అమరావతి: వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకునే టీడీపీ నేతలపై దాడులకి తెగబడుతున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భీమవరం టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడుపై వైసీపీ నేత కొటాల చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు హత్యాయత్నానికి పాల్పడటం దారుణం అన్నారు. మునిరత్నం నాయుడు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.. ఆయన త్వరగా కోలుకోవాలని లోకేష్ ఆకాంక్షించారు. ఆయనకు అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.