చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home చైతన్యరధం

మద్యం స్కామ్‌ అంటూ చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడం సిగ్గుచేటు: ఏలూరి

నాలుగేళ్లలో కల్తీ మద్యం అమ్మకాలతో రూ.24వేల కోట్లు దిగమింగిన జగన్‌రెడ్డి అతని ప్రభుత్వం, నిస్సిగ్గుగా చంద్రబాబు పై నిందలేస్తుంది

చైతన్యరధం by చైతన్యరధం
November 2, 2023
in చైతన్యరధం, తాజా సంఘటనలు, పత్రికా ప్రకటనలు, ముఖ్య వార్తలు
మద్యం స్కామ్‌ అంటూ చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడం సిగ్గుచేటు: ఏలూరి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • స్కిల్‌ కేసులో మధ్యంతర బెయిల్‌ వస్తుందని తెలిసే చంద్రబాబుపై మద్యం అక్రమ కేసు
  • ప్రివిలేజ్‌ ఫీజు తగ్గించారనే ఆరోపణ పచ్చి అబద్ధం
  • ఎన్నికల సమయంలో లేబుల్‌ రిజిస్ట్రేషన్ల కోసం కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారనడం

అమరావతి: రాష్ట్రంలో గత నాలుగేళ్లలో కల్తీ మద్యం అమ్మకాలతో రూ.24వేల కోట్లు దిగమింగిన జగన్‌రెడ్డి, నిస్సిగ్గుగా టీడీపీ ప్రభుత్వంపై, చంద్రబాబు పై నిందలేస్తూ, తప్పుడు కేసులు పెడుతూ తన మద్యం దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు కుయుక్తులు పన్నుతు న్నాడని టీడీపీ నేత, శాసనసభ్యుడు ఏలూరి సాంబశివ రావు ఆరోపించారు. జగన్మోహన్‌రెడ్డి కుట్రతో, కక్ష సాధింపుతో చంద్రబాబుపై స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపాడని విమర్శించారు. ఆ కేసుని నిరూపించలేక ఇటు ప్రజల్లో, అటు న్యాయస్థానంలో తీవ్రంగా అవమానపడి, ఆ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పై బయటకు వస్తాడని ముందే పసిగట్టి టీడీపీ అధినేతపై మొన్నటికి మొన్న హడావిడిగా గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అనుమతుల్లో అక్రమాలంటూ మరో తప్పు డు కేసు నమోదు చేశాడని దుయ్యబట్టారు. మంగళ గిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో రిమాండ్‌ ఖైదీగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే జగన్‌ రెడ్డి అతని జేబు సంస్థ సీఐడీ, టీడీపీ అధినేతపై ఫైబర్‌ నెట్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, అంగళ్లు ఘటనలకు సంబంధించిన పీటీ వారెంట్‌లు దాఖలు చేసిందన్నారు. అవి చాలవన్నట్లు తాజాగా చంద్రబాబు పై మద్యం కేసు నమోదు చేశారు. కల్తీమద్యాన్ని రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మిస్తూ, వైసీపీ నేతలు.. మంత్రులతో మద్యం వ్యాపారం చేయిస్తూ.. ఆడబిడ్డల మానప్రాణాలను తన మద్యం మాఫియాకు బలిచేస్తున్న జగన్మోహన్‌రెడ్డి, సిగ్గులేకుండా చంద్రబాబు పై మద్యం కేసు పెట్టించాడని ఏలూరి మండిపడ్డారు.

