చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగనన్న భూ సర్వే పెద్ద బోగస్‌

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ

by చైతన్యరధం
Aug 20, 2024 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగనన్న భూ సర్వే పెద్ద బోగస్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

గత ప్రభుత్వంలో నష్టపోయిన వారికి న్యాయం చేస్తాం
ఈ స్థాయిలో బాధితులను చూడటం మొదటిసారి
చంద్రబాబు, లోకేష్‌ల చొరవతో సమస్యల పరిష్కారం
అవినీతిని బయటపెడతామనే రికార్డులు తగలబెడుతున్నారు
ఆయా శాఖల్లో అక్రమాలపై దర్యాప్తు చేయించి శిక్షిస్తాం
భూ సమస్యల పరిష్కారానికి త్వరలో రెవెన్యూ సదస్సులు
మా ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవు
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ

మంగళగిరి(చైతన్యరథం): ప్రజా వినతుల స్వీకరణలో భాగంగా సోమవారం మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నా యుడు, టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోన్‌రావు, డాక్టర్‌ శివప్రసాద్‌లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు వింటూ నేరుగా డీజీపీ, కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి సమస్యలను వివరించి పరిష్కరించాలని సూచించారు. అనంతరం మీడియా తో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఒక ప్రభుత్వం మారిన తరువాత ప్రజల బాధలను ఈ స్థాయిలో చూడటం ఇదే మొదటిసారని అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు అర్జీలు ఇవ్వడం, బాధలు చెప్పుకోవడం తప్ప ఏమీ కనిపించడం లేదన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను చిన్నా భిన్నం చేసి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని సొంత కార్యక్రమాలు చేయడంతో ఈనాడు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఫిర్యాదుల్లో అధికంగా భూ సమస్యలపైనే వచ్చాయని తెలిపారు. తాతల తండ్రుల నుంచి వచ్చిన భూములు ఇప్పటికి కూడా వారి ఆధీóనంలోనే ఉన్నా రికార్డులు తారుమారు చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు చేయడం, నిబంధనలు పాటించకపోవడం, జగనన్న భూ సర్వే పేరుతో పెద్ద బోగస్‌ సర్వే చేపట్టి ప్రజల మధ్య తగాదాలు పెట్టి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టారని మండిపడ్డారు.
గత ప్రభుత్వంలో బాధితులకు న్యాయం చేస్తాం
టీడీపీ అధినేత చంద్రబాబు, యువ నాయకుడు లోకేష్‌లు ప్రజా సమస్యల పరి ష్కారం కోసం చేసిన ఆలోచన హర్షణీయమన్నారు. ఒక జిల్లా, ఒక ప్రాంతం కాకుండా రాష్ట్రం మొత్తం భూ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. దానికి శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్రం ప్రభుత్వం త్వరలోనే రెవెన్యూ అధికారులను గ్రామాలకు పంపి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తుందని వెల్లడిరచారు. గత ఐదేళ్లలో ఎవరికైతే ఇబ్బంది జరిగిందో వారందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో ఎక్కడ అవినీతి జరిగిందో వాటన్నింటిని బయటపెడతామని మేము చెప్పడంతో భయంతో రికార్డులను తగలబెడుతున్నారని తెలిపారు. పోలవరంలో నిర్వాసితులకు, నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వకుండా వైసీపీ నేతల సొంత పార్టీ వారికి విపరీతంగా పరిహారం ఇచ్చి అక్రమంగా దోచుకున్నట్లు తెలిపారు. వాటిని నేడు ప్రభుత్వం బయటకు తీస్తుందన్న ఉద్దేశంతోనే రికార్డులను తగలబెట్టారని చెప్పారు. తిరుపతిలో వెంకన్న ధనాన్ని దోచుకున్నారు అవి బయటపడతాయని ఫైల్స్‌ను దగ్గం చేశారన్నారు. ఈ ఘటనలపై తమ పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారని వెల్లడిరచారు. గత ప్రభుత్వంలో ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ను ఐదు జోన్‌లుగా పెట్టి ఒక్కో జోన్‌కు ఒక్కో ఆఫీసర్‌ను నియమించుకుని దోపిడీకి అడ్డు లేకుండా చేసుకుని ఇసుక, మైనింగ్‌, రేషన్‌, అక్రమ మద్యం దేన్ని వదలకుండా అక్రమ రవాణా సాగించారు. ఈ దందాకు నాడు ఓ అధికారి సహకరించాడు. ఆయన పేరు చెప్పడం కూడా ఇష్టం లేద ని.. ఇటువంటి దారుణాలపై దర్యాప్తు చేయించి ఎవరు తప్పు చేసినా వారిని విడిచిపెట్టమని స్పష్టం చేశారు. ఎక్సైజ్‌తో పాటు చాలా శాఖల్లో భారీ అవినీతి జరిగిందని అన్నింటిని బయటపెట్టి అక్రమార్కులను కటకటాల్లోకి నెడతామని వివరించారు.
వైసీపీ నేతలకు మడుగులొత్తి తప్పుడు కేసులు పెట్టారు
గత ప్రభుత్వంలో తమను కొట్టి తమపైనే అక్రమ కేసులు బనాయించి నానా ఇబ్బందులు పెట్టిన పోలీసు అధికారులు మళ్లీ ముసుగు తొలగించుకుని పదవులు పొం దుతున్నారని, గత ఐదేళ్లు వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తిన ఆ పోలీసుల ముసుగులు తొలగించి చర్యలు తీసుకోవాలని మైదుకూరుకు చెందిన టీడీపీ నేతలు మంత్రి అచ్చెన్నాయుడికు ఫిర్యాదు చేశారు. తమను కొట్టిన పోలీసుల ఫొటోలను చూపి స్తూ వారిపై చర్యలు తీసుకోవాలని, వారికి పదవులు దక్కకుండా చూడాలని కోరారు.
