చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home సంపాదకుని ఎంపిక

అవినీతికి అగ్రజుడు.. జగన్‌!

by చైతన్యరధం
Nov 26, 2024 at 6:30am
in సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp

జనం కడుపుగొట్టి తన పొట్ట నింపుకోవడంలో చరిత్రకెక్కిన జగన్‌రెడ్డి అంతూ పొంతూలేని అత్యాశ యావద్భారతానికే తలవంపులు తెచ్చింది. సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల మాటున రూ.1750 కోట్లు మేతమేసిన జగత్‌ కంత్రి సాగించిన ముడుపుల బాగోతాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ వెలుగులోకి తెచ్చింది. అవినీతి గడ్డిమేసి అధిక ధరలకు అదానీ కరెంటు కొనుగోలుకు ఒప్పందం చేసుకొన్న జగన్‌రెడ్డి మూలంగా ప్రజల నడ్డి విరిగిన అదనపు భారం.. అక్షరాలా రూ.1.10 లక్షల కోట్లు. ఆర్ధిక నేరాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేరుమోసిన జగన్‌మీద ఇప్పటికే 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులున్నాయి. రూ.43వేల కోట్ల అక్రమాస్తులను జగన్‌ పోగేశారని దర్యాప్తు సంస్థలే నిగ్గుతేల్చాయి. అయినా ఆ కేసులపై విచారణలే దశాబ్దకాలంగా దేకుతున్నాయి. ఇప్పుడు జగన్‌ ముడుపుల లోగుట్టును అమెరికా యంత్రాంగం రట్టుచేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం జగన్‌రెడ్డిపై చర్యలకు ఉపక్రమించాలి. వైసీపీ హయాంలో కుదిరిన అన్ని ఒప్పందాలపై సమగ్ర విచారణ జరగాలి.

జ్యూడీషియల్‌ కమిషన్లను ఏర్పాటుచేసి జగత్‌కంత్రి వికృత అవినీతిని బట్టబయలు చేసి కఠినంగా శిక్షించాలి. అంతర్జాతీయ అవినీతి పరుడిగా చరిత్రకెక్కిన ఘనుడు జగన్‌రెడ్డి. భారీ లంచం భోంచేసి  25 ఏళ్లపాటు రాష్ట్ర ఖజానాకు బొర్రెపెట్టి అదానీకి అప్పనంగా కట్టబెట్టిన అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేయాలి. మోసానికి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీయం జగన్‌రెడ్డిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ప్రజలూ కోరుతున్నారు. వ్యక్తిగత లాభం కోసం ఉద్దేశపూర్వకంగా అవినీతికి పాల్పడిన ఆర్థిక నేరగాళ్లను కఠినంగా శిక్షించకపోతే మొత్తం సమాజమే అన్యాయమైపోతుందని సాక్షాత్తూ సుప్రీంకోర్టే స్పష్టంచేసింది. లోతైన కుట్రలతో కూడిన ఆర్ధిక నేరాలు దేశార్ధికానికి ప్రమాదకరమైనవని, వాటిని తీవ్రంగా పరిగణించాలని జగన్మోహన్‌రెడ్డి కేసులోనే సుప్రీమ్‌ కోర్టు పదేళ్ల క్రితమే వ్యాఖ్యానించింది.

సంబంధితవార్తలు

మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.

భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు.

విజయనగరం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పాల్గొన్నారు.