ఏరికోరి వాసుదేవరెడ్డిని తెచ్చుకున్నదే చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టడానికి
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మద్యం మాఫియా వెనకున్న పాత్రధారితో తప్పుడు ఆరోపణలు చేయించి, ఈ ప్రభుత్వం చంద్రబాబుపై మద్యం కేసు పెట్టిం చింది. వాసుదేవరెడ్డి అనే అతను 2009 బ్యాచ్‌కు చెందిన ఐ.ఆర్‌.టీ.ఎస్‌ (ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌) అధికారి. తెలంగాణకు చెందిన సదరు అధికారికి రాష్ట్రం గురించి, ఇక్కడి ప్రజలు.. వారి సమస్యల గురించి ఏమాత్రం తెలియదు. జగన్‌ అధికారంలోకి రాగానే, తన మద్యం దోపిడీకి పనికొస్తాడని ఏరికోరి వాసుదేవరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చాడు. అతన్ని ఏరికోరి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా… డిస్టిలరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా జగన్మోహన్‌ రెడ్డి నియమించాడు. తన ధన దాహం తో రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి.. అతని దోపిడీకి సహకరిస్తూ, దాదాపు 40 లక్షల మంది పేదలు అనారోగ్యం పాలవ్వడానికి, వారి కుటుంబాలు రోడ్డున పడటానికి, 30వేల ప్రాణాలు మద్యం మహమ్మారికి బలైపోవడానికి కారణమైన వాసుదేవరెడ్డి కలిసి, మద్యం కంపెనీల అనుమతులకు సంబంధించి తప్పు జరిగిందంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేయడం.. తప్పుడు కేసులు పెట్టడం నిజంగా సిగ్గు చేటు. జగన్‌ తన దోపిడీ కోసం తీసుకొచ్చిన నూతన మద్యం విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి ఆదాయం రాకపోయినా, తాడేపల్ల ప్యాలెస్‌ కు మాత్రం వేలకోట్లు చేరాయి. రాష్ట్రంలో జరిగే మద్యం అమ్మకాల ద్వారా తాడేపల్లి ప్యాలెస్‌ కు వేల కోట్లు చేరడం వెనకున్న ప్రధాన వ్యక్తి అయిన వాసుదేవ రెడ్డి తీరుపై.. గతప్రభుత్వ నిర్ణయాలను అతను తప్పుపట్టడంపై అతని వైఖరి తెలిసిన వారంతా నవ్వుకుంటున్నారు. ఏదో రకంగా గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లాలి..చంద్రబాబుని ప్రజల్లో పలుచన చేయాలనే వాసుదేవరెడ్డి స్టేట్‌మెంట్‌ ఆధారంగా టీడీపీ అధినేతపై జగన్‌ రెడ్డి తప్పుడు కేసు పెట్టించాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యాన్ని రాష్ట్రంలో లేకుండా చేస్తానని, పేదల ప్రాణాలు కాపాడతానని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్మోహన్‌ రెడ్డి, నేడు అదే మద్యంపై వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడిపే దుస్థితికి వచ్చాడు. అలాంటి వ్యక్తి మద్యం టెండర్లలో చంద్రబాబు తప్పుచేశాడని చెప్పడం…వాసుదేవరెడ్డి లాంటి తప్పుడు వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుపై కేసు పెట్టడం నిజంగా హాస్యాస్పదమని ఏలూరి విమర్శించారు.

మద్యం టెండర్లలో చంద్రబాబు తప్పు చేశాడనడం సిగ్గుచేటు
గత ప్రభుత్వం రాష్ట్రంలో అమలుచేసిన మద్యం పాలసీలో వినియోగదారుడికి తనకు నచ్చిన మద్యం కొనుక్కునే ఛాయిస్‌ ఉండేది. ఆ మద్యం కూడా తక్కువ ధరకు లభించేది. కానీ నేడు జగన్‌ రెడ్డి పాలనలో అంతా రివర్స్‌. అధికధర పెట్టినా నచ్చిన బ్రాండ్‌ దొరకదు. జగన్‌ తన కమీషన్ల కోసం, తన బినామీలతో అమ్మించే కల్తీ మద్యం తప్ప రాష్ట్రంలో మరే బ్రాండ్ల మద్యం దొరకడం లేదు. ముఖ్యమంత్రి.. తనకు కమీషన్లు ఇచ్చే మద్యం కంపెనీలు తయారుచేసే నాసిరకం మద్యాన్ని మాత్రమే రాష్ట్రంలో విక్రయిస్తున్నాడు. తన దోపిడీ కోసం ఏపీ బీ.సీ.ఎల్‌ ను, డిస్టిలరీస్‌ కార్పొరేషన్‌ ను వాడుకోవడం కోసం ఏకంగా ఆ రెండు విభాగాలను వాసుదేవరెడ్డికి కట్టబెట్టిన జగన్‌.. అతని ద్వారా ప్రభుత్వం అమ్మే మద్యం ద్వారా తన దోపిడీ కొనసాగిస్తున్నాడు. అమ్మేదే కల్తీ మద్యం.. అదికూడా ఎక్కువ ధరకు. ఆ కల్తీ మద్యం తయారుచేసేది.. సరఫరా చేసేది.. అమ్మేది అంతా జగన్‌..అతని మద్యం మాఫియానే. ఈ విధంగా కేవలం మద్యం అమ్మకాలతోనే జగన్‌ రెడ్డి నాలుగున్నరేళ్లలో రూ.24వేల కోట్ల వరకు దిగమింగాడు. వైసీపీ ప్రభుత్వ మద్యం మాఫియాపై ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ప్రజలసాక్షిగా అనేక పోరాటాలు చేసింది. కేంద్రప్రభుత్వ సంస్థలకు ఫిర్యాదు కూడా చేసింది. అయినా జగన్‌ మద్యం మాఫియాపై చర్యలు లేవని ఏలూరి ఆరోపించారు.

