చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

కేంద్ర మంత్రి రాజ్ నాధ్‌సింగ్‌తో కలిసి ఆమ్కా ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన

by చైతన్యరధం
May 16, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  •  ఆత్మనిర్భర్ లక్ష్యంలో ఆమ్కా ప్రాజెక్టు ముందడుగు
  • 36 రోజుల్లో జెట్ స్పీడ్ లో ఈ ప్రాజెక్టుకు అనుమతులు
  • ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు ఉద్యమానికి ఏపీ సారధ్యం
  • త్వరలో బంగారం ఉత్పత్తికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
  • కేంద్ర మంత్రి రాజ్ నాధ్‌సింగ్‌తో కలిసి ఆమ్కా ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన
  • ఏపీ అంటే అడ్వాన్స్డ్ ప్రదేశ్: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కితాబు

పుట్టపర్తి (చైతన్య రథం): అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు సహా వివిధ డిఫెన్సు యూనిట్లతో దేశానికి రక్షణ కవచంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలోని ఆమ్కా ప్రాజెక్టుతో ప్రధాని మోదీ ఆశిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆమ్కా ప్రాజెక్టు సహా ఇతర రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. డీఆర్డీఓలో భాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలోని అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టు శిలాఫలకాన్ని ఇరువురు నేతలు ఆవిష్కరించారు. త్రివిధ దళాలకు రక్షణ ఉత్పత్తులను తయారు చేయనున్న కల్యాణీ స్ట్రాటజిక్ సిస్టమ్స్ ఆధ్వర్యంలోని ఆగ్నేయాస్త్ర ఎనర్జిటిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచఎఫ్ సీఎల్ ప్రాజెక్టుల శిలాఫలకాలను కేంద్ర మంత్రితో కలిసి సీఎం ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని డ్రోన్ సిటీలో ఏర్పాటు కానున్న 5 డ్రోన్ తయారీ, టెక్నాలజీ కంపెనీలను కూడా వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”సత్యసాయి బాబా బోధనలతో ఈ ప్రాంతం నుంచి విశ్వ శాంతికి బాటలు పడ్డాయి. ఇప్పుడు పుట్టపర్తిలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు రావటం ఎంతో కీలకంగా మారింది. దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగా పుట్టపర్తి మారుతుంది. ఆమ్కా ప్రాజెక్టుతో ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యసాధనలో ఏపీ ముఖ్యపాత్ర పోషిస్తుంది. భారత రక్షణ రంగాన్ని ఆధునీకరించటంతో పాటు బలోపేతం చేయటంపై ప్రధాని దృష్టి సారించారు. ఆధునిక తరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేసేలా JGF ప్రాజెక్టు ఏర్పాటు అవుతోంది. భారత రక్షణ శక్తిని ప్రపంచానికి చాటటంలో ఆపరేషన్ సింధూర్ ఓ ప్రత్యక్ష ఉదాహరణ. ఆపరేషన్ సింధూర్ లో వినియోగించిన డ్రోన్లు ఏపీలోనే తయారై, టెస్ట్ చేశారు. JGF లాంటి ప్రాజెక్టును ఏపీకి కేటాయించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు ధన్యవాదాలు. రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టు వస్తుంది. ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్ తో పాటు ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రంగా పుట్టపర్తి మారుతుంది. అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేయటంలో రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాయి.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రోజుల వ్యవధిలోనే అమ్కా ప్రాజెక్టు సాకారం
“కేవలం 36 రోజుల్లోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగలిగామని.. జెట్ స్పీడ్‌తో అనుమతులిచ్చామని సీఎం వివరించారు. ఏరోస్పేస్ రంగంలో కీలకమైన ఈ ప్రాజెక్టుతో పాటు మరికొన్ని డిఫెన్సు ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. భారత్ ఫోర్జ్, హెచఎఫ్ సీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశాం. ఇటీవల యుద్ధాల్లో డ్రోన్లే కీలకంగా మారాయి. వ్యవసాయం నుంచి చాలా రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగింది. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీహరికోట అంతరిక్ష శక్తి, నాగాయలంకలో క్షిపణిశక్తి, పుట్టపర్తి రక్షణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తితో మొత్తం దేశానికే రక్షణ కవచంగా ఏపీ నిలుస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చాకే రాయలసీమకు నీరిచ్చి లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ గా మారుస్తున్నాం. రాయలసీమలో ఇనుప ఖనిజం, సున్నపురాయి లాంటి ఖనిజ వనరుల్ని సమర్ధంగా వినియోగించుకుంటాం. కడప స్టీల్ ప్లాంటు 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం. స్టీల్, సిమెంట్ ప్లాంట్లు, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, స్పేస్ , ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ లాంటి పరిశ్రమలతో రాయలసీమ రతనాల సీమగా మారుస్తాం. కొప్పర్తి పారిశ్రామిక నోడ్ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా మారుతుంది. తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్, శ్రీహరి కోట సమీపంలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తాం. కియా పరిశ్రమ ఏటా 18 లక్షల కార్లు తయారు చేస్తోంది. కరవు సీమలో తయారైన కార్లు 80 దేశాల్లో తిరుగుతున్నాయి. రాయలసీమలోని ఆర్డీటీ సంస్థకు విదేశీ విరాళాల విషయంలో సమస్య ఉత్పన్నం అయితే కేంద్రంతో మాట్లాడి మంత్రి లోకేష్ ఆ సమస్యను పరిష్కరించారని” సీఎం వెల్లడించారు.
గతంలో కేజీఎఫ్ ఇప్పుడు జేజీఎఫ్
“త్వరలో కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ నుంచి బంగారం ఉత్పత్తి జరుగుతుంది. జీGఖీలో ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి అవుతుంది. రెండో ఏడాది 1,500 కిలోల బంగారం తయారవుతుంది. రానున్న రోజుల్లో బంగారం ఉత్పత్తికి ఏపీ కీలకంగా మారుతుంది. సమర్ధవంతమైన నీటి నిర్వహణతో జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. అభివృద్ధిని బుల్లెట్ స్పీడ్ తో తీసుకెళ్తున్నాం. అవకాశాలు తెచ్చే బాధ్యత మాది. వాటిని అందిపుచ్చుకునే బాధ్యత యువతది. గత పాలనలో విధ్వంసం చేశారు. పరిశ్రమలు తరిమేశారు. సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారు.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో మళ్లీ ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించాం. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వీటివల్ల 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఇక్కడే ఉద్యోగాలు రావాలి, ఇతరులకూ ఇక్కడే ఉపాధి కల్పించేలా పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రాజెక్టులు వచ్చాయి. రిలయన్స్, బీపీసీఎల్ లాంటి ప్రాజెక్టులు వస్తాయి. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా మూడు ఎకనామిక్ రీజియన్లలో పెట్టుబడులు వస్తాయి. చిప్ నుంచి షిప్ వరకూ మన దేశంలోనే తయారు కావాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు.
ఏపీలో డిజైన్ చేయండి, పెట్టుబడులు పెట్టండి, ఉత్పత్తులు తయారు చేయండి అని పారిశ్రామిక వేత్తల్ని కోరుతున్నాను. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఏపీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం… వేగంగా అనుమతులు ఇస్తున్నాం. దేశానికి తిరుగులేని శక్తిగా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తయారవుతాయి.” అని ముఖ్యమంత్రి వివరించారు.
నాదేశం- నాబాధ్యత
“పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం మనపై కూడా పడిందని…ఇంధనం, బంగారం కొనుగోలుతో విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయని సీఎం అన్నారు. దేశానికి ఆర్ధిక భద్రత కూడా అత్యంత కీలకమని..ఇతర దేశాలు కూడా పొదుపు చర్యలు చేపట్టాయని తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన 7 అంశాలను ఆచరిద్దాం. పొదుపు చర్యల్లో భాగంగా కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నాం. దీనిపై ఓ కార్యాచరణను కూడా తీసుకువచ్చాం. వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి అంశాలను అమల్లోకి తీసుకు రావాలని కోరుతున్నాను. ప్రతీ భారతీయుడూ ప్రస్తుత సవాళ్లను అవకాశాలుగా మలచుకోవాలి. ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు ఉద్యమానికి ఏపీ సారధ్యం వహించాలని” ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఏపీ ఇక అడ్వాన్స్‌డ్ ప్రదేశ్- రాజ్‌నాథ్ సింగ్
ఆమ్కా ప్రాజెక్టు ఏపీ సహా దేశ రక్షణలో ఓ చారిత్రాత్మక అధ్యాయాన్ని జోడిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీలతో పాటు రక్షణ రంగ పరిశ్రమల్ని ఆకర్షిస్తున్న ఏపీ పేరు అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. 5 జనరేషన్ ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానాల్ని తయారు చేస్తున్న రాయలసీమను మిలటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సుగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. రూ.15 వేల కోట్ల విలువైన పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఇలాంటి ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రాలు కేవలం కొద్దిదేశాల వద్ద మాత్రమే ఉన్నాయని.. ఇప్పుడు భారత్ కూడా ఆ సరసన చేరిందని అన్నారు. అమ్కా ప్రాజెక్టుతో తయారైన ఆధునిక యుద్ధ విమానాలు మన రక్షణ శక్తిని చాటేలా మన గగనశక్తిని చాటేలా పుట్టపర్తి నుంచి టేకాఫ్ అవుతాయని కేంద్ర మంత్రి వివరించారు. ఆ తరహా యుద్ధ విమానాలను పుట్టపర్తి నుంచి తయారు చేయబోతున్నామని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా రూ.480 కోట్లతో ఆధునిక అటానమస్ అండర్ వాటర్ వ్యవస్థలను, టార్పెడోలను ఉత్పత్తి చేస్తుందన్నారు. ఇప్పటి వరకూ దిగుమతి చేసుకుంటున్న చాలా పరికరాలను కూడా స్వదేశీయంగా తయారు చేసుకోగలమని చెప్పారు.
7 సంస్థలతో ఒప్పందాలు
అంతకు ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు సమక్షంలో 7 సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. రూ.4460 కోట్ల పెట్టుబడులు, 6400 మందికి ఉద్యోగాలు కల్పించేలా ఈ ఒప్పందాలు కుదిరాయి. భారత్ ఫోర్జ్, రఘువంశీ మెషీన్ టూల్స్ , సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ , ఎనఐబీఈ గ్రూప్, పీఎంటీ డిఫెన్స్, చక్రవ్యూహ్ డైనమిక్స్ , ఇండస్ బ్రిడ్జ్ వెంచర్స్ సంస్థలు ఈ ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ఆమ్కా ప్రాజెక్టులో నిర్మితం కానున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ నమూనాతో పాటు భారత్ డైనమిక్స్ సహా వేర్వేరు సంస్థలు ఏర్పాటు చేసిన మిస్సైళ్లు, హ్యాండ్ గ్రెనేడ్ లు, టార్పెడో నమూనాలు, ఆధునిక తుపాకుల ప్రదర్శనను కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో కలిసి సీఎం తిలకించారు. శంకుస్థాపనల కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, మంత్రులు టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్, సవిత, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఏపీ సలహాదారు సతీష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2026

Next Post

16  నెలలు… 16కు పైగా విజయాలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-11-2026

November 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-11-2026

November 21, 2026
పీఎం స్వనిధి పథకం అమలులో ఏపీ మెప్మాకు జాతీయస్థాయిలో గుర్తింపు
ఆంధ్రప్రదేశ్

పీఎం స్వనిధి పథకం అమలులో ఏపీ మెప్మాకు జాతీయస్థాయిలో గుర్తింపు

November 21, 2026
నిత్యావసర ధరల నియంత్రణకు ఏడాది కాల ప్రణాళిక!
ఆంధ్రప్రదేశ్

నిత్యావసర ధరల నియంత్రణకు ఏడాది కాల ప్రణాళిక!

November 21, 2026
త్వరలో ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
ఆంధ్రప్రదేశ్

త్వరలో ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

November 21, 2026
తుఫాన్లతో ఏపీలో ఉద్యాన పంటల నష్టం రూ.1,092 కోట్లు
ఆంధ్రప్రదేశ్

తుఫాన్లతో ఏపీలో ఉద్యాన పంటల నష్టం రూ.1,092 కోట్లు

November 21, 2026
Next Post
16  నెలలు… 16కు పైగా విజయాలు

16  నెలలు... 16కు పైగా విజయాలు

ముఖ్య వార్తలు

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

by చైతన్యరధం
November 20, 2026

ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...

ఐక్యతే మన బలం…

ఐక్యతే మన బలం…

by చైతన్యరధం
November 19, 2026

పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...

వరుస తుఫాన్లతో నష్టం వాటిల్లింది… తక్షణ సాయం అందించండి

వరుస తుఫాన్లతో నష్టం వాటిల్లింది… తక్షణ సాయం అందించండి

by చైతన్యరధం
November 18, 2026

రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రాయలసీమ హార్టికల్చర్ హబ్కు నిధులు విడుదల చేయండి వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

by చైతన్యరధం
November 17, 2026

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

by చైతన్యరధం
October 23, 2026

విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 22-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 22-11-2026

by కార్యకర్త
November 22, 2026

చైతన్యరధం ఈ పేపర్ 21-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 21-11-2026

by కార్యకర్త
November 21, 2026

పీఎం స్వనిధి పథకం అమలులో ఏపీ మెప్మాకు జాతీయస్థాయిలో గుర్తింపు

పీఎం స్వనిధి పథకం అమలులో ఏపీ మెప్మాకు జాతీయస్థాయిలో గుర్తింపు

by చైతన్యరధం
November 21, 2026

మూడు విభాగాల్లో జాతీయ అవార్డులు.. అధికారులను అభినందించిన మంత్రి నారాయణ ఇప్పటివరకు 4.94 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.1,016.88 కోట్ల రుణాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో...

నిత్యావసర ధరల నియంత్రణకు ఏడాది కాల ప్రణాళిక!

నిత్యావసర ధరల నియంత్రణకు ఏడాది కాల ప్రణాళిక!

by చైతన్యరధం
November 21, 2026

నిరంతర మార్కెట్ పర్యవేక్షణ, అగ్రి-వాచ్ ద్వారా ధరల కట్టడికి చర్యలు రైతులకు నష్టం రాకూడదు.. వినియోగదారులకు ఇబ్బంది కలగకూడదు మార్కెట్ జోక్యం కోసం ప్రస్తుతం నెలకు రూ.100...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.