విజయవాడ: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మహిళా హక్కుల పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుండగానే వైసిపి కిరాయి మూకలు ఆమెకు నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాయి. రౌండ్ టేబుల్ భేటీ జరుగుతుండగా అనితకు ఫోన్ చేసిన ఒక వైసిపి నేత ఫోన్ చేసి గోరంట్ల మాధవ్ వ్యవహారంపై అతిగా స్పందించవద్దంటూ హెచ్చరించారు. దీనికి అనిత ఏ మాత్రం వెరవకుండా తాను వాస్తవాలను మాత్రమే చెబుతున్నానని అన్నారు. మాధవ్ వ్యవహారంపై తమరు స్పందించాల్సిన అవసరం లేదన్న వైసీపీ నేత తీవ్రస్వరంతో బెదిరించారు. 9848075369 నెంబర్ నుంచి సంబంధిత వైసీపీ నేత ఫోన్ చేయగా, ఫోన్కా ల్నుచ స్పీకర్ ఆన్చేబసి భేటీలో మహిళ నేతలకు అనిత విన్పించారు.
వైసీపీ నేత: (బెదిరింపు ధోరణిలో) ఏమున్నా వాస్తవాలు చెప్పండి.
వంగలపూడి అనిత : వాస్తమేమి, అవాస్తవమేమిటో మీరు చెప్పండి. అసలు మీరెవరు?
వైసీపీ నేత: మీలాగ కార్యకర్తని.
వంగలపూడి అనిత: ఏ పార్టీ కార్యకర్తవి?
వైసీపీ నేత: పక్కా వైసీపీ కార్యకర్తను. నాపేరు గొల్ల మద్దిలేటి యాదవ్, కర్నూల్ టౌన్.
వంగలపూడి అనిత: మీ పార్టీలో అన్నీ కరెక్టుగా ఉన్నాయా?
వైసీపీ నేత: చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు.
వంగలపూడి అనిత : అదేమీ చిన్న విషయం కాదు.
వైసీపీ నేత: మీ పార్టీలో కూడా చాలా జరిగాయి.
వంగలపూడి అనిత: ఏదైనా జరిగి ఉంటే బయట పెట్టాలి.
వైసీపీ నేత: లోకేష్ ఉన్నప్పుడు మీరేం చేశారు?
వంగలపూడి అనిత : లోకేష్ ఏమైనా చేసివుంటే లోకేష్ పై పోలీసు కంప్లైంట్ ఇవ్వండి
వైసీపీ నేత: లోకేష్ పై కంప్లైంట్ ఇస్తే తీసుకోరు.
వంగలపూడి అనిత : మీ ప్రభుత్వమే కదా ఉంది, ఉందుకు తీసుకోరు? వైసీపీ కార్యకర్తనని బలంగా చెప్పావు కదా!
వైసీపీ నేత: మీరు గోరంట్ల మాధవ్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను ఒప్పుకోను.
వంగలపూడి అనిత: ఎందుకు ఒప్పుకోవు?
వైసీపీ నేత: ఆయన ఏం తప్పు చేశాడు? మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు.
వంగలపూడి అనిత : గోరంట్ల మాధవ్ తప్పు చేయేలేదా?
వైసీపీ నేత: వ్యక్తి బోండా ఉమా, బుద్ధా వెంకన్న గురించి మాట్లాడరే?
వంగలపూడి అనిత : గోరంట్ల మాధవ్ చేసింది తప్పా? కాదా? వీడియోలో ఉండేది గోరంట్ల మాధవ్ కాదా?
వైసీపీ నేత: తేలాలి కదా! తేలే వరకు ఆగండి. వెయిట్ చేయండి.
వంగలపూడి అనిత : చిన్న విషయం కాదు, గవర్నమెంట్ లో ఉన్నారు కదా, బయట పెట్టండి. డైరెక్ట్ గా కాల్ చేసి బెదిరిస్తున్నావ్. నేను అవాస్తవం ఏం మాట్లాడానో చెప్పు.
వైసీపీ నేత: చిన్నగా మాట్లాడండి అంత పెద్దగా మాట్లాడితే మాకు ఘోరంగా అనిపిస్తుంది.
వంగలపూడి అనిత : తప్పు చేశారు కాబట్టే మాకు బాధ అనిపిస్తోంది. ఎంతమంది ఆడపిల్లల ఉసురు పోసుకుంటున్నారో మీకు తెలుసా?
వైసీపీ నేత:తప్పుచేస్తే నిలదీయడానికి న్యాయస్థానం ఉంది.
వంగలపూడి అనిత : ఏం.. మేం మాట్లాడకూడదా?
వైసీపీ నేత: దారుణంగా మాట్లాడొద్దు.
వంగలపూడి అనిత : దారుణంగా ఏం మాట్లాడాను? వాస్తవాలు మాట్లాడాను.
వైసీపీ నేత: చిన్న విషయాలు పెద్దవి చేయొద్దని అంటున్నాను.
వంగలపూడి అనిత : చిన్న విషయమని నీవనుకుంటు న్నావ్. అది చిన్న విషయం కాదు. ఒక ఎంపీ న్యూడ్ విషయాలు బయటికి వస్తే అది చిన్న విషయమా?
వైసీపీ నేత: మీ గవర్నమెంట్ లో చాలా మంది …… చాలా చేశారు.
వంగలపూడి అనిత : ప్రస్తుతం గవర్నమెంట్‌లో ఉన్నారు కదా బయట పెట్టండి.
వైసీపీ నేత: తేలే వరకు కొంచం ఆగండి. ల్యాబ్‌కు పంపాము కదా!
వంగలపూడి అనిత : మీలాంటివారు ఉండబట్టి వైసీపీ నిలబడి ఉంది. తప్పు బయటపడినా తప్పును తప్పు అని ఒప్పుకోకపోతే ఎందుకు? మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. మీరు కూడా ఆలోచించాలి కదా! ఇలాంటి వారినా మనం లోక్ సభలకు, అసెంబ్లీకి పంపించేది అని మీరు ఒకసారి ఆలోచించాలి.
వైసీపీ నేత: తేలేవరకు ఆగండి, దుమ్ము లేపొద్దండి. మా సజ్జల రామకృష్ణ చెప్పారు కదా కొద్దిసేపు ఆగండి, ల్యాబ్ రిపోర్టులు వచ్చాక చర్యలు తీసుకుంటాం, అంతవరకు వెయిట్ చేయండి అని సజ్జల చెప్పారు కదా!