- జూన్ 21న కృష్ణానది వంతెనపై నిర్వహణ
- అమరావతిలో 25 వేల మందితో ఆసనాలు
- జూన్ 7 నుంచి 14 రోజుల పాటు
- రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు
- వెయ్యి మందితో జిల్లా కేంద్రాల్లో ఈవెంట్స్
- కోటి మంది భాగస్వామ్యానికి కార్యాచరణ
- యోగా డేపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహ ణకు సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా యోగాంధ్ర 2026పై తలపెట్టిన కార్యక్ర మాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. యోగాంధ్ర -2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాజధాని అమరా వతిలో 25 వేల మందితో నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణా నది వంతెనపై యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణంలో భాగంగా నదిపై నిర్మించిన బ్రిడ్జిపై ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న నిర్వహి స్తారు. అలాగే అదేరోజు జిల్లా కేంద్రాల్లో 1000 మందితో నిర్వహించే కార్యక్ర మాల్లో మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారు.
యోగాంధ్ర కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో, అన్ని స్థాయిల్లో, అన్ని విభాగాల్లో నిర్వహించాలని సీఎం సూచించారు. మొత్తంగా కలిపి కోటి మంది భాగస్వాములు అయ్యేలా కార్యాచర ణ సిద్ధం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.50 లక్షల మంది ట్రైనర్లకు అందనంగా మరో లక్ష మందిని ట్రైనర్లుగా చేసేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ఒక జిల్లా ఒక థీమ్‌తో 14 రోజుల యోగాంధ్ర నిర్వహిస్తారు. జిల్లాల్లో యోగాంధ్ర నిర్వ హణకు జిల్లాకు రూ.25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు.
అన్ని శాఖల సమన్వయం..కోటి మంది భాగస్వామ్యం
ఆరోగ్య, మానవవనరులు, మునిసిపల్, పంచాయతీరాజ్, దేవాదాయ, ఐటీ శాఖల సమన్వయంతో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి జిల్లాలోని రెండు ప్రముఖ టూరిస్టు ప్రాంతాల్లో అంటే 56 టూరిస్టు కేంద్రాల్లో ప్రత్యేక సెషన్స్ నిర్వహి స్తారు. ఒకరోజు రెండు జిల్లాల చొప్పున 500 మందితో టూరిస్టు ప్రాంతాల్లో యోగా నిర్వహిస్తారు. అలాగే 14 రోజుల పాటు పార్కులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం కార్యాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహి స్తారు. యోగాంధ్ర ఈవెంట్స్‌కు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు అవార్డులు చేస్తారు.
మంతెన సత్యనారాయణరాజు ప్రత్యేక వీడియోలు
రాష్ట్ర ప్రభుత్వ యోగా, నాచురోపతి విభాగ సలహాదారు మంతె న సత్యనారాయణరాజు యోగాంధ్ర నిర్వహణకు సంబంధించి రూపొందించిన పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించా రు. యోగాపై అవగాహనకు, శిక్షణకు తాను చేపట్టిన కార్యక్ర మాలను సత్సనారాయణరాజు సీఎంకు వివరించారు. 90 ఆసనా ల వీడియోలు, 21 ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఆసనా లు వీడియోలు, రోజువారీ సాధన కోసం యోగాసనాలు, ప్రాణా యామంపై 7 వీడియోలు, యోగా సందేహాలు ప్రశ్నలు-సమా ధానాలపై చేసిన వీడియోలను పబ్లిక్ డొమైనులో పెట్టనున్నట్లు తెలిపారు. మీడియా, సోషల్ మీడియా, వివిధ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. 8142404888 నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఈ వీడి యోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సత్యనారాయణరాజు వివరించా రు. ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, సత్యకుమార్, ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్‌తో పాటు సీఎస్ సాయి ప్రసాద్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, కమిషనర్ వీరపాండియన్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