రద్దీగావున్న బస్సుల్లో కక్కుర్తిపడి ఒక జేబుదొంగ ఒకరి పర్సు కొట్టేస్తాడు. తోటి ప్రయాణికులకు ఆ విషయం తెలియగానే ఆగ్రహం వ్యక్తంచేస్తూ అతణ్ని పట్టుకుని చావబాది పోలీసులకు అప్పగిస్తారు. అట్లాగే దారిన వెళ్తున్న మహిళ మెడలో పుస్తెలతాడును లాక్కునిపోతాడు మరొకడు. దొరికితే  అతడిని  పట్టుకుని కాళ్లూ చేతులు విరగ్గొట్టి పోలీస్‌ స్టేషన్‌కి ఈడ్చు కెళతారు. దర్యాప్తు వ్యవస్థలు కూడా ఇటువంటి జేబు దొంగలపైనే తమ వీర ప్రతాపం చూపిస్థాయి. కానీ ప్రజలకు అబద్దాలు  చెబుతూ వారి  డబ్బు వివిధ రూపాల్లో కోటానుకోట్లు  దోచేస్తున్న నేతలను మాత్రం దండిరచడం వదిలేసి.. బందిపోటు దొంగలకు వంగివంగి దండాలు పెడుతూ పూలదండలు వేస్తున్నారు. అవినీతి అనేది తన జన్మహక్కుగా భావిస్తున్నారు జగన్‌రెడ్డి. అవినీతి ఆయనకీ అలవాటైపోయింది. అవినీతి ద్వారా అక్రమాస్తులు పోగేయడంలో ప్రపంచానికే ఆదర్శపురుషుడుగా వర్ధిల్లుతున్నాడు. అవినీతిద్వారా జనం సొమ్మును, జాతివనరులను గంపగుత్తగా దిగమింగి అరాయించుకోవడంలో జగన్‌రెడ్డి ఆయనకు ఆయనే సాటి. నేరమయ రాజకీయాల పుణ్యమా అని అవినీతి భారత గాథలో కళ్లు బైర్లుకమ్మించే అరాచక ఘట్టాలతో ప్రజాస్వామ్యం పుచ్చి పురుగులు పడి లుక లుక లాడుతున్నా ఎవరికీ పట్టడం లేదు.

సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో అవినీతి జరిగిందని ఆంధ్రప్రదేశ్‌నుంచి అమెరికా వరకు చర్చ జరుగుతుంటే, కేసు నమోదై రచ్చవుతున్నా జగన్‌రెడ్డి మాత్రం ఇంకా బుకాయిస్తూ తన ముడుపుల బాగోతంపై పరదాలు కప్పే ప్రయత్నం చేస్తున్నారు. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా `సెకీతో ఒప్పందం చేసుకుంటే అదానీకి ఏం సంబంధమంటూ జగన్‌రెడ్డి, ఆయన వంది మాగధులు  అడ్డంగా వాదిస్తున్నారు. కానీ సౌర విద్యుత్తు కొనుగోలుపై అడ్డంగా దొరికిపోయినా నిజాలు దాచేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు. జగన్‌రెడ్డి దీనికి ముందు సమాధానం చెప్పాలి. సెకీతో ఒప్పందానికి ముందు పనిగట్టుకుని ప్రత్యేక విమానంలో తాడేపల్లికి  మూడుసార్లు అదానీవచ్చి తనని ఎందుకు కలిశారు? ఒకవేళ విద్యుత్తు ఒప్పందం కోసం కాదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ వచ్చారని అనుకున్నా.. ఆ విషయాన్ని జగన్‌ ఎందుకు బహిర్గతం చేయలేదు ఆనాడు? ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా పేరున్న అదానీ మూడు నెలల్లో మూడుసార్లు రహస్యంగా కలవాల్సిన అవసరమేమిటి? పంప్డ్‌ స్టోరేజీ, డేటా సెంటర్‌ను అదానీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆనాడు సీయం కార్యాలయం అధికారికంగా ఎందుకు  ప్రకటించలేదు? ఆ భేటీల వెనుక మర్మమేంటి? అమెరికా దర్యాప్తు సంస్థలు ఆ  సందేహాలను నివృత్తి చేస్తూ స్కాముల కోసం స్కీమ్‌లకు స్కెచ్‌వేసి రాష్ట్రంపై లక్షల కోట్ల రూపాయల సోలార్‌ ఒప్పంద  భారాన్ని జగన్‌ వేశారంటూ న్యూయార్క్‌ కోర్టులో అభియోగం మోపింది. జగన్‌- అదానీ ముడుపుల వ్యవహారం, ఇది నచ్చక విద్యుత్‌ సరఫరా ఒప్పందం నుంచి అజూర్‌ వైదొలగడం గురించి అభియోగపత్రంలో పేర్కొన్నది. జగన్‌ ముడుపుల బాగోతం కళ్లకు కనిపిస్తున్నా  అబద్దాలు చెప్పడం, బుకాయించడం జగన్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.

