రాజ్యాంగంలో ప్రతి భారతీయ స్త్రీకి ప్రత్యేక హక్కులు
వైసిపి ప్రభుత్వంలో వచ్చాక పట్టపగలే మహిళలకు రక్షణకరువు
మూడేళ్లుగా మహిళలపై కొనసాగుతున్న దాడులు, అఘాయిత్యాలు
రక్షకులే భక్షకులుగా మారి చట్టాలను ఉల్లంఘిస్తున్న వైనం
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత మూడేళ్లుగా మహిళలపై హత్యలు, అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులుగా మారి చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. అత్యంత అమానవీయంగా నడిరోడ్లపైన, ఇళ్లలోకి జొరబడి అత్యాచారాలకు పాల్పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఇంటినుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల క్షేమంగా తిరిగివస్తుందన్న నమ్మకం పోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగానితనమే కారణం. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసుశాఖ ఇచ్చిన క్రైమ్ రిపోర్టు ప్రకారం మహిళలపై అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులకు సంబంధించి తొలిఏడాది 14,603 నేరాలు నమోదు కాగా, 2020-21 నాటికి 17,736కి పెరిగాయి. మహిళల రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించిన ముఖ్య ఘటనలు:
1). ఒంగోలులో దివ్యాంగురాలు భువనేశ్వరి సజీవ దహనం (19-12-2020).
2). విశాఖలో వరలక్ష్మి హత్య (1-11-2020)
3). ధర్మవరంలో స్నేహలత దారుణ హత్య (24-12-2020)
4). పులివెందులలో నాగమ్మ అత్యచారం, హత్య (9-12-2020)
5). నర్సరావుపేటలో అనూష హత్య (26-2-2021)
6). గుంటూరులో రమ్య హత్య (15-8-2021)
7). ఫార్మసీ విద్యార్థిని తేజస్వినిపై గ్యాంగ్ రేప్ (5-5-2022)
8). దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వివాహితపై అత్యాచారం (28-4-2022)
9). విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 30గంటలపాటు యువతిపై గ్యాంగ్ ర్యాప్ (19-4-2022)
10). పొద్దుటూరులో బాలికపై 10మంది అత్యాచారం (11-5-2022)
మహిళలపై వేధింపుల కేసుల్లో వైసిపి ప్రజాప్రతినిధులు:
1). గోరంట్ల మాధవ్, హిందూపూర్ ఎంపి (ఐపిసి సెక్షన్ 376 రేప్ కేసు)
2).మార్గాని భరత్, రాజమండ్రి ఎంపి (498ఎ వరకట్న వేధింపులు, గృహహింస)
3). బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం ఎంపి (ఐపిసి సెక్షన్ 354 మహిళలను వేధించడం)
4). కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే (ఐపిసి సెక్షన్ 354 – మహిళపై వేధింపులు)
5). పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే (ఐపిసి సెక్షన్ 354 – మహిళపై వేధింపులు)
6). పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే (ఐపిసి సెక్షన్ 354 – మహిళపై వేధింపులు)
7). కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే (ఐపిసి 509 – మహిళపై అసభ్య ప్రవర్తన)
మహిళలకోసం కల్పించిన చట్టపరమైన హక్కులు
1).మహిళలకు జీరో ఎఫ్‌ఐఆర్ హక్కు
సంఘటన జరిగిన ప్రదేశం లేదా నిర్దిష్ట అధికార పరిధితో సంబంధం లేకుండా ఏదైనా పోలీసు స్టేషన్‌లో నమోదు చేయగల ఎఫ్‌ఐఆర్ ( జీరో ఎఫ్‌ఐఆర్) నమోదుచేసి, తర్వాత కేసు ఎవరి పరిధిలోకి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయాలి. బాధితురాలి సమయాన్ని ఆదా చేసేందుకు నేరస్థుడు స్కాట్-ఫ్రీగా తప్పించుకోకుండా నిరోధించడానికి సుప్రీంకోర్టు ఈ తీర్పును ఆమోదించింది.
2).మహిళలను రాత్రిపూట అరెస్టు చేయరాదు
ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలపై అసాధారణమైన కేసు ఉంటే తప్ప, సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు మహిళను అరెస్టు చేయకూడదు. అంతేకాకుండా పోలీసులు ఒక మహిళను ఆమె నివాసంలో మహిళా కానిస్టేబుల్ మరియు కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సమక్షంలో మాత్రమే విచారించవచ్చని చట్టం పేర్కొంది.
