.దొంగలకు అధికారమిస్తే పాలన ఇలాగే ఉంటుంది!
.ప్రజలు నేతల ట్రాక్ రికార్డును చూసి ఎన్నుకోవాలి
.కేసులకోసం జగన్ రెడ్డి దేనినైనా తాకట్టు పెడతాడు!
.పోలవరంపై అవాస్తవాలు చెప్పిన ఫేక్ ఫెలో జగన్ రెడ్డి
.మెడలు వంచుతానని తల దించారేం?
.పోలవరం కట్టలేనని చేతులెత్తేసిన అసమర్థుడు జగన్
.అధికారంలోకి వచ్చాక పోలవరం నిర్వాసితులకు న్యాయం
.చేతగాని సిఎంపై నిప్పులు చెరిగిన చంద్రబాబునాయుడు
అల్లూరి జిల్లా: పోలవరం నిర్వాసితుల పునరావాసం కోసం రాజీనామా మా ఎంపిలు రెడీ… వైసిపి ఎంపిలతో రాజీనామా చేయించడానికి జగన్ సిద్దమేనా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. 25 మంది ఎంపిలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్నాడు… ఇప్పుడు ఎందుకు మెడలు దించుతున్నాడని ప్రశ్నించారు. వైసిపి ఎంపిలు రాజీనామాలు చేస్తే పోలవరం పరిహారం వస్తుందని తెలిపారు. రాష్ట్రం ఏమైపోయినా కేసుల నుంచి బయటపడాలన్నది ఒకటే జగన్ లక్ష్యం… ఇందుకోసం ఆయన దేనినైనా తాకట్టుపెడతారని దుయ్యబట్టారు. ఎటపాక, కూనవరం, విఆర్ పురం, మండలాల్లోని పలు గ్రామాల్లో పోలవరం నిర్వాసితులు, గోదావరి వరద బాధితులకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అంతకు ముందు భద్రాద్రి రామయ్యను టిడిపి అధినేత దర్శించుకున్నారు. అనంతరంభద్రాచలం కరకట్టను అధినేత సందర్శించారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులు, వరద బాధితులనుద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ప్రజలు నేతల ట్రాక్ రికార్డు చూసి ఎన్నుకోవాలి…దొంగలకి అధికారం ఇస్తే ఏమౌతుందో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు… డ్రైవింగ్ రానివాడికి రాష్ట్రాన్ని అప్పగించటంతో ప్రజా జీవితం తలకిందులైందని చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో చేతగాని దద్దమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. పోలవరం కట్టలేను… పరిహారం ఇవ్వలేను అని జగన్ తేల్చేశాడు.
జగన్ ఏం చేశాడని 175 కు 175 సీట్లు ఇస్తారని అని జగన్ అంటున్నాడు… ఇప్పటి ఆయన చేతగాని పాలన చూసి జనం జగన్ ప్రభుత్వానికి జనం నెగటివ్ మార్కులు వేస్తారని అన్నారు. రోడ్డు కూడా లేని పాడేరులో జిల్లా కేంద్రం పెట్టారు. పోలవరం ముంపు ప్రాంతాల వారు పాడేరు ఎలా వెళతారని ప్రశ్నించారు. జిల్లా కేంద్రం కంటే అమరావతి, హైదరాబాద్ ఈ ప్రాంతం వాళ్లకు దగ్గర… పోలవరం కోసం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాలని విజ్జప్తిచేశారు. పోలవరం కేంద్రంగా ముంపు మండలాలతో జిల్లా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలు జీవితాల్లో వెలుగు తీసుకువస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఫలానా ప్రదేశంలో పిడుగు పడుతుంది అనే హెచ్చరికలు చేసే వ్యవస్థ కూడా ఎపిలో తీసుకువచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు గోదావరి వరద వస్తే హెచ్చరించే వ్యవస్థ కూడా లేదన్నారు. తోటపల్లిలో పిడుగు పాటుకు గురై చనిపోయిన శ్రీదేవి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఇంత వరద కష్టం వస్తే…. ప్రభుత్వం ఇచ్చే రెండు వేలు ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. వరదలు వస్తే సిఎం జగన్ గాల్లో తిరిగాడు…10 కిలోమీటర్లకు కూడా జగన్ హెలికాఫ్టర్ ఎక్కాడు. ప్రజల కోసం కష్టమైనా పలకరించాలని బాధ్యతతో ఇంత దూరం వచ్చానని చంద్రబాబునాయుడు తెలిపారు. వరదలు వచ్చినప్పుడు సిఎంకు ప్యాలెస్‌లో ఏం పని అని ప్రశ్నించారు. పోలవరం ముంపు బాధితులకు ఆర్ అండ్ ఆర్ కింద జగన్ ఇస్తానని చెప్పిన రూ.10లక్షలు ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబునాయుడు నిలదీశారు. ఎకరానికి అదనంగా 5 లక్షలు ఇస్తాను అన్నారు…ఇచ్చారా? వరద బాధితులకు 4ఉల్లిపాయలు, 4టమోటాలిచ్చి అన్ని సమస్యలు తీర్చేశానని జగన్‌రెడ్డి చెప్తున్నారు. ఇంట్లో ఇద్దరున్నా, అయిదుగురు ఉన్నా ఒకే తరహా సాయం అందించటం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. వరద ప్రాంతాలకు సీఎం ప్రజలపై ప్రేమతో రాలేదు, మొక్కుబడిగా వచ్చి వెళ్ళాడు… గోదావరి వరదతో ఇళ్లలో ఫ్యాన్ కి 2అంగుళాల బురద పట్టి పనిచేయకుండా పోయాయి. ఆ స్థాయి వరద వచ్చిందని అన్నారు. వైసిపి ఫ్యాన్ ఆపితే కానీ ప్రజల కష్టాలు తీరవు… గాలికొచ్చి గాలికి కొట్టుకుపోయే పార్టీ వైకాపా… పోలవరం పరిహారంపై అసత్యాలు చెప్పిన ఫేక్ ఫెలో జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.