అదానీ గ్రూప్‌ ముట్టచెప్పిన ముడుపుల మొత్తం రూ 2,029 కోట్లలో మాజీ సీయం జగన్‌రెడ్డికే రూ.1,750 కోట్లు ముట్టినట్లు సమాచారం. జగత్‌ కంత్రి ప్రభుత్వం.. సెకీ ద్వారా 7వేల మెగావాట్ల అదానీ విద్యుత్తు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో మెగావాట్‌కు రూ.25 లక్షల చొప్పున 7వేల మెగావాట్లకు రూ.1,750 కోట్లు ఇచ్చినట్టు అమెరికా దర్యాప్తు సంస్థలు బయట పెట్టాయి. 2016లో అదానీ గ్రీన్‌కు ఒకే ఒక్క విద్యుదుత్పత్తి ప్లాంట్‌ వుండేది  అదీ 20 మెగావాట్ల సామర్థ్యంతో ఉండేది. 2018నాటికి రెండువేల మెగావాట్ల సామర్థ్యానికి విస్తరించాలని అదానీ గ్రూప్‌ లక్ష్యంగా పెట్టుకుని అందుకు 2020లో సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలోనే అత్యంత భారీ సౌర విద్యుత్తు టెండరు తమకు దక్కిందని, 2025నాటికి 25వేల మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని అదానీ గ్రీన్‌ సంస్థ 2020 జూన్‌లో  ఒక ప్రకటన విడుదల చేసింది. కానీ సెకీకి టెండరు దక్కినప్పటికీ విద్యుత్‌ కొనుగోలుకు రాష్ట్రాల డిస్కమ్‌లు ముందుకు రాకపోవడంతో అదానీపై ఒత్తిడి పెరిగి ఆయా రాష్ట్రాలకు ముడుపులు  ఎరవేసింది. ఆ సమయంలోనే  అప్పుడు సీయంగా వున్న జగన్‌రెడ్డిని అదానీ వ్యక్తిగతంగా కలిశారు. ఆ తర్వాతే ఏడువేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఏపీతో ఒప్పందం కుదిరిందని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడిరచాయి.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డికి  రూ.1750 కోట్లు ముడుపులు ముట్టజెప్పడం ద్వారా అదానీ కంపెనీ లబ్దిపొందినట్టు అమెరికాలోని న్యూయార్క్‌ ఈస్ట్రన్‌ జిల్లా కోర్టులో కేసు నమోదు కావడమంటే జగన్‌రెడ్డి  అవినీతి ఎంత తారాస్థాయికి  చేరిందో ప్రజలు అర్ధం చేసుకోవాలి. క్విడ్‌ ప్రోకో పద్ధతిలో జగన్‌రెడ్డి ఆదానితో లాలూచీపడి పోర్టులు, విద్యుత్‌ ఒప్పందాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అదానీకి అప్పనంగా కట్టబెట్టేందుకు జగన్‌రెడ్డి  చీకటి ఒప్పందాలు చేసుకొన్నారు. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాల వల్ల డిసెంబర్‌ నుండి రాష్ట్ర ప్రజలు రూ.6072 కోట్ల విద్యుత్‌ భారాలు మోయాల్సిన పరిస్థితి దాపురించింది. మరో రూ.11,820 కోట్లను విద్యుత్‌ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై భారం వేయాల్సిన పరిస్థితి. ఒకపక్క చార్జీలు, పన్నుల భారాలు ప్రజలు మోస్తుంటే, అవినీతికి పాల్పడి అదానికి దాసోహమైన జగన్‌రెడ్డి మరోవైపు విద్యుత్తు చార్జీలు పెంచుతున్నారని మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

