హక్కుల్ని కాలరాసే అధికారం ఎవరికీ లేదు
జీవచ్ఛవాల్లా ఎంతకాలం బతకాలి?
పేదరిక నిర్మూలనకు ముందుకు రావాలి
క్రైస్తవ విద్యాసంస్థల కబ్జాకు జగన్ ప్రయత్నం
……
విభజనవల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంకంటే, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం వల్లే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇలాంటి అవినీతిపరుడు, నేరచరిత్ర ఉన్నవాడు, అసమర్థుడైన ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదన్నారు. గుడివాడ లో శుక్రవారం జరిగిన పాస్టర్ల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. పాస్టర్లు ఎలాగైతే స్వచ్ఛందంగా సేవాభావంతో పనిచేస్తున్నారో, అదేభావనతో విశాఖపట్నంలో మూర్తి గీతం విద్యాసంస్థల్నిస్థాపించారు. దేశంమెచ్చిన గీతం విద్యాసంస్థలపై జగన్ విద్వేషంతో దాడులు చేస్తున్నాడు. రాత్రికి రాత్రి జేసీబీలు పంపి, భవనాల్ని నేలమట్టం చేయిస్తున్నాడు. ఇదేనా చేయాల్సింది? అని ప్రశ్నించారు. తులసివనంలాంటి గుడివాడలో గంజాయి మొక్క పుట్టింది. మేథావులు పుట్టిన నేలపై ఇలాంటి మేకవన్నె పులులు తిరుగుతున్నాయి. ప్రశ్నిస్తే ఏదైనా చేస్తారన్నభయం మీకుంటే ఏమీచేయలేరు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కుతో పాటు, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాదనే అధికారం ఎవరికీలేదు. హక్కుల్ని కాలరాస్తున్నవారిని వదిలేసి, జీవచ్ఛవాల్లా మనం బతకడం ఎలాంటిదో అంబేద్కర్ జయంతి నాడు మీరందరూ ఆలోచన చేయాలి అని చంద్రబాబు కోరారు.
ఆర్థికఅసమానతలు తగ్గించేందుకు, సంపదసృష్టించి పేదల్ని ఆదుకునేందుకు మనం అందరం కలిసిపనిచేద్దాం. ప్రపంచంలో భారతీయులే అగ్రస్థానాల్లో ఉన్నారు. వారిలో తెలుగువారు ఇంకాముందుంటున్నారు. అలా సంపాదించి, పేరుప్రఖ్యాతులు గడించిన వారంతా పేదరిక నిర్మూలనకు ముందుకురావాలి. దానికోసం పాస్టర్లు చర్చిలను కేంద్రాలుగా చేసుకొని పనిచేయాలని అని చంద్రబాబు పిలుపునిచ్చారు. క్రైస్తవ మిషనరీలు సేవకు మారుపేరు. మీరంతా సేవ చేస్తూ, పేదలకు అండగా ఉంటూ పేదలసమస్యలు పరిష్కారానికి కృషి చేస్తుంటే, బాధ్యతగల ముఖ్యమంత్రి మాత్రం తానుచేయాల్సింది విస్మరించి, రాష్ట్రాన్ని తన దోపిడీకి కేంద్రంగా మార్చుకున్నాడు అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా జగన్ నిలిచాడు. దేశంలోని అంద రి ముఖ్యమంత్రులవద్ద ఉన్న సంపదకంటే, జగన్ సంపