- 7న ప్రమాదం జరిగితే పట్టించుకోలేదు
- ఆమె చనిపోగానే శవరాజకీయం మెదలెట్టారు
- వైసీపీకి బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శ
అమరావతి: తెనాలిలో గీతాంజలి అనే మహిళ మృతిపై వైసీపీ అత్యంత దుర్మార్గంగా అసత్య ప్రచారం చేస్తోందని టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో సజ్జా అజయ్ ట్రోల్ చేయటం వల్లే గీతాంజలి మృతి చెందిందన్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా సౌమ్య తీవ్రంగా ఖండిరచారు. రైలు ప్రమాదం వల్లే గీతాంజలి చనిపోయిందని తొలుత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మళ్లీ ఆత్మహత్యగా ఎందుకు తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? గీతాంజలి రైలు ప్రమాదంలో గాయపడిరది ఈనెల 7 వ తేదీ. సజ్జా అజయ్ వీడియో మాట్లాడిరది 10వ తేదీన. గీతాంజలి నిజంగా ఆత్మహత్య చేసుకుంటే 4 రోజులుగా కేసు ఎందుకు నమోదు చేయలేదు? 7వ తేదీ ప్రమాదం జరిగితే ఇన్ని రోజులు పట్టించుకోని వైసీపీ నేతలు ఆమె చనిపోగానే శవ రాజకీయం మొదలెట్టారు. సొంత బాబాయిని చంపి గుండెపోటు, నారా వారి రక్త చరిత్ర అంటూ కధలు అల్లిన జగన్ రెడ్డికి, వైసీపీ నేతలకు సామాన్య ప్రజల మృతిపై కట్టు కధలు అల్లి ప్రతిపక్ష పార్టీలపై బురద చల్లటం ఓ లెక్కా. శవ రాజకీయాలు చేస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని సౌమ్య స్పష్టం చేశారు.