పోలీసు అధికారి దందా..రూ.60 లక్షల వసూలు
తాము మాచర్ల నియోజకవర్గంలో లేకపోయినా హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తిపై అక్ర మ కేసు పెట్టి సుమారు రూ.60 లక్షలు గత ప్రభుత్వంలో వైసీపీకి కొమ్ముకాసిన ఓ పోలీసు అధికారి వసూలు చేశాడని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతలకు చెందిన రవికిరణ్‌రెడ్డి, అప్పిరెడ్డి, సుమంత్‌రెడ్డిలు వేడుకున్నారు. అలాగే తాము చేసిన వర్క్‌ బిల్లులు రాలేదని వాటిని ఇప్పించాలని వాపో యారు. నర్సరీల కోసం రైతుల దగ్గర భూమి తీసుకునేందుకు గత ప్రభుత్వం తెచ్చిన రిజిస్ట్రేషన్‌ జీవోను రద్దు చేయాలని కోరారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అగ్రిమెంట్‌ విధానంను అమలు చేయాలని కోరారు.
జగనన్న భూ సర్వేలో ప్రభుత్వ భూమిగా మార్చారు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం కొండాపురానికి చెందిన ఎన్‌.సంజీవ వరప్రసాద్‌ తన సమస్యను వివరిస్తూ గత ప్రభుత్వం చేపట్టి జగనన్న భూ సర్వే వల్ల తమ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చారని, దాంతో తమకు అడంగల్‌ రావడం లేదని వాపోయాడు. సమస్యను పరిష్కరించాలని కోరాడు. గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తోన్న రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలకు వైసీపీ అన్యాయం చేసిందని.. ఎప్పటి నుండో స్వస్థలాల్లో పనిచేస్తున్న తమను దూర ప్రాంతాల్లో వేసి సచివాలయాల్లో కొత్త వారిని తీసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
వైసీపీ నేత నుంచి ప్రాణహాని ఉంది
వైసీపీ నాయకులు కోటేరు ముత్తారెడ్డి నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని.. తనకు రావాల్సిన డబ్బులు అడిగినందుకు తమపై దాడులు చేసి గ్రామం నుంచి వెలివేశారని నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన నిప్పులపల్లి కోటేశ్వరరావు వాపోయాడు. ఆరు నెలలు తెలంగాణాలో ఉన్నామని ఊరిలో తమతో ఎవరూ మాట్లాడనివ్వకుండా.. మంచినీళ్లు, సరుకులు ఇవ్వ కుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎస్సై వైసీపీ నాయకులకే మడుగులొత్తుతున్నాడని తమకు న్యాయం చేయాలని కోరాడు. దీనిపై మంత్రి నందిగామ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
వైసీపీ నేతలు భూమిని ఆక్రమించుకుని పట్టా తీసుకున్నారు
ప్రభుత్వం తమకు ఇచ్చిన భూమిని వైసీపీ నేతలు అక్రమంగా ఆన్‌లైన్‌ చేసుకుని పట్టా తీసుకున్నారని ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెం గ్రామ స్తుడు జెల్లి మస్తాన్‌ వాపోయాడు. 1983లో ఆ భూమిని ప్రభుత్వం తన తండ్రికి ఇచ్చిందని.. ఆయన మరణాంతరం ఆ భూమిని తాము అనుభవిస్తున్నామని తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరాడు.
లక్షకు రూ.10 లక్షలు వడ్డీ కట్టమని వేధిస్తున్నారు
రూ.2 వడ్డీకి రూ.50 వేలు తీసుకుంటే దానికి రూ.3 లక్షలు కట్టమని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని తమను ఊరిలోకి రానివ్వడం లేదని.. డబ్బులు కట్టకుంటే చంపుతామని బెదిరిస్తున్నారని మంత్రాలయానికి చెందిన్న జమ్మన ఫిర్యాదు చేశాడు. మం త్రాలయానికి చెందిన మరో వ్యక్తి బుడగ జంగం కూడా ఫిర్యాదు చేస్తూ వైసీపీ నేత భీమా దగ్గర తీసుకున్న లక్షకు రూ.10 లక్షలు వడ్డీ కట్టమని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు.
అంబేద్కర్‌ భవన స్థలాన్ని కబ్జా చేశారు
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరులోని నేతాజీ నగర్‌ కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తూ వైసీపీ నేతల అండతో గత ప్రభుత్వంలో అంబేద్కర్‌ భవన నిర్మాణ స్థలాన్ని ఆక్రమించుకుని కట్టడాలు చేపట్టారని.. అక్రమ కట్టడాలు తొలగించి ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం తోటాడ పంచాయతీ గవర్ల అనకాపల్లికి చెందిన పొలమరశెట్టి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తూ తాను టీడీపీలో ఉత్సాహంగా పనిచేస్తున్నా ననే కారణంతో గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు తనపై అక్రమ కేసులు పెట్టారని కేసులు తొలగించాలని వేడుకున్నాడు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

Previous Post

గుంటూరు మిర్చి యార్డులో భారీ అవినీతి

Next Post

23న పల్లె పండుగ!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

కార్యకర్త
@ July 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist