- మూడురోజుల నుండి అడుగుతున్నా స్పందన లేదు
- కోర్టుకు వెళ్లాలంటూ సెలవు రోజైన క్రిస్‌మస్ నాడు చెబుతారా
అమరావతి: వీసా రెన్యువల్ గడువు ముగుస్తున్నా ఎన్‌ఆర్‌ఐ యువకుడి పాస్‌పోర్టును తమ దగ్గరే అట్టి పెట్టుకుని, కావాలంటే కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చు కోవాలంటూ అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఏపీ సీఐడీ అధికారుల తీరుపై ఎక్స్ వేదిక ద్వారా టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమెరికాలో ఉండే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు బొద్దులూరి యశస్విని ఈనెల 23 తెల్లవారు రaామున ఏపీ సీఐడీ అధికారులు లుక్ ఔట్ నోటీస్ ఇచ్చి హైదరాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. అదుపులోకి తీసుకున్న యశస్విని గుంటూరు ప్రాంతీయ సీఐడీ కార్యాలయా నికి తరలించగా తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం, లీగల్ టీమ్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో జనవరి 11 వ తేదీ తిరుపతిలోని సీఐడీ కార్యాలయానికి విచార ణకు హాజరవ్వాలని 41 ఏ నోటీసులు ఇచ్చి యశస్విని విడుదల చేశారు. అయితే యశస్వికి చెందిన పాస్ పోర్టును సీఐడీ అధికారులు స్వాధీన పరుచుకున్నారు. ఈ నెల 26న యశస్వి వీసా రెన్యువల్ చేయించు కునేందుకు చెన్నై వెళ్లాల్సిఉంది. వీసా రెన్యువల్ కోసం వెళ్ళడానికి పాస్‌పోర్టు అత్యవసరం అని యశస్వి ప్రాధే యపడినప్పటికీ సీఐడీ అధికారులు స్పందించలేదు. యశస్వి ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అగ్రనాయ కత్వం దృష్టికి తీసుకువచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య.. సీఐడీ చీఫ్ సంజయ్ తో మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్‌తో 23వ తేదీ నుండి పలుమార్లు మాట్లాడుతూ పాస్‌పోర్టు ఇవ్వాల్సిం దిగా రామయ్య విజ్ఞప్తి చేశారు. మొదట సానుకూలం గా స్పందించి, చివరికి కోర్టులో పిటిషన్ వేసి పాస్ పోర్టు పొందాల్సిందిగా క్రిస్‌మస్ రోజున తీరిగ్గా ఎస్పీ సలహా ఇచ్చారు. అయితే క్రిస్టమస్ పర్వదినం రోజున కోర్టులకు సెలవు. మరుసటి రోజే 26వ తేదీన వీసా ఇంటర్వ్యూ కు వెళ్లాల్సిన యశస్వికి ఏపీ సీఐడీ తీరని అన్యాయం చేసిందని వర్ల రామయ్య మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఐడీ రోజురోజుకు దిగజారిపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పై తప్పుడు కేసులు పెట్టి సీఐడీ అభాసుపాలయ్యిందని, కొందరు పోలీసులు.. జగన్‌మోహన్‌రెడ్డి కాళ్ళ దగ్గర సీఐడీ వ్యవస్థను తాకట్టు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహా స్యం చేశారని వర్ల రామయ్య విమర్శించారు. భవిష్య త్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని సీఐడీ చీఫ్ సంజయ్ ను హెచ్చరించారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళారు.
ఎక్స్(ట్విట్టర్)లో సీఎంను ప్రశ్నించిన వర్ల…
ముఖ్యమంత్రి గారూ! మీ సీఐడీ అధికారులు మూడు రోజు క్రితం అరెస్ట్ చేసిన ఎన్‌ఆర్‌ఐ యశస్విని విడుదల చేశారు. కానీ పాస్‌పోర్ట్‌ను స్వాధీన పర్చుకున్నారు. వీసా రెన్యువల్ తేదీ రేపటి(26)తో ముగుస్తుంది. పాస్‌పోర్టు కోసం ఇప్పుడు కోర్టుకు పొమ్మంటున్నారు. ఈ రోజు క్రిస్‌మస్ సందర్భంగా కోర్టుకు సెలవు. అతని వీసా పరిస్థితి ఏమిటి?
పాస్ పోర్ట్ తీసుకుని చెన్నై వెళ్లాలి. ఎలా అని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని వర్ల రామయ్య ప్రశ్నించారు.