- ఏపీపీఎస్సీ, డీఎస్సీ ఒకటే అనుకుంటున్నారు
- రెండింటికీ తేడా తెలియని స్థితిలో ఉన్నారు
- మంత్రి నారా లోకేష్ కౌంటర్
అమరావతి(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే పరీక్షల వ్యవస్థపై వైసీపీ అధినేత జగన్‌కు అవగాహన లేదని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జగన్ చేసిన వ్యాఖ్యలకు గురువారం కౌంటర్ ఇచ్చారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండూ ఒకటే అనుకుం టున్నారా? అంటూ మండిపడ్డారు. ఏపీపీఎస్సీ అంటే ఏమిటో, డీఎస్సీ అంటే ఏమిటో కూడా జగన్‌కు తెలియదంటూ వ్యంగ్యా స్త్రాలు సంధించారు. ఈ రెండు పరీక్షలను ఒకే గాటిన కట్టడం, ఒకటే అనుకోవడం జగన్ అవగాహన స్థాయిని తెలియజేస్తుందం టూ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పరీక్షలు నిర్వ హిస్తుందో..వాటి విధి విధానాలేమిటో కూడా అవగాహన లేని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని విమర్శించారు. అధికా రంలో ఉన్నప్పుడు డీఎస్సీ నిర్వహించలేకపోయారు.. ప్రస్తుతం అసెంబ్లీలో చర్చకు రాకుండా పారిపోతున్నారంటూ చురకలంటిం చారు. పరీక్షల వ్యవస్థపై అవగాహన లేని వ్యక్తి ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నా రంటూ ధ్వజమెత్తారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య తేడా తెలియని జగన్‌కు పరీక్షలపై మాట్లాడే అర్హత ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా జగన్‌కు కౌంటర్ ఇచ్చారు.












