలకు తరలిపోయారు. టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల్ని విద్యలో ప్రోత్సహించడానికి ఏ.పీ.జే.అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు అందించేది. జగన్ రెడ్డి ఆ పథకం పేరు మార్చి, అబ్దుల్ కలాం పేరు తీసేసి జగనన్న ఆణిముత్యాలు అంటూ తనపేరు పెట్టి పురస్కారాలు ఇవ్వడాన్ని నిలిపేశాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు తొలగించి, తనపేరు పెట్టుకోవడం జగన్ ప్రచార పిచ్చికి నిదర్శనం. ఏ ప్రభుత్వ పథకానికి ఇతరపేర్లు ఉండకూడదు.. తనపేరే ఉండాలనే జగన్ సంకుచిత మనస్తత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
నీతి అయోగ్ సర్వేలో టీడీపీ హాయాంలో విద్యానాణ్యతా ప్రమాణాల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉంటే.. నేడు 19వ స్థానానికి పడిపోయింది.
కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్-2023లో రాష్ట్రంలోని విద్యాసంస్థలు చిట్టచివరి స్థానంలో నిలిచాయి. 2019లో టీడీపీప్రభుత్వంలో ఆంధ్రాయూనివర్శిటీ దేశంలోనే 28వ ర్యాంకులో ఉంటే, నేడు 76వ ర్యాంకుకి దిగజారిపోయింది. దేశవ్యాప్తంగా నీతిఅయోగ్ నిర్వహించిన సర్వే ప్రకారం టీడీపీ హాయాంలో విద్యానాణ్యతా ప్రమాణాల్లో రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో ఉంటే, నేడు జగన్ రెడ్డి పాలనలో 19వ స్థానానికి పడిపో యింది. టీడీపీ ప్రభుత్వంలో పదోతరగతి ఉత్తీర్ణతాశాతం 92.9శాతముంటే, జగన్ హాయాంలో అది 69.76కు పడిపోయింది. వైసీపీ ప్రభుత్వం విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకపోవడం.. విద్యారంగానికి సరైన ప్రోత్సాహం అందించనందునే విద్యారంగం నానాటికీ దిగజారుతోంది. ఆంగ్లభాషపై మోజుతో మాతృభాషకు తూట్లు పొడుస్తున్న జగన్ ప్రభుత్వం… రాష్ట్ర విద్యావ్యవస్థను నిర్వీ ర్యం చేసింది.
60 వేల పోస్టుల్లో నాలుగున్నరేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీచేయని జగన్ రెడ్డి.. విద్యార్థుల్ని ఉద్ధరించానని చెప్పడం సిగ్గుచేటు. విదేశీవిద్య పథకం ద్వారా చంద్రబాబు 4,967 మంది యువతను విదేశాలకు పంపితే.. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో కేవలం 357 మందినే పంపాడు
విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లుగా తన వర్గం వారినే నియమించిన జగన్ రెడ్డి , యూనివర్శిటీలను వైసీపీ కార్యాలయాలుగా మార్చాడు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తాననే హామీని తుంగలో తొక్కి, లక్షలాది నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీఉంటే, నాలుగున్న రేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కపోస్ట్ కూడా భర్తీ చేయలేదు. ఉపాధ్యాయుల నియామకం చేపట్టబోమ న్న హామీ ఇచ్చి ప్రపంచబ్యాంక్ నుంచి రూ.2 వేల కోట్ల రుణం పొందిన ఘనత ఈ ప్రభుత్వానిదే. టీడీపీప్రభుత్వం విదేశీవిద్య పథకం కింద ఐదేళ్లలో దాదాపు 4,967 మంది పేదయువతను విదేశాలకు పంపితే, నాలుగు న్నరేళ్లలో జగన్ రెడ్డి కేవలం 357 మందిని మాత్రమే విదేశాలకు పంపాడు. అమ్మఒడి పథకంపై గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కార్.. రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి సాయం అందిస్తోంది. దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు చదువుని దూరం చేసేలా పథకాన్ని తూతూమంత్రం గా అమలు చేస్తోంది. 44 లక్షల విద్యార్థులకు ఏకంగా ఒక ఏడాది అమ్మఒడి సాయం జగన్ రెడ్డి ఎగ్గొట్టాడు. ఏటా రూ.15వేలు ఇస్తానని చెప్పి.. వివిధ కారణాలతో ఆ సాయాన్ని రూ.13 వేలకు పరిమితం చేశాడు. 