టీడీపీ హయాంలో ఎలాంటి అవతవకలకు అవకాశమివ్వలేదు
టీడీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ మొత్తం ఎంతో పారదర్శకంగా అమలైంది. టెండర్లు పిలవడం దగ్గర నుంచీ, దుకాణాలు అప్పగించే వరకు మొత్తం ప్రక్రియ అంతా మంత్రుల కమిటీ, ఐఏఎస్‌ అధికారుల కమిటీ, రిటైర్డ్‌ ఐఏఎస్‌లు, రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌లు, చార్టెడ్‌ అకౌం టెంట్లు ఇలా ఎందరో నిష్ణాతులైన వ్యక్తుల పర్యవేక్షణ లో, వారి సిఫార్సులతో ప్రతి నిర్ణయం ఎంతో పార దర్శకంగా అమలైంది. ఎక్కడా ఎలాంటి చిన్న తప్పుకు కూడా అవకాశం లేకుండా నాడు టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం పాలసీని అమలుచేసింది. దానివల్ల ఏపీలో నాణ్యమైన మద్యమే, అందుబాటు ధరల్లో లభిం చిందని ఏలూరి తెలిపారు.

ముందు రాష్ట్రంలోని మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలి
రాష్ట్రంలో జరుగుతున్న మద్యం మాఫియా.. జగన్‌ సాగిస్తున్న దోపిడీపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజ ల్లో చైతన్యం తీసుకొచ్చాడన్న అక్కసుతో.. తన కక్ష సాధింపుల్లో భాగంగానే ప్రభుత్వం చంద్రబాబుపై తప్పు డు కేసు పెట్టింది. ఈ ప్రభుత్వం నిజంగా మద్యం టెండర్లు.. అమ్మకాలు.. మద్యం తయారీలో ఎలాంటి తప్పు చేయకుంటే, తక్షణమే రాష్ట్రంలో జరుగుతున్న మద్యం వ్యాపారంపై సీబీఐ విచారణ కోరాలి. వాసుదేవ రెడ్డి నిజంగా నిజాయితీపరుడే అయితే అతని నేత్రత్వం లో మద్యం వ్యాపారానికి సబంధించి తీసుకు న్న ప్రతి నిర్ణయం.. జరిగిన ప్రతివ్యవహారంపై కూడా ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలి. పేదల రక్త మాంసాలు అమ్ము కుంటూ మద్యం వ్యాపారం సాగిస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఎందుకు నగదురహిత చెల్లింపులు అమలు చేయడం లేదో సమాధానం చెప్పా లి. మద్యం అమ్మకాలపై వచ్చే సొమ్ము లో ఖజానాకు చేరుతున్నది ఎంతో.. తాడేపల్లికి చేరుతున్నది ఎంతో తేలాలంటే తక్షణమే జగన్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తో సంప్రదించి సీబీఐ విచారణకోరాలని సాంబశివ రావు డిమాండ్‌ చేశారు.

 

ఎస్పీవై డిస్టిలరీస్‌ కోసం నిబంధనలు అతిక్రమించడంపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు?

  • డిస్టిలరీలకు అనుమతులపై ఆరోపణలు నిరాధారం
  • నాలుగేళ్లలో కల్తీ మద్యం అమ్మకాలతో రూ.24వేల కోట్లు దిగమింగిన జగన్‌రెడ్డి
  • నిస్సిగ్గుగా చంద్రబాబుపై నిందలేస్తూ, తన మద్యం దోపిడీని ప్రజలకు కప్పిపుచ్చాలనుకుంటున్నాడు

కానీ నేడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, ముఖ్యమంత్రి బంధు వుల కోసం ఎస్పీవై డిస్టిలరీస్‌ కోసం అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమించింది.దాదాపు 14లక్ష ల లీటర్ల మద్యం ప్యాకింగ్‌ జరు గుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మే కల్తీ మద్యంలో ఎక్కువభాగం ఎస్పీవై డిస్టిలరీస్‌ నుంచే వస్తోంది. దీని పై జగన్మోహన్‌రెడ్డి.. వాసుదేవ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? నాటి ప్రభుత్వంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పనిచేసిన అజయ్‌ కల్లంరెడ్డి సిఫార్సుల మేరకు తీసు కున్న నిర్ణయాలను నేడు జగన్‌ ప్రభుత్వంలో కింది స్థాయి అధికా రిగా ఉన్న వాసుదేవరెడ్డి ఎలా తప్పుపడతారు? ఒక వేళ తప్పు పడితే అజయ్‌ కల్లం రెడ్డిని వది లేసి…కేవలం చంద్రబాబే అన్నిం టికీ బాధ్యుడని జగన్‌ ప్రభుత్వం ఆరోపించడం కక్ష సాధింపుకాక మరేమిటని ఏలూరి ప్రశ్నించారు.
జగన్‌ ప్రభుత్వం చేస్తున్న నిరాధార ఆరోపణలు.. వాస్తవాలు

ఆరోపణ-1: మద్యం టెండర్లకు సంబంధించిన ప్రివిలేజ్‌ ఫీజు తగ్గించారు
వాస్తవం: టీడీపీ ప్రభుత్వంలో అధికారులుగా ఉన్న అజయ్‌ కల్లం రెడ్డి.. మరికొందరు ఐఏఎస్‌ అధికారులు కలిసి నాడు మద్యం వ్యాపారం చేసే చిన్నచిన్న వ్యాపారుల అభ్యర్థన మేరకు ఆనాడు ప్రివిలేజ్‌ ఫీజు తగ్గించారు. కానీ మద్యం దుకాణాల కు సంబంధించిన అప్లికేషన్‌ ఫీజును నాటి ప్రభుత్వం రూ.2 లక్షలుగా నిర్ణయించడంతో తద్వారా రూ.1800 కోట్ల ఆదాయం ఒక్క సంవత్సరంలోనే ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యింది. అలానే అడిషనల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ 35 శాతం విధించడం వల్ల, ప్రభుత్వానికి ఎక్కువగా అదనపు ఆదాయం వచ్చింది. ప్రభుత్వ ఆదాయం పెరగడానికే నాటి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించింది.
నాటి రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం ఏపీబీసీఎల్‌ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి లాంటి కింది స్థాయి అధికారికిలేదు. కింది స్థాయి వ్యక్తి ప్రభుత్వ పాలసీలు, నాటి విధానాలను తప్పుపట్టడం ముమ్మాటికీ ఈ ప్రభుత్వ రాజకీయ కుట్రలో భాగమే. ఒకవేళ నిజంగా నాటి ప్రభుత్వ నిర్ణయం తప్పే అయితే, ఆ నిర్ణయాన్ని అమలు చేసిన నాటి ప్రభుత్వం లో ఉన్న ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ కల్లం రెడ్డి కూడా దోషే అవుతారు. నేడు జగన్‌ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న అజయ్‌ కల్లంరెడ్డిపై మాత్రం ఏపీ సర్కార్‌ ఎలాంటి చర్యలు తీసుకోదు. కేవలం జగన్‌, అతని ప్రభుత్వం ఎంపిక చేసినవారిపైనే తప్పుడు కేసులు పెడుతూ… వారినే ఇరికించాలని చూస్తోందని ఏలూరి తప్పుబట్టారు.