3). వర్చువల్ ఫిర్యాదులను నమోదు చేసుకునే హక్కు
చట్టం మహిళలకు ఈ-మెయిల్ ద్వారా వర్చువల్ ఫిర్యాదులను దాఖలు చేయడానికి లేదా ఆమె ఫిర్యాదును వ్రాసి, నమోదిత పోస్టల్ చిరునామా నుండి పోలీసు స్టేషన్‌కు పంపడానికి సదుపాయాన్ని కల్పించింది. ఇంకా SHO ఆమె ఫిర్యాదును నమోదు చేయడానికి ఒక పోలీసు కానిస్టేబుల్‌ను ఆమె స్థలానికి పంపుతుంది. ఒక మహిళ భౌతికంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే స్థితిలో లేనట్లయితే ఈ సౌలభ్యం ఉంది.
4). మహిళలకు అసభ్యంగా చూపడం నేరం
ఒక మహిళ యొక్క రూపాన్ని (ఆమె రూపం లేదా ఏదైనా శరీర భాగం) అసభ్యకరంగా, అవమానకరంగా లేదా నైతికతను కించపరిచే, భ్రష్టుపట్టించే లేదా గాయపరిచే విధంగా ఏదైనా చిత్రించడం శిక్షార్హమైన నేరం.
5).వేధింపులకు వ్యతిరేకంగా స్త్రీలకు హక్కు
IPC సెక్షన్ 354డి నేరస్థుడు ఒక స్త్రీని అనుసరిస్తే, ఆసక్తి లేని స్పష్టమైన సూచన ఉన్నప్పటికీ పదేపదే వ్యక్తిగత పరస్పర చర్యను పెంపొందించడానికి ఆమెను సంప్రదించడానికి ప్రయత్నిస్తే అతనిపై చట్టపరమైన చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఒక మహిళ ఇంటర్నెట్, ఇమెయిల్ లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలపై నిఘా ఉంచడం కూడా శిక్షార్హమైన నేరం.
6).మహిళలు నిందితులైనా గౌరవ, మర్యాదలు ఇవ్వాలి
ఏదేని కేసులో ఒక మహిళ నిందితురాలు అయినప్పటికీ ఆమెపై ఏదైనా వైద్య పరీక్ష ప్రక్రియను తప్పనిసరిగా నిర్వహించాల్సి వస్తే మరొక మహిళ సమక్షంలోనే నిర్వహించాలి.
7). మహిళలకు ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు
లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ ప్రకారం మహిళా అత్యాచార బాధితులకు ఉచిత న్యాయ సహాయం లేదా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి సహాయం పొందే హక్కు ఉంది. బాధితురాలి కోసం న్యాయవాదిని ఏర్పాటు చేయాలి.
8). స్త్రీలకు సమాన వేతనం పొందే హక్కు
సమాన వేతన చట్టం కింద జాబితా చేయబడిన నిబంధనల ప్రకారం, జీతం, వేతనం లేదా వేతనాల విషయంలో లింగం ఆధారంగా వివక్ష చూపబడదు. శ్రామిక మహిళలకు పురుషులతో పోలిస్తే సమాన వేతనాన్ని తీసుకునే హక్కు ఉంది.
9). పని ప్రదేశాల వేధింపులకు వ్యతిరేకంగా మహిళలకు రక్షణ హక్కు
వర్క్ ప్లేస్‌లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం తన పని ప్రదేశంలో ఎలాంటి లైంగిక వేధింపులకైనా ఫిర్యాదు చేసే హక్కును స్త్రీకి లభిస్తుంది. ఈ చట్టం ప్రకారం, ఆమె 3 నెలల వ్యవధిలో బ్రాంచ్ కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి)కి వ్రాతపూర్వక ఫిర్యాదును సమర్పించవచ్చు.
10). గృహ హింసకు వ్యతిరేకంగా మహిళలకు హక్కు
11). లైంగిక వేధింపుల బాధితులకు గోప్యత హక్కు
తన గోప్యతకు రక్షణ కల్పించడం కోసం, లైంగిక వేధింపులకు గురైన మహిళ, కేసు విచారణలో ఉన్నప్పుడు లేదా మహిళా పోలీసు అధికారి సమక్షంలో జిల్లా మేజిస్ట్రేట్ ముందు ఒంటరిగా తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయవచ్చు.
వైసిపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణగా నిలవాల్సిన పాలకులే నేరస్థులుగా అవతారమెత్తారు. ఎన్ సిఆర్ బి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో మూడోవంతు ఎపిలోనే నమోదవుతున్నాయి. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని కఠిన చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాధ్యత మర్చి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి.
-తెలుగుదేశం పార్టీ న్యాయవిభాగం