జగన్‌రెడ్డి అవినీతి, అదానీ అత్యాశ ఆంధ్రప్రదేశ్‌ పరువు తీశాయి. జగన్‌రెడ్డి -అదానీ స్వార్ధ  ప్రయోజనాలకు రాష్ట్రం ఆర్థికంగా బలైపోయే పరిస్థితి ఏర్పడిరది. అడ్డదారిలో  అదానీకి మేలు చేయడానికి  జగన్‌ సర్కారు అన్ని అడ్డదారులూ తొక్కింది. కేవలం అదానీకి మేలు చేసి తానూ ఆర్ధిక ప్రయోజనం పొందడం కోసం ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీజీఈసీఎల్‌) పిలిచిన 10,000 మెగావాట్ల టెండర్లను రద్దు చేసారు. రైతాంగానికి పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేసేందుకు వీలుగా సోలార్‌ విద్యుత్తు సేకరించేందుకు ఏపీజీఈసీఎల్‌ 2021లో టెండర్లు పిలిచింది. యూనిట్‌ను రూ.2.49 ధరకు ఇచ్చేందుకు సోలార్‌ ఉత్పత్తి సంస్థలు ముందుకొచ్చాయి. అప్పట్లో దేశీయంగా సోలార్‌ విద్యుత్తు ధర యూనిట్‌కు రూ.2.92గా ఉంది.

ఏపీజీఈసీఎల్‌ పిలిచిన టెండర్‌కు స్పందిస్తూ సోలార్‌ సంస్థలు యూనిట్‌ను రూ.2.49కు ఇస్తామనడం అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. జగన్‌కి చిత్తశుద్ధివుంటే వెంటనే కొనుగోలు ఒప్పందాలు చేసుకునే వారు. అలాకాకుండా అదానీకి దోచిపెట్టడానికి స్కెచ్‌ వేశారు. మేం సెకీతో ఒప్పందం చేసుకున్నాం. సెకీతో రాష్ట్ర ఇంధన సంస్థలు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అదానీ ప్రస్తావన ఎందుకు వస్తుందని జగన్‌ అమాయకంగా ప్రశ్నిస్తు ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు. కావునా అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్‌ సృష్టించిన అవినీతికి యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ బలైంది. స్వాహాపర్వాలతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిన జగన్‌రెడ్డిని చట్టబద్దంగా శిక్షించాలి. పాలకులం కాదు, సేవకులమంటూ నంగనాచి తనాన్ని అభినయించి లక్షల కోట్ల ప్రజాధనం బొక్కెందుకే అధికారాన్ని ఉపయోగించారు. ప్రజా ప్రయోజనాలు నెరవేర్చాల్సిన ప్రభుత్వ యంత్రాంగాన్ని తన రాజకీయ,ఆర్ధిక ప్రయోజనాలు నెరవేర్చడానికి ఉపయోగించిన జగన్‌రెడ్డిపై సమగ్ర విచారణ జరిపించి, కఠినంగా శిక్షించాల్సి వుంది.

`నీరుకొండ ప్రసాద్‌

Previous Post

సాక్షి ఎడిటర్‌ వర్దెల్లి మురళి అబద్ధాల కుతంత్ర రాతలు- 3

Next Post

రహదారులకు సంక్రాంతి శోభ

మరిన్ని వార్తలు

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!
ఆంధ్రప్రదేశ్

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!
ఆంధ్రప్రదేశ్

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…
ఆంధ్రప్రదేశ్

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!
ఆంధ్రప్రదేశ్

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
ఆంధ్రప్రదేశ్

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025
నాడు పరిశ్రమలు పరార్‌!
ఆంధ్రప్రదేశ్

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు
ఆంధ్రప్రదేశ్

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist