- డైవర్షన్ రాజకీయాలకు తెర లేపారు బ రెండేళ్ల తరువాత అరెస్టులు చేయడం ఏంటి?
అమరావతి: అమరావతి రైతుల మహాపాద యాత్రకు అపూర్వ స్పందన రావడంతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైందని, దాంతో డైవర్షన్ రాజకీయా లకు తెరలేపారని టీడీపీ ఎమ్మెల్యే డోల బాలవీరాంజ నేయస్వామి మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి సీబీఐ అధికారులు అయిదుగురిని అరెస్టు చేసి, ఇద్దరిని కోర్టుకు హాజరు పరచారు. కోర్టు వారికి రిమాండ్ విధించకుండా 41ఎ నోటీసులు ఇవ్వమని తిప్పి పంపింది. ఈ తీరు చూస్తుంటే వైసీపీ ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ పరిపాటి అని అర్థమవుతుంది. రైతులు చేస్తున్న అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర విజయవంతం కానుంది. అమరావతి రాజధా నికి, రైతులకు వస్తున్న ఆదరణని చూసి వైసీపీ నాయకులు ఓర్వ లేకపోతున్నారు. ప్రతిపక్ష టీడీపీ అసెంబ్లీ లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపిస్తుందనే ఆందోళనతో వైసీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారని అన్నారు. రెండేళ్ల తరువాత అరెస్టులు ఏమిటి? అని మండ్డిపడ్డారు. 2020లో కేసు నమోదు చేసి రెండేళ్ల తరువాత అరెస్టులు చేయడం అందులో భాగమే. ఆ కేసులో ఏ1 నిందుతుడిగా ఉన్న వ్యక్తిని నేటికీ అరెస్ట్ చేయ లేదు. రాజకీయంగా ఇబ్బంది పెట్టేవారి పేర్లను తీసు కుని వాళ్ళను అరెస్ట్ చేయిస్తున్నారు. ఉదాహరణకు వైసీపీ నాయకుడు బ్రహ్మానందరెడ్డిని అరెస్ట్ చేయ కుండా వదిలేశారు.
రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగస్థులని, మాజీ మంత్రి నారాయణను అమరావతి అసైన్డ్ భూముల కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై పెట్టే ప్రివెన్షెన్ ఆఫ్ కరెప్షన్ కేసులు రామకృష్ణా హౌసింగ్ ఉద్యోగస్థులపై ఎలా పెడతారు? మాజీ మంత్రి నారాయణ దళితుల భూములను ఉద్ధేశ పూర్వకంగా కొట్టే శారనడం అన్యాయం. మాజీ మంత్రి నారాయణ రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్లతో ఆర్థిక లావా దేవీ లు జరిపారని చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. రామ కృష్ణా హౌసింగ్ వాళ్లతో నారాయణ తన బిజినెస్‌కు సంబంధించిన లావాదేవీలు మాత్రమే జరిపారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లని రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీలకు, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపారట్మెంటుకు సమర్పించారు.