అమరావతి: కుప్పంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించడాన్ని తట్టుకోలేక జగన్ రెడ్డి తన రాక్షస గుంపుతో టీడీపీ నేతలపై దాడి చేయించడాన్ని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా ఖండిరచారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందనడానికి కుప్పం ఘటనే నిదర్శనమని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతపైనే దాడికి యత్నించడం జగన్ రెడ్డి విధ్వంస విధానాలకు నిదర్శనమన్నారు. వైసీపీ అధిష్ఠానం డైరెక్షన్ లోనే కుట్రపూరితంగా చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పేదవారికి అన్నం పెట్టేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేయడమే టీడీపీ చేసిన తప్పా అని ప్రశ్నించారు. పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఫ్లెక్సీలను చించివేసిన వైసీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అండిగారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం, గూండా రాజ్యం నడుస్తోందన్నారు. జగన్ రెడ్డి నియంతృత్వ విధానాలు ఎంతోకాలం చెల్లవని, కుప్పంలో కుప్పిగంతులు, మీ ఆటలు సాగబోవని హెచ్చరించారు. ఘటనకు బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.