- ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలకు వైసీపీ ప్రలోభాలు
- ఎన్నికల కోడ్ ఉల్లంఘించి వాలంటీర్లతో ఎన్నికల ప్రచారం
- మహిళలే జగన్‌రెడ్డిని గద్దె దించుతారు
- టీడీపీ నాయకురాలు ఆచంట సునీత ధ్వజం
అమరావతి (చైతన్యరథం): ఓటమి ఖాయమని అర్థమయ్యే సరికి జగన్‌రెడ్డి ప్రభుత్వం, ఓటర్లను ప్రలో భాలు గురిచేస్తోందని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు. మహిళలకు తాయిలాలు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు వైకాపా అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారని సునీత మండిపడ్డారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆచంట సునీత మాట్లాడుతూ ఎన్ని తాయిలాలిచ్చినా జగన్‌రెడ్డికి మహిళలు ఓటెయ్యబోరన్నారు. వైసీపీ సర్కార్ ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించడంతో పాటు ఎన్నికల కమిషన్ చెప్పినా బేఖాతరు చేస్తూ వాలంటీర్లతో ఎన్నికల ప్రచారం చేయి స్తోంది. డ్వాక్రా సంఘాలను నడిపించే ఆర్పీలను కూడా ప్రలోభ పెట్టేందుకు వైసీపీ సర్కార్ యత్నించడం
దిగజారుడుతనానికి నిదర్శనం.
ఐదు సంవత్సరాల పాలన చూసి ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి ‘అన్ ఫిట్’ అని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక ఏం చేసినా గెలవబోమని జగన్‌రెడ్డికి అర్థమయ్యింది. అందుకే తన అభ్యర్ధుల చేత డ్వాక్రా మహిళలకు చీరలు, కుక్కర్లు, కాళ్ళ పట్టీలు ఇస్తామంటూ రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ… మరోమారు ఓటు వేయాలని బతిమిలా డుకుంటున్నారు. ఆసరా అంటూ చెప్పి జనవరి 20న జగన్ బటన్ నొక్కితే ఇప్పటికీ ఆ డబ్బులు డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ అవ్వలేదు. ప్రజా ధనంతో కార్యక్రమాలు నిర్వహించి నీచ రాజకీయాలు చేస్తున్నా రని సునీత ధ్యజమెత్తారు.
డ్వాక్రా మహిళలకు జగన్ చేసింది శూన్యం
విజయవాడ సెంట్రల్, పెనమలూరు, శ్రీకాకుళం, చంద్రగిరి నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు ప్రలోభాలు పెట్టి, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీటిపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిపై భౌతిక దాడులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వాలంటీర్లను గడప గడపకు పంపించి ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తోంది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వాలంటీర్లతో నిర్వహిస్తున్న సమావేశాన్ని అడ్డుకున్న టీడీపీ అభ్యర్ధి రామాంజ నేయులుపై దాడికి ప్రయత్నించారు. మహిళా దినోత్సవం పేరుతో డ్వాక్రా ఆర్పీలు, యానిమేటర్లకు బాపట్లలో వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి తాయిలాలు ఇచ్చాడు.
నాడు చంద్రబాబు డ్వాక్రా మహిళలను ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టారు.
డ్వాక్రా మహిళా అంటే తన కాళ్ల మీద తను నిలబడి కుటుంబానికి ఆలంబనగా ఉండాలనే సదుద్దేశంతో చంద్రబాబు ఎంతో కృషి చేశారు. కానీ జగన్ రెడ్డి మాత్రం తన కార్యక్రమాలకు రాకపోతే రుణాలు ఇవ్వబోమని, కుటుంబసభ్యులకు పెన్షన్ కట్ చేస్తామని బెదిరించి డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశాడు. ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో డ్వాక్రా మహిళలకు చేసిన సంక్షేమం శూన్యమని సునీత మండిపడ్డారు.
జగన్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకొని డ్వాక్రా సంఘాల మహిళలను ఓట్లు అడగడానికి వస్తున్నారు? అభయహస్తం పేరుతో డ్వాక్రా మహిళలు దాచుకున్న రూ.2 వేల కోట్లు కూడా జగన్ రెడ్డి దారి మళ్లించాడు. ఇళ్ల నిర్మాణాల పేరుతో డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న సొమ్మును కూడా జగన్‌రెడ్డి దొంగతనం చేశాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని మరోమారు గెలిపించకూడదని డ్వాక్రా మహిళలు గట్టిగా నిర్ణయించుకున్నారని సునీత అన్నారు.
జగన్‌కు ఓటెయ్యరు
ఇచ్చిన హామీలను మరిచి డ్రాక్రా మహిళలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లను జగన్‌రెడ్డి మోసం చేశాడు. హక్కుల కోసం పోరాడిన అంగన్వాడీ మహిళలపై ఎస్మా ప్రయోగించి, పోలీసులతో కొట్టించి, వారిని ఇబ్బందులకు గురి చేశాడు. కానీ తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసింది. రంపచోడవరంలో ఒక అంగన్వాడీ టీచర్‌కు అభ్యర్థిగా టీడీపీ అవకాశం కల్పించింది. అవినీతి రహిత పరిపాలన కావాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి… చంద్రబాబు రావాలి అని అన్ని వర్గాల ప్రజలు నిశ్చయించుకున్నారు. మరో 53 రోజుల్లో జగన్ రెడ్డి కుర్చీ మడతపెట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని ప్రలోభాలు, ఇబ్బందులు పెట్టినా మహిళలెవరూ జగన్ రెడ్డికి ఓటు వేయరు. తెలుగుదేశాన్ని గెలిపించేందుకు మహిళలు కంకణం కట్టుకున్నారని సునీత స్పష్టం చేశారు.