4 ఏళ్లలో 3 సార్లు మాత్రమే అమ్మఒడి ఇచ్చిన జగన్ రెడ్డి.. కుంటిసాకులు చెప్పి 1,34,000 మంది విద్యార్థలకు పథకం ఎగ్గొట్టాడు. అమ్మఒడి కింద నాలుగేళ్లలో రూ.25వేల కోట్లు ఖర్చుచేసిన జగన్ రెడ్డి.. నాన్న బుడ్డి ద్వారా కల్తీ మద్యం అమ్మి దాదాపు లక్షకోట్లు కొల్లగొట్టాడు. విద్యాదీవెన పథకం పేరుతో ఫీజు రీయింబర్స్ మెంట్ కు పంగనామాలు పెట్టాడు. టీడీపీ ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తే … జగన్ రెడ్డి నాలుగేళ్లలో కేవలం 9.86 లక్షల మందికి మాత్రమే అందించాడు. టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ కు రూ.10,136 కోట్లు ఖర్చుపెట్టి, రాష్ట్ర బడ్జెట్లో 1.43 శాతం నిధులు కేటాయిస్తే, జగన్ రెడ్డి నాలుగేళ్లలో కేవలం 0.93 శాతం నిధులు మాత్రమే కేటాయించాడు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ సరిగా ఇవ్వకపోవడంతో ..దాదాపు లక్షమంది దళిత.. బీసీ యువత ఉన్నత విద్యకు దూరమయ్యారు. విద్యాకానుక కింద నాణ్యతలేని బ్యాగులు.. యూనిఫామ్.. ఉపయోగపడని పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందించిన ఘనత ఈ ప్రభుత్వానిది.
విద్యార్థులకు ట్యాబ్ లు అందించే ముసుగులో జగన్ రెడ్డి రూ.221కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు. అంగన్ వాడీ కేంద్రాలకు అందించే చిక్కీల కొనుగోళ్ల లో రూ.200కోట్లు దోచేశాడు
అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసిన జగన్ రెడ్డి.. చిన్నపిల్లలకు అందించే ఆహార పదార్థాల్లో కూడా కక్కుర్తి పడుతూ.. పురుగులు పట్టిన చిక్కీలు, పురుగులన్న పిండి.. బియ్యం, కుళ్లిపోయిన కోడిగుడ్లు, పాము కళేబరాలున్న ఖర్జూరాలు సరఫరా చేస్తున్నాడు. చిక్కీల కొనుగోలులో ఈ ప్రభుత్వం రూ.200 కోట్ల అవినీతికి పాల్పడిరది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు అందిస్తున్నామంటూ ఆ ముసుగులో దాదాపు రూ.221 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. కేవలం రూ.9వేలు విలువచేసే ఒక్కోట్యాబ్ ను రూ.13,262కు కొనడం ద్వారా ముఖ్యమంత్రి తన పుట్టినరోజు కానుకగా ట్యాబ్ లు ఇస్తున్నానని చెప్పి భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. నాడు-నేడు పథకంలో కూడా ముఖ్యమంత్రి చేతివాటం చూపారు. విద్యాకమిటీల్లో విద్యార్థుల తల్లిదండ్రులను కాదని, వైసీపీనేతల మాట వినే ఉపాధ్యాయుల ద్వారా నాసిరకంగా పనులు చేయించి ప్రజలసొమ్ము తినేశాడు. నాడు-నేడు పనులపేరు చెప్పి ఈ ప్రభుత్వం తొలుత ఇంటర్ బోర్డ్ నుంచి రూ.90కోట్లు, తర్వాత మరో రూ.20 కోట్లు.. మొత్తంగా రూ.180 కోట్లు తీసుకొని సదరు బోర్డునే నిర్వీర్యం చేసింది.
సీపీఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారని.. రోడ్లెక్కిన ఉపాధ్యాయులపై ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన ఘనుడు ఈ ముఖ్యమంత్రి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీలో నిరక్షరాస్యత రేటు 30శాతం ఉంటే.. జాతీయ సగటు 22 శాతముంది. అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో నిరక్షరాస్యత రేటుని 0 (సున్నా) కి చేరుస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రప్రభుత్వం నుంచి రూపాయి కూడా కేటాయిం చకుండా కేంద్రప్రభుత్వమిచ్చిన నిధుల్ని కూడా దారిమళ్లించాడు. జగన్ నిర్వాకంతో ఇప్పుడు రాష్ట్రంలో నిరక్షరా స్యత రేటు 32.5 శాతానికి పెరిగింది. జగన్ రెడ్డి పాలనతో విద్యారంగం నిర్వీర్యమైతే.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేకంటే.. పనికి పంపడమే నయమనుకునే పరిస్థితికి వచ్చారు.’’ అని షరీఫ్ స్పష్టం చేశారు.