.ఆందోళన వ్యక్తం చేసిన టిడిపి నేతలు, కార్యకర్తలు
పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేరు సభ అధ్యక్షునిగా శిలాఫలకంలో చివర్లో వేయడంపై టిడిపి నేతలు ఆందోళన చేశారు. వేదికపైకి వెళ్తున్నఎమ్మెల్యేను వైసీపీ కార్యకర్తలు కిందకు నెట్టడంతో తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ మాత్రమే మాట్లాడి.. లబ్ధిదారులకు పట్టాలిచ్చి వెళ్లిపోవడంతో.. ఎమ్మెల్యేకు మైకు ఇవ్వరా అని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ప్రజలకు, టిడిపి నాయకులకు సమాధానం చెప్పలేక మంత్రులు పారిపోయారంటూ నిమ్మల మండిపడ్డారు.