- మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల
- గుంతలు పూడ్చే పనులకు రూ.290 కోట్లు
- భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు
- వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభం
- ఆర్వోబీల భూసేకరణకూ నిధులు..
- ఆర్ అండ్ బి సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు. అదేవిధంగా రహదారుల్లో ప్రధాన సమస్యగావున్న పాత్ హోల్స్ పూడ్చేందుకు మరో రూ.290 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. అదేవిధంగా ఆర్వోబీల పూర్తికి భూసేకరణ కోసం అవసరమైన రూ.42 కోట్ల నిధుల విడుదలకూ అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో రూ.65 వేల కోట్లతో జరుగుతున్న నేషనల్ హైవే పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రతి మూడు నెలలకు ఎంత పని పూర్తి చేయగలమనేది మదింపు చేసుకుని.. టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చెయ్యాలన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి బిసి జనార్థన్‌రెడ్డితోపాటు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదలతో రోడ్ నెట్ వర్క్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని సీఎం అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంవల్ల అసలే అంతంత మాత్రంగావున్న రోడ్ల దుస్థితి మరింత దారుణంగా తయారైందని వ్యాఖ్యానించారు. వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 4,565 కి.మీ రోడ్లలో మరమ్మతు పనులు చేసేందుకు రూ.186 కోట్లు, వివిధ జిల్లాల్లో గుంతలు పూడ్చడం కోసం రూ.290 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. డ్రోన్, లైడార్ సాంకేతిక సహాయంతో దెబ్బతిన్న రహదారుల నష్టాన్ని అంచనా వేసి పనుల చేపట్టాలని ఆదేశించారు. సేతుబంధన్ ప్రాజెక్టు ద్వారా నిర్మిస్తున్న ఆర్వోబీల భూసేకరణ కోసం పెండిరగ్‌లోవున్న రూ.42 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆ పనులు వెంటనే పూర్తి చెయ్యాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సేతుబంధన్, గతిశక్తి వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో చేపట్టిన అన్ని ఆర్వోబీలను త్వరగా చేపట్టి పూర్తి చెయ్యాలన్నారు. జాతీయ రహదారుల కాంట్రాక్టర్లు కొందరు సక్రమంగా పని చేయడం లేదని, పనితీరు మార్చుకోకపోతే నిబంధనల ప్రకారం చర్యలకు వెనుకాడవద్దని హెచ్చరించారు. అమరావతి ఔటర్ రింగ్‌రోడ్, వైజాగ్నుండి మూలాపేట, విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడ -హైదరాబాద్, హైదరాబాద్ -బెంగుళూరు హైవేల విస్తరణ, హైదరాబాద్ నుండి అమరావతి వరకు కొత్త గ్రీన్ ఫీల్డ్ కారిడార్‌కు సంబంధించి ప్రణాళికలు నేషనల్ హైవే అథారిటీ ద్వారా చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.