- సుప్రీంకోర్టులో కూడా వారికి భంగపాటు తప్పలేదు
- విధ్వంసాలకు దిగి ఎన్నికలు అడ్డుకోవడమే వారి లక్ష్యం
- పొరుగు రాష్ట్రాల రౌడీలను తెప్పించి అల్లర్లు సృష్టించారు
- రాజకీయాల్లో జగన్‌లాంటి క్రిమినల్ లిటిగెంట్స్ ప్రమాదం
- వారి అరాచకాలను పార్టీ శ్రేణులు బలంగా తిప్పికొట్టాలి
- సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి
- చెప్పాం.. చేస్తున్నాం నినాదంతో ప్రజాక్షేత్రంలోకి వెళదాం
- రెబల్స్ పోటీ నుంచి తప్పుకోవాలి.. లేకుంటే సస్పెన్షన్ వేటు
- స్థానిక ఎన్నికలపై టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): విధ్వంసాలు సృష్టించి కోర్టులకు వెళ్లి స్థానిక ఎన్నికలను అడ్డుకోవడమే గొడ్డలి పార్టీ ఆలోచన అని సీఎం చంద్రబాబు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బుధవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీలో ఉన్న అభ్యర్థులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్ నిర్వహించారు. ప్రజ ల్లోకి వెళ్లి చేపట్టాల్సిన ప్రచారం, కూటమి పార్టీలతో సమన్వయం, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరు స్తున్నాం. చెప్పాం… చేస్తున్నాం. ఇదీ స్థానిక ఎన్నికల్లో కూటమి నినాదం. స్థానిక ఎన్ని కల ద్వారా కూటమి పార్టీలు ప్రజల ఆశీర్వాదాన్ని మరోసారి పొందాలి. మనం ఇప్పటివరకు చేసిన సంక్షేమం-అభి వృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివ రించాలని సూచించారు. కూటమి పార్టీలతో సమన్వ యం చేసుకోవాలి. టిక్కెట్లు దక్కించుకోలేని ఆశావహు లకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తామని తెలిపారు. రెబల్స్ నామినేషన్లను విత్ డ్రా చేయకుంటే పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు. జనసేన, బీజేపీ అధికా రిక అభ్యర్థులున్న చోట కూడా రెబెల్స్ ఉండకుండా చూసుకోవాలి. మిత్రధర్మాన్ని పాటించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు సాఫీగా జరిగేలా చూడండి. మంచి అభ్యర్థులను… ప్రజలకు సేవ చేసే వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలని కోరారు.
ఎన్నికలు అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు
ప్రజాక్షేత్రంలోనూ… న్యాయస్థానాల్లోనూ గొడ్డలి పార్టీకి భంగ పాటు తప్పదు. ప్రజాస్వామ్యంపై గొడ్డలి పార్టీకి ఎలాంటి నమ్మకం లేదు. ఆ పార్టీది గొడ్డలిస్వామ్యమని చరిత్ర చెబుతోంది. 2019 ఎన్నికల్లో సింపతీ కోసం సొంత బాబాయ్ వైఎస్ వివేకాను బలి తీసుకున్నారు. సింపతీతో గెలుపొందారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ చేసిన అరాచకాలు ప్రజలందరికి తెలుసు. నాడు ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిందో అందరూ చూశారు. గొడ్డలి పార్టీ చేసిన పాపాలకు ప్రజలు కఠిన
శిక్ష విధించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 11 సీట్లతో సరిపెట్టారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి అభివృద్ధిని,
సంక్షేమాన్ని అడుకునేందుకు తొలిరోజు నుంచి పని చేస్తూనే ఉంది. మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల రిక్రూట్మెంట్ చేయాల నుకుంటే…
దాన్ని అడ్డుకుంటూ 300 కేసులు వేశారు. అయినా దాన్ని ఛేదించి అద్భుతంగా డీఎస్సీని నిర్వహించాం. నిరుద్యో గులకు ఉద్యోగాలిచ్చాం. స్థానిక ఎన్నికల ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి అభ్యర్థులే దొరకలేదు. అసలే
ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి దారుణ పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీ స్థానిక ఎన్నికల్లో ఓడిపోతే ఉనికే ఉండదు. ఆ భయంతో స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు 60 కేసులు వేసింది. బీసీ రిజర్వేషన్లు, ఎస్ఐర్ అంటూ కేసులేశారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నా… మనం వీలైనంత మేర న్యాయం చేయగలిగాం.. కానీ ఎన్నికలను ఆపలేకపోయారు. దీంతో ఎన్నిక లను ఆపలేకపోయారు. దీంతో ఎన్నిక లను అడ్డుకోవడానికి విధ్వంసాలకు దిగి రాష్ట్రవ్యాప్తంగా జరిగా యని ఫేక్ ప్రచారం చేసింది.
వైసీపీ ఫిర్యాదు చేసిన 19 మున్సి పాలిటీల్లో 8 ఉమ్మడి కడప జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలే ఉన్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో స్థానిక ఎన్నికలను అడ్డుకునేలా వైసీపీ కుట్రలు పన్నుతుందని ముందుగానే ఊహించాం. ఉమ్మడి కడప జిల్లా పరిధిలోని రాజంపేట, ఎర్రగుంట్ల, కడప, రాయచోటి, కమలాపురం, పులివెందుల, అలాగే ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాలతో పుంగనూరు పుడింగి ప్రాతనిధ్యమున్న చోట్ల అలజ డులు సృష్టించింది. ఇదే అంశాన్ని బూచిగా చూపి స్థానిక ఎన్నిక లను అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే సుప్రీంకోర్టు కూడా వారి అభ్యర్ధనను తిరస్కరించింది. వారి అభ్యర్ధనను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసింది. నామినేష న్ల విషయంలో నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికే వది లేసింది. ఇలా ఉంటుంది గొడ్డలి పార్టీ తీరు అని ఎద్దేవా చేశారు.
రాజకీయంగా చచ్చె వరకూ పెద్ద కర్రతోనే కొట్టాలి
ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడానికి… అభివృద్ధిని ఆపడానికి చేయాల్సిన పనులు చేస్తున్నారు.. కేసులతో బ్రేకులేస్తున్నారు. అమ రావతి, పోలవరం సహా వివిధ అంశాల్లో గొడ్డలి పార్టీ వైఖరి ఇప్పటికే తేటతెల్లంగా కన్పించింది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందు కు కోర్టు కేసులతో బ్రేకులేసే మనస్తత్వమని జగన్ ఇప్పటికే చాటు కున్నాడు. తన సొంత వ్యవహరాల్లో కూడా జగన్ ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. ఇలాగే ప్రవర్తిస్తున్నాడు. అక్రమాస్తుల కేసులో విచారణ ముందుకు సాగకుండా కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేసి అడ్డుకున్నాడు. వివేకా హత్య కేసు సాగకుండా చెల్లి మీద ఆరోప ణలు చేయడమే కాకుండా సీబీఐ అధికారుల మీద కోర్టులకు వెళ్లారు. చివరికి తన సొంత చెల్లి షర్మిళతో ఆస్తి తగాదాలు వస్తే… దానిమీద కూడా ఎన్సీఎల్టీకి వెళ్లి ఆమెను రోడ్డున పడేశాడు. ఇప్పుడు మేనకోడలు పెళ్లి చేసుకోవడానికీ వీల్లేని విధంగా వ్యవ హరించి అత్యంత క్రూరంగా వ్యవహరించారు. ఇలాంటి దుర్మార్గు డు ఐదేళ్లు సీఎంగా పని చేశాడంటేనే జుగుప్స కలుగుతుంది. అందుకే ఆ పాము రాజకీయంగా చచ్చేంత వరకూ పెద్ద కర్రతోనే కొట్టాలి. అందుకే స్థానిక ఎన్నికల్లో గొడ్డలి పార్టీ అరాచకాలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు బలంగా తిప్పి కొట్టాయి. రాజంపేట, ఎర్రగుంట్ల, కడప, రాయచోటి, కమలా పురం, పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరుల్లో చెక్ చెప్పాం. దశాబ్దాలుగా పులి వెందుల సహా వివిధ ప్రాంతాల్లో జగన్ సహా ఆ పార్టీ నేతల అరాచకాలను ప్రతిఘటిస్తున్నామని తెలిపారు.
పులివెందుల పునాదులు కదులుతున్నాయి
పునాదులు కదులుతుండడంతో జగన్ బెంగళూరు నుంచి పులివెందులకు పరుగులు పెట్టాడు. ఉమ్మడి కడప స్థానిక ఎన్నికల్లో పోటీకి నిరాకరిస్తున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలతో మంతనాలు జరపుతున్నాడు. ఉనికిని కాపాడుకోవడానికి… పట్టు ఉందని చెప్పుకోవ డానికి.. జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. దాంట్లో భాగంగానే పొరుగు రాష్ట్రాల రౌడీలతో ఈ విధ్వంసాలు… కేసులు… గొడవలు.. అల్లర్లు చేయిస్తు న్నాడు. జగన్‌కు.. గొడ్డలి పార్టీకి ప్రజలు బెదిరే రోజు లు పోయాయి… 30 ఏళ్ల తర్వాత పులివెందులలో ప్రజలకు స్వేచ్ఛ లభించింది. పులివెందులలో ప్రజా స్వామ్య పునరుద్ధరణ ఎప్పుడైతే జరిగిందో… జగన్ అరాచక సామ్రాజ్య పునాదులు కదిలాయి. ఇది ప్రజ లకు అర్థమైంది… గొడ్డలి పార్టీ నేతలకూ అర్థమైంది… స్థానిక ఎన్నికల ఫలితంతో అది మళ్లీ నిరూపితం కాబోతోందని స్పష్టం చేశారు.













