అనంతపురం: రాష్ట్రంలో వైసీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు, సానుభూతిపరులపై దాడులే లక్ష్యంగా వైసీపీ రౌడీ మూక దాడులు చేస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో వైసీపీ రౌడీలు రెచ్చిపోయారు. బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర గ్రామంలో టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ నేత తిప్పేస్వామి దాడి చేశాడు. గాయపడిన టీడీపీ సానుభూతిపరులు ఐ-టీడీపీ మండల కో ఆర్డినేటర్ మల్లేష్, ఆయన తల్లి, అవ్వను కుటుంబసభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ స్థలంలో వైసీపీ నేత తిప్పేస్వామి దౌర్జన్యంగా రాళ్లు వేస్తున్నారని, ఆ దృశ్యాలను మల్లేష్ చిత్రీకరిస్తుండగా సెల్ఫోన్ లాక్కొని విచక్షణా రహితంగా దాడి చేశాడని బాధితులు తెలిపారు. అడ్డు వెళ్లిన మల్లేష్ తల్లి, అవ్వపై దాడి చేయడంతో వారికీ గాయాలు అయ్యాయి. బాధితులను ఐ-టీడీపీ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతనేని మధు, కళ్యాణదుర్గం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదిమూలం మంజు, మండల కన్వీనర్ శ్రీరాములు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన దొడగట్ట నారాయణ, జిల్లా కార్యదర్శి తలారి సత్యప్ప పరామర్శించారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.