ఆరోపణ-2 : ఎన్నికల సమయంలో లేబుల్‌ రిజిస్ట్రేషన్‌ కోసం నాటి ప్రభుత్వం కొన్ని కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చింది.
వాస్తవం: అది చాలా సింపుల్‌ ప్రాసెస్‌. అప్పటికే మద్యం దుకాణాల లైసెన్స్‌ పొందిన వారు ఎవరైనా సరే, ప్రభుత్వానికి రూ.లక్ష పూచీకత్తు సమర్పించి లేబుల్‌ రిజిస్ట్రేషన్‌ పొందవచ్చు. అదే తప్పు అయితే మరి నేడు వైసీపీ ప్రభుత్వం దాదాపు 100కు పైగా మద్యం బ్రాండ్లకు ఎలా అనుమతి ఇచ్చింది?
ఆరోపణ-3: డిస్టిలరీల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల్లో పీఎంకే, విశాఖ డిస్టిలరీస్‌ విషయంలో తప్పు చేశారు
వాస్తవం: డిస్టిలరీలకు అనుమతులకు సంబంధించి నాటి ప్రభుత్వం ఒక కమిటీని నియమించి, ఆ కమిటీ సూచనల ప్రకారమే వ్యవహరించింది. ఆ కమిటీలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు, రిటైర్డ్‌ న్యాయమూర్తులు, చార్టెడ్‌ అకౌంటెంట్లు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయాక.. తెలంగాణలో ఎక్కువ డిస్టిలరీలు ఉండి.. ఇక్కడ తక్కువ ఉండటంతో ఇక్కడి అవసరాల మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వ్యవహరించి, అన్ని అర్హతలున్న సంస్థలకు అనుమతులు ఇచ్చారు.
జగన్‌ ప్రభుత్వం చెప్పిన పీఎంకే డిస్టిలరీస్‌, విశాఖ డిస్టిలరీలు ప్రస్తుతం ఈ ప్రభుత్వంలోని పెద్దల అధీనంలోనే కొనసాగుతున్నాయి. ఆనాడు రాయలసీమ ప్రాంతంలో ఖాయిలా పడిన ఒక పెద్ద డిస్టిలరీ అభ్యర్థన మేరకు వారికి వాయిదాల పద్ధతిలో ప్రభుత్వానికి సొమ్ము చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఆ నిర్ణయం కూడా కేబినెట్లో చర్చించే తీసుకున్నారు. ఆ డిస్టిలరీలో పనిచేసే ఉద్యోగులు.. వెనుకబడిన ప్రాంతంలోని పరిస్థితి దృష్ట్యానే నాడు ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఏలూరి వివరించారు.

ఆరోపణ-3: డిస్టిలరీల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల్లో పీఎంకే, విశాఖ డిస్టిలరీస్‌ విషయంలో తప్పు చేశారు
వాస్తవం: డిస్టిలరీలకు అనుమతులకు సంబంధించి నాటి ప్రభుత్వం ఒక కమిటీని నియమించి, ఆ కమిటీ సూచనల ప్రకారమే వ్యవహరించింది. ఆ కమిటీలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు, రిటైర్డ్‌ న్యాయమూర్తులు, చార్టెడ్‌ అకౌంటెంట్లు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయాక.. తెలంగాణలో ఎక్కువ డిస్టిలరీలు ఉండి.. ఇక్కడ తక్కువ ఉండటంతో ఇక్కడి అవసరాల మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వ్యవహరించి, అన్ని అర్హతలున్న సంస్థలకు అనుమతులు ఇచ్చారు.
జగన్‌ ప్రభుత్వం చెప్పిన పీఎంకే డిస్టిలరీస్‌, విశాఖ డిస్టిలరీలు ప్రస్తుతం ఈ ప్రభుత్వంలోని పెద్దల అధీనంలోనే కొనసాగుతున్నాయి. ఆనాడు రాయలసీమ ప్రాంతంలో ఖాయిలా పడిన ఒక పెద్ద డిస్టిలరీ అభ్యర్థన మేరకు వారికి వాయిదాల పద్ధతిలో ప్రభుత్వానికి సొమ్ము చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఆ నిర్ణయం కూడా కేబినెట్లో చర్చించే తీసుకున్నారు. ఆ డిస్టిలరీలో పనిచేసే ఉద్యోగులు.. వెనుకబడిన ప్రాంతంలోని పరిస్థితి దృష్ట్యానే నాడు ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఏలూరి వివరించారు.

Tags: ఏలూరి సాంబశివరావుకల్తీ మద్యంనారా చంద్రబాబు నాయుడునారా లోకేష్మద్యం కంపెనీలు
Previous Post

నాలుగున్నరేళ్ల నుంచి ఇసుకను బొక్కేేస్తూ చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసా జగన్ రెడ్డి? – పట్టాభిరాం.

Next Post

చంద్రబాబుపై మరో కేసు!

Next Post
చంద్రబాబుపై మరో కేసు!

చంద్రబాబుపై మరో కేసు!

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 Telugu Desam Party.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.