హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతిమణి నారా భువనేశ్వరి పుట్టిన రోజు కార్యక్రమాన్ని టీడీపీ టీఎస్ నాయకులు ఎన్‌టీఆర్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ టీఎస్ అధ్యకక్షులు బక్కని నర్సిహుంలు కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… సమాజం కోసం ఆలోచించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ కోసం, ప్రజల కోసం జాతీయ అధ్యకక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అవిరళ కృషి జరపడానికి నారా భువనేశ్వరి కృషి ఎంతో ఉందన్నారు. నందమూరి ఎన్టీఆర్ పేరుమీద ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్టు ద్వారా సేవ కార్యక్రమాలను నడిపిస్తున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ ట్రస్టు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. దేశంలో, రాష్ట్రంలో ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేక రూపాలలో అండగా నిలిచింది. మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా నది వరదలు వచ్చి సర్వం కోల్పోయిన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రూ. లక్షలాది ఖర్చు చేసి వివిధ రూపాలలో వారిని అదుకోవడం జరిగిందన్నారు. తిరుపతి, గుంటూరులలో కూడా ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయడంలో ట్రస్టు కృషి ఎంతో అభినందనీయమని అన్నారు. తెలంగాణలో వెనకబడిన జిల్లా మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద గూడూరులో రూ.50 లక్షలతో అక్సిజన్ ప్లాంట్‌ను ట్రస్టు ద్వారా ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణదాతగా నిలిశారని తెలియజేశారు. అనాధలకు, అంగవైకల్యం ఉన్న4159 మంది విద్యార్ధులకు ట్రస్టు ద్వారా విద్యను అందిస్తున్నారని అన్నారు. ఐఎఎస్, ఐపిఎస్ వంటి సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు కూడా అందిస్తున్నారని తెలియజేశారు. స్వచ్ఛంద సంస్థగా ట్రస్టును నడపడం తెలుగుదేశం పార్టీకి గర్వకారణమని అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున నారా భువనేశ్వరి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు మరింత సేవ చేయడానికి భువనేశ్వరి శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్, జహీరాబాద్ పార్లమెంట్ అధ్యక్షలు పైడి గోపాల్ రెడ్డి, అధికార ప్రతినిధులు శ్రీనివాస్ నాయుడు, బాలసుబ్రమణ్యం, ఎస్సీ సెల్ అధ్యకక్షులు పి.అశోక్, టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యకక్షులు పర్లపల్లి రవీందర్, ఐటీడీపీ అధ్యకక్షులు హరికృష్ణ, మల్కాజ్‌గిరి పార్లమెంట్ తెలుగు యువత అధ్యకక్షులు సాయి నాగర్జున, తదితరులు పాల్గొన్నారు.