- పండుగల వేళల్లోనూ ఫైన్ రకం బియ్యం
- పీఎం సూర్యఘర్ కనెక్షన్లు మరింత వేగవంతం
- ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి(చైతన్యరథం); ఎల్నినో ప్రభావంతో దేశ వ్యాప్తంగా ధరల పెరుగుదల కన్పిస్తోందని… ఆ ప్రభావం నిత్యవసరాలపై పడకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారుల ను ఆదేశించారు. ఆర్టీజీఎస్ సమీక్షలో భాగంగా వివిధ శాఖల పనితీరుపై బుధవారం సమీక్ష నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బియ్యం, కందిపప్పు, ఉల్లి, వంటనూనె, పంచదార వంటి నిత్యవసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుబజార్లలో ప్రభుత్వం తరపున అందిస్తున్న బియ్యం
అమ్మకాలపై ఆరా తీశారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని… కొనుగోళ్లు బాగా జరుగుతున్నా యని అధికారులు వివరించారు. అలాగే దీపావళి, సంక్రాంతి వంటి పండుగల సమయంలో కూడా రైతుబజార్లలో తక్కువ ధరకు ఫైన్ రకం బియ్యాన్ని అందుబాటులో ఉంచే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. అలాగే ఉల్లిపాయల సరఫరాను మరింత పెంచి సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పీఎం సూర్యఘర్ కింద ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో మరింత పురోగతి సాధించాలని, ప్రస్తుతం జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో ఉన్నామని… దీన్ని మరింత మెరుగుపరుచుకోవాలన్నారు. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా తొమ్మిది లక్షల కనెక్షన్లను ఏర్పాటుచేయాలని… వీటిని వీలైనంత త్వరగా ఏర్పాటుచేసేలా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసు కోవాలని పాలనలో టెక్నాలజీని పూర్తిగా ఉపయోగిం చుకునిఎక్కడైనా లోటుపాట్లు ఉంటే తక్షణమే సరిదిద్దుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో మరింత మెరుగ్గా పనిచేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయిప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













