అమరావతి : వైసిపి ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దుయ్యబట్టారు. తెలుగుదేశం అమలు చేసిన పథకాలపేర్లు మార్చి సగం కూడా ఇవ్వ ట్లేదు. వైసిపి నేతలే బియ్యం అక్రమ రవాణా చేస్తూ సంక్షేమానికి గండి కొడుతున్నారని అన్నారు. టిడిపి శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పేదల పథకాలను నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శమని అన్నారు.