- నాడు బాదుడే బాదుడని దుష్ప్రచారం
- నేడు జగన్ పాలనలో ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు
- దోపిడీ పాలనలో అధ్వాన్నంగా పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయం, జీవనం
- పెట్రోల్.. డీజిల్, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపు భారంతో పాటు, మద్యం ధరలు పెంచి, పిచ్చి పన్నులేస్తూ ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తున్నాడు
అమరావతి: రాష్ట్రంలో నిత్యావసరాలు అమ్మాలంటే అడవి… కొనాలంటే కొరివి అన్న విధంగా తయార య్యాయని టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే తంగి రాల సౌమ్య అన్నారు.జగన్‌రెడ్డి చేస్తున్న అప్పులు, దోపి డీతో ప్రతికుటుంబంపై రూ.2.80లక్షల అప్పుల భారం పడిరదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయం అత్తెసరుగా మారిందన్నారు. మంగళ గిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే జగన్ రెడ్డి హయాంలో నిత్యావసరాలు.. ఇతర ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్ డీజిల్‌తో సహా గ్యాస్.. కూరగాయలు… పాలు.. పప్పు దినుసుల ధర లు ఆకాశాన్ని అంటుతున్నాయనే చెప్పాలి. జగన్ ప్రభు త్వంలో చింతపండు(కేజీ) రూ.240, ఎండుకారం(కేజీ) రూ.500, కందిపప్పు(కేజీ) రూ.200, నూనె ప్యాకెట్ (పామాయిల్) రూ.100, సన్ ఫ్లవర్ ఆయిల్ (కేజీ ప్యాకెట్) రూ.120, వేరుశనగనూనె (కేజీ) రూ.180, పంచదార(కేజీ) రూ.48కి చేరాయని సౌమ్మ తెలిపారు.
జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల్ని వీరబాదుడు బాదుతున్నాడు
నిత్యావసరాల ధరలకు అదనంగా పెట్రోల్, డీజిల్ ధరలను దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా జగన్‌రెడ్డి పెంచేశాడు. టీడీపీ ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కడా లేని విధంగా పెంచారని ప్రజల్ని బాదేస్తున్నారని, బాదుడేబాదుడు అంటూ ప్రతిపక్షనేత హోదాలో నానా గగ్గోలు పెట్టిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు తన ప్రభుత్వంలో దేశంలో ఎక్కడాలేని విధంగా భారీస్థాయిలో ధరలు పెంచి, ప్రజల్ని వీరబాదుడు బాదుతున్నాడు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో జగన్ రెడ్డి ప్రజలపై ఏడాదికి రూ.500కోట్ల భారం మోపుతున్నాడు. అలానే గ్యాస్ సిలిండర్ ధర కూడా రెండు రెట్లు పెరిగింది. గతంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.600లు ఉంటే, ఇప్పుడు రూ.1100లకు పైగా ఉంది. సైకో ముఖ్యమంత్రి విద్యుత్ వ్యవస్థను నాశనం చేసి గతంలో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.500లు వచ్చే విద్యుత్ బిల్లుని అమాంతం రూ.2 వేలకు పెంచా డు. ఆర్టీసీ ఛార్జీలు 20శాతం పెంచిన సైకో జగన్ రెడ్డి.. మొత్తంగా రాష్ట్రప్రజలపై రూ.1000కోట్ల భారం మోపాడని తంగిరాల సౌమ్య విమర్శించారు.
చంద్రబాబునాయుడు ఇసుకను ప్రజలకు ఉచితంగా అందిస్తే అది తప్పంటున్న ఇసుకాసురుడు జగన్ రెడ్డి.. నదుల్లో ఎక్కడా ఇసుక దొరక్కుండా దోపిడీ చేస్తు న్నాడు. ప్రభుత్వమే స్వయంగా ఇసుక అమ్మకాలు సాగి స్తూ.. వైసీపీ నేతలతో భారీ ఇసుక మాఫియానే నడుపు తోంది. కేవలం ఇసుక అమ్మకాల ముసుగులోనే జగన్ రెడ్డి నాలుగేళ్లలో రూ.40వేల కోట్లకు పైగా దిగమింగా డని సౌమ్మ ఆరోపించారు.
కల్తీమద్యం అమ్మిస్తూ మహిళల మాన ప్రాణాలతో జగన్‌రెడ్డి చెలగాటమాడుతున్నాడు
అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యాన్ని నిషేధిస్తా నని చెప్పిన జగన్‌రెడ్డి పిచ్చి మద్యాన్ని.. కల్తీమద్యాన్ని అధికధరకు అమ్మిస్తూ ఆడబిడ్డల మానప్రాణాలతో చెల గాటమాడుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అమ్మేదే కల్తీ మద్యం..అదికూడా నాలుగు రెట్లు అధిక ధరకు. జగన్ రెడ్డి ధన దాహానికి..అతని ప్రభుత్వంలో పేట్రేగిపోతున్న మద్యం మాఫియాతో రాష్ట్రంలో నేరాలు ఘోరాలు అధి కమయ్యాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధులనే తేడా లేకుండా మద్యం మత్తులో కామాంధులు దురాగతాల కు పాల్పడుతున్నా.. ప్రభుత్వంలో చలనం లేదు. కల్తీ మద్యానికి తోడు ముఖ్యమంత్రి గంజాయి, ఇతర మాద కద్రవ్యాలను కూడా విచ్చలవిడిగా అమ్మిస్తున్నాడని సౌమ్మ విమర్శించారు.
పేదలు కడుపునిండా తినడం ఇష్టం లేకనే జగన్ రెడ్డి అన్న క్యాంటీన్లు మూసేశాడు
చంద్రబాబునాయుడు పేదల కడుపు నింపడం కోసం రూ.5లకే రుచికరమైన భోజనం పెట్టేలా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. పేదలు సంతోషంగా పం డుగలు జరుపుకోవాలని ఆనాడు టీడీపీ ప్రభుత్వం రంజాన్ తోఫా.. క్రిస్మస్.. సంక్రాంతి కానుకల రూపం లో పండుగ సరుకులు అందించింది. జగన్‌రెడ్డి వచ్చీ రావడంతోనే ధరలుపెంచి..పేదలకు పండుగలు లేకుం డా చేశాడు. వారు కడుపునిండా తినడం చూసి ఓర్వ లేక, వారి సంతోషాన్ని జీర్ణించుకోలేకే అన్న క్యాంటీన్లు మూసేశాడు. పేదలకు అందుబాటులో లేకుండా అన్ని ధరలు పెంచాడు. ఇలాంటి సైకో ముఖ్యమంత్రి ఇంకా సిగ్గులేకుండా తాను పేదలపక్షమని కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు.
ధరల్ని నియంత్రించి నాణ్యమైన సరుకులు ప్రజల కు అందించడంలో కూడా జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మంత్రులు.. అధికారులు ధరల పెరుగు దల.. వస్తువులు నాణ్యత.. ఆహారపదార్థాల నాణ్యతపై అసలు దృష్టిపెట్టడం లేదు. పర్యవేక్షణా లోపంతో దళా రుల జోక్యం పెరిగి, బ్లాక్ మార్కెట్ విక్రయాలు అధిక మై… పేద, మధ్యతరగతి ప్రజల జీవనం చెప్పలేనంత కష్టంగా మారింది. ఆఖరికి పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అమ్ము కునే దుస్థితికి దిగజారారని సౌమ్య ఆరోపించారు.
ప్రజల సంతోషం.. తన సంతోషంగా భావించే ఏకైక నాయకుడు చంద్రబాబు ఒక్కరే
తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే.. అన్ని ధరలు అదు పులో ఉంటాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పేదలకు కడుపునిండా తిండి… చేతినిండా పని.. ఉండటానికి మంచి అధునాతనమైన ఇళ్లు లభి స్తాయి. భవిష్యత్‌కు గ్యారెంటీలో భాగంగా ఇప్పటికే మహిళలు…రైతులు.. యువతకు అందించే సంక్షేమం, ఇతర ప్రయోజనాల గురించి ప్రజలకు చంద్రబాబు చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిం డర్లు ఉచితంగా అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి. విద్యుత్ ఛార్జీలు నామమాత్రంగా ఉంటా యి. నాణ్యమైన విద్యుత్ 24గంటలు అందుబాటులో ఉంటుంది. కల్తీ మద్యం బెడద లేకుండా పోతుంది. ప్రజల సంతోషం..సంక్షేమమే తన సంతోషంగా భావిం చే ఏకైక నాయకుడు చంద్రబాబు ఒక్కరేననే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని సౌమ్య హితవు పలికారు.