- చంద్రబాబు పరిశ్రమలు తెస్తే, జగన్ బూమ్ బూమ్ తెచ్చాడు
- టీడీపీ అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుచేస్తాం
- కేజీ టు పీజీ సిలబస్ ప్రక్షాళన… మహిళలను గౌరవించేలా పాఠాలు
- యువతతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్
అమలాపురం: రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవితకు ఎంతో కీలకం, యువత పవర్ ఏంటో యువఓటర్లు మొదటి సారి జగన్ కి చూపించాలని యువనేత నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలి..మార్పు రావాలి అనుకోవడం కాదు… మార్పు కోసం మీరు ముందుకు రావాలని అన్నారు. అమలాపురం సమీపంలోని భట్నవిల్లిలో యువతతో జరిగిన ముఖాముఖి సమావేశంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… ఏపీలో ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు… రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉండేది. జగన్ ఏపీ ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మార్చేశాడు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి కియా, ఫాక్స్ కాన్ లాంటి కంపెనీలు వచ్చాయి. జగన్ హయాంలో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ వచ్చాయి. టీడీపీ హయాంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు అని వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ సిలబస్ ప్రక్షాళన చేస్తాం. విద్యార్థి స్థాయి నుండే మహిళల విలువ తెలిపి గౌరవించే విధంగా ప్రత్యేక పాఠాలు ప్రవేశ పెడతాం. మహిళల్ని ఇబ్బంది పెట్టే వారిని శిక్షిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని అమలుచేస్తాం
విద్యా దీవెన, వసతి దీవెన అంటూ కొత్త పథకాలు తెచ్చి వ్యవస్థ ను జగన్ నాశనం చేసాడు. దీని వలన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. టిడిపి , జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌పథకాన్ని ప్రారంభిస్తాం. టీడీపీ – జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. జగన్ లా జాబ్ లెస్ క్యాలెండర్ కాదు… ప్రతి ఏడాది ఒక పద్ధతి ప్రకారం పెండిరగ్ లో ఉన్న అన్ని ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం.
గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తాం!
నూతన విద్యా విధానం పేరుతో టీచర్ పోస్టులకు జగన్ కోత పెడుతున్నాడు. జగన్ భర్తీ చేస్తానని చెప్పిన 2.30 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ లేదు. జగన్ పుణ్యమా అని ఏపీి లో ప్రతి వీధిలో గంజాయి దొరుకుతోంది. స్కూల్ దగ్గర నుండి మెడికల్ కాలేజ్ వరకూ అందరినీ గంజాయి కి బానిసలుగా చేస్తుంది. టీడీపీ – జనసేన అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా అభివృద్ధి చేస్తాం. జగన్ పాలనలో ఆక్వా కి, వరి, ఇతర రైతులకు గిట్టుబాటు ధర లేదు.. ఏపీ లో కేవలం గంజాయి కి మాత్రమే గిట్టుబాటు ధర ఉందని లోకేష్ విమర్శించారు.
ఎయిడెడ్ విద్యావ్యవస్థను నాశనం చేసిన జగన్
టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 3 వేల కోట్లు ఖర్చు చేశాం. జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ వ్యవస్థ ను నాశనం చేసింది. టీడీపీ – జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన మేర ప్రభుత్వ కాలేజీలు ప్రారంభిస్తాం. ఫిజియోథెరపీ విలువ నాకు పాదయాత్ర ప్రారంభించిన తరువాత తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రు ల్లో ఫిజియథెరపీ పోస్టులు కల్పించేలా అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటాం. టీడీపీి అధి కారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఎవరైనా అడిగితే చెప్పే పరిస్థితి లేకుండా చేసాడు. చంద్రబాబు అమరావతి ని రాజధానిగా ప్రకటించి ఇతర జిల్లాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ చేసారు. జగన్ ప్రభుత్వం అడ్వకేట్లను కూడా ఇబ్బంది పెడుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూవివాదాల పరిష్కారం కోర్టులో కాకుండా రాజకీయ నాయకులు ప్రమేయంతో జరిగే వ్యవస్థ తీసుకురావాలని అనుకుంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తుల పై పెత్తనం చెయ్యాలని జగన్ ఆలోచిస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తెచ్చిన కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం.
రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం బాబువల్లే సాధ్యం
జగన్ పాలన ముగిసే సరికి ఏపీి అప్పు రూ. 12 లక్షల కోట్ల కు చేరుతుంది. జగన్ గ్రోత్ ఇంజిన్ ని ఆపేసాడు. జగన్ వలన రాష్ట్రం పరువు పోయింది. అమర్ రాజా లాంటి అనేక కంపెనీలను పక్క రాష్ట్రానికి తరిమేశాడు. విశాఖ మిలీనియం టవర్స్ కి నేను తెచ్చిన ఐటి కంపెనీలకు తరిమేసి సచివాలయం చేస్తానని జగన్ అంటున్నాడు. రాష్ట్రం పై పోయిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. రాష్ట్రం పరువు నిలబెట్టడం ఒక్క చంద్రబాబు గారితోనే సాధ్యమని లోకేష్ అన్నారు.
అభివృద్ధి-సంక్షేమాలను అమలుచేస్తాం
అభివృద్ధి, సంక్షేమం టీడీపీికి జోడేద్దుల బండి. టీడీపీి-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షే మంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. దివంగత బాలయోగి అమలాపురం రైల్వే లైన్ కోసం ఎంతో కృషి చేశారు. కానీ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రాన్ని ఒప్పించి చంద్రబాబు పనులు ప్రారంభించేలా చేసారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు నిలిపేశారు. 25 కి 25 పార్లమెంట్ సీట్లు టీడీపీకి ఇవ్వండి. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల లో అమలాపురం రైల్వే లైన్ తో పాటు మెరుగైన రోడ్లు వేస్తాం.
యువతతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు
జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్ మోసం చేసారు. మీ ప్రభుత్వం వచ్చిన తరువాత నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీచేయండి. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మీ ప్రభుత్వం వచ్చాక భద్రత కల్పించండి. టీడీపీ హయాంలో 2 డీఎస్సీ లు ఇచ్చారు. జగన్ చెప్పిన మెగా డీఎస్సీ ఇప్పటి వరకూ రాలేదు. వయస్సు అయిపోతుంది. అనేక సార్లు ప్రభు త్వాన్ని వేడుకున్నా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చెయ్యలేదు. నిరుద్యోగ రత్నాలు అంటూ జగన్ పాలన లో కానిస్టేబుల్, ఉపాధ్యాయ ఇతర పోస్టులు భర్తీ చెయ్యలేదు అంటూ తాను తయారు చేసిన పోస్టర్‌ని ఒక యువకుడు లోకేష్‌కి చూపించాడు.
గంజాయి ఎక్కువైంది!
రాష్ట్రంలో గంజాయి ఎక్కువ అయ్యింది. మీ ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిని కంట్రోల్ చేయండి. ఫిజియోథెరపీ చదివిన విద్యార్థులకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు, ప్రాక్టీస్ చేసేలా విధానం తీసుకురావాలి. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను జగన్ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసింది. దీని వలన ఎంతో మంది విద్యకు దూరం అవుతున్నారు. విద్యా దీవెన, వసతి దీవెన వలన అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు జాయింట్ అకౌంట్ అంటూ కొత్త రూల్స్ పెడుతున్నారు. మాకు నిరుద్యోగ భృతివద్దు… ఉద్యోగా లు కావాలి. జగన్ ప్రభుత్వం పీజీ ఫీజు రీయిం బర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసి ఉన్నత విద్య లేకుండా చేసారు. మహిళలు రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహిం చండి. అమలాపురానికి ట్రైన్ సౌకర్యం ఉంటే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది.
భవ్య: అమలాపురంలో అన్ని అవకాశాలున్నాయి.. కానీ రైల్వే సదుపాయం లేదు. జిల్లాలో కొబ్బరి, రొయ్య లు ఎగుమతి పెంచాలంటే రవాణా సదుపాయం పెరగాలి. దీనికి రైల్వే సదుపాయం ఉండాలి.
పాపిరెడ్డి, లా స్టూడెంట్: ఏ ప్రభుత్వం వచ్చినా నిరు ద్యోగ భృతిఇస్తాం అంటున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి.చంద్రబాబు ఉన్నప్పుడు ఐటీ అభివృద్ధి చేసి ఉద్యోగాలిచ్చారు. మాకు ఉద్యోగాలిస్తే మేమే ప్రభు త్వానికి పన్నులు కడతాం. మా తమ్ముడుకు ఓ ప్రభుత్వ కాలేజీలో చదువుతున్నాడు. కనీసం సదు పాయాలు లేవు. మాకు ఉపాధి కావాలి నిరుద్యోగ భృతి వద్దు. జ్యుడిషరీని ఈ ప్రభుత్వం పడుకోబె ట్టింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌లో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
బాలు: నేను పీజీ చదువుతున్నా..మాకు ఫీజు రీయింబ ర్స్‌మెంట్ రావడంలేదు. నాలా చాలా మంది ఇబ్బ ంది పడుతున్నారు. మీ ప్రభుత్వం వచ్చాక పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ సౌకర్యం కల్పిస్తారా.?
సాత్విక: అన్నిరంగాల్లో మహిళలు ముందున్నారు. కానీ రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతున్నారు. ఎన్నో మాటలతో దాడులు చేస్తున్నారు. మీ అమ్మా, భార్యనూ కించపరిచేలా పోస్టులు పెట్టారు. మీరొ చ్చాక ఏమైనా మార్పులు తీసుకొస్తారా?
కార్తిక్: ప్రతి యేటా జనవరిలో జాబ్ కేలండర్ విడుదల చేస్తామని.. సాక్షి కేలండర్ విడుదల చేస్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తారా? ఈ ప్రభుత్వ వచ్చాక అగ్రి కల్చర్ నోటిఫికేష్ ఒక్కసారి కూడా రాలేదు.
సాన్వి: మహిళలు, యువతులు ఇంటి నుండి బయటకు రావాలంటే భయపడుతన్నారు.మీ అమ్మ,భార్యపైనే ఈ ప్రభుత్వం రకరకాలుగా ఇబ్బంది పెడుతోంది. అలాంటిది మాలాంటిసామాన్యుల పరిస్థితి ఏంటి?
అనూష, మెడికల్ స్టూడెంట్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో సాధారణ మెడికల్ డాక్టర్‌ను పెట్టారు… కానీ డెంటల్ సమస్య వస్తే చూపించుకునేందుకు డెం టల్ డాక్టర్ల నియామకాలు లేవు. ప్రాథమిక, ఏరి యా ఆసుపత్రుల్లో డెంటల్ డాక్టరును నియమిస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.
వెంకటేశ్, కొమరగిరిపట్నం గ్రామం: నేను నిరుద్యోగిని నాకు 36ఏళ్లు. చంద్రబాబు ఉన్నప్పుడు 2 డీఎస్సీ లు విడుదల చేశారు. నేను వస్తే మెగా డీఎస్సీ వదులుతానని జగన్ నయవంచన చేశాడు. టీచర్ పోస్టుల కోసం మేము రోజూ పోరాడాల్సి వస్తోంది. 2008 నాటి పెండిరగ్ పోస్టులు భర్తీ చేసి ఇప్పుడు చేపట్టినట్లు చెప్తున్నారు. 23వేల ఉద్యోగాల మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలచేస్తానని జగన్ అన్నా రు. కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం కదా అని చెప్తున్నారు. మీ ప్రభుత్వ వచ్చాక డీఎస్సీ నిర్వహించాలి. నవరత్నాలు అని చెప్పే సీఎం నిరుద్యోగ రత్నాల గురించి చెప్పాలి.
సాయికళ్యాణి, డిగ్రీ విద్యార్థి: డిగ్రీ సిలబస్ ప్రతి యేటా మారుతోంది.. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడు తున్నారు. సిలబస్ ఒకే విధంగా ఉంటే ఇబ్బంది ఉండదు.ఫీజు రియింబర్స్ కావాలా…ల్యాప్ ట్యాప్ కావాలా అని అడుగుతున్నారు. పేద విద్యార్థులం తా రీయింబర్స్ అడుగుతున్నారు. కానీ ల్యాప్ టాప్ లు కూడా అవసరం ఉంది. మీ ప్రభుత్వం వస్తే ల్యాప్ టాప్‌లు ఇస్తారా.?
జగదీష్: ఒంగోలు రిమ్స్‌లో గంజాయి తాగి విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక గంజాయి ఎక్కడబడితే అక్కడ దొరుకుంతుంది. మీ ప్రభుత్వ వచ్చాక ఏం చర్యలు తీసుకుంటారు?
లోకేష్: నేను ఫిజియోథెరపీ మూడో సంవత్సరం చేస్తు న్నా. ప్రతి ఆసుపత్రిలో ఫిజియోథెరపీ ఏర్పాటుచేస్తే మాకు ఉద్యోగాలు దొరుకుతాయి.మీ ప్రభుత్వంలో మా ఫిజియోథెరపీలకు ఏం న్యాయం చేస్తారు.?
శివగీతిక, కొత్తపేట: టీడీపీ ప్రభుత్వంలో సైకిళ్లు ఇచ్చా రు. కానీ ఈ ప్రభుత్వం రద్దుచేసింది. బస్సులు ఎక్కేసమయంలో అమ్మాయిలకు రక్షణ లేదు. ఉద యం ఒకసారి ఒక సమయానికి బస్సు వస్తే మరు సటిరోజు అదేసమయానికి రావడం లేదు.. షెడ్యూ ల్ ప్రకారం ఒకే సమయంలో బస్సు ఏర్పాటు చేయాలి.
పృధ్వీ: అమలాపురంలోని ఎస్.కే.పీఆర్ ప్రభుత్వ కాలేజీ ని ప్రైవేటు కాలేజీగా మార్చారు.దీంతో పేద విద్యా ర్థులు చదువులకు దూరం అవుతున్నారు. కొందరు చదువులు మానేసి పనులకు వెళ్తున్నారు.
సాయి: మాకు ఉన్న సమస్యలపై గతంలో ప్రభుత్వానికి కాల్ చేసి గట్టిగా నిలదీసి అడిగాను. కాల్ రికార్డు చేసుకుని ఇంటికి వచ్చి నన్ను పోలీసులు తీసుకెళ్లా రు. వారం రోజులు జైల్లో పెట్టి శారీరకంగా ఇబ్బంది పెట్టారు.
కె.దుర్గారెడ్డి, కోడుపాడు, అమలాపురం నియోజకవర్గం : ఎస్.కే.పీర్ కాలేజీలో ఈ యేడాది హెచ్‌ఈసీ చేరాను. కానీ సదుపాయాలు సరిగా లేక మానేశా ను. తర్వాత ఐటీఐ చదువుతాని మా నాన్నతో చెప్తే చదువు మానేయమన్నారు. చదివితే అదే కాలేజీలో చదువు లేకుంటే వద్దన్నారు. టీసీ తీసుకుని ఖాళీగా ఉంటూ పని చేసుకుంటున్నా. మా నాన్న తాపీ మేస్త్రీ.. మాకు అంతగా ఆదాయం రాదు.
మహాలక్ష్మీ, ముమ్మిడివరం: ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో జాయింట్ అకౌంట్ విధానాన్ని తీసు కొచ్చారు.అది ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావ డం లేదు. ఫీజు విధానం కాలేజీతోనే ప్రభుత్వానికి అనుసంధానం ఉండేలా చేయాలి. కులాల వారీగా ఫీజు రీయింబర్స్ ఇస్తున్నారు. అందరికీ ఒకేలా ఇవ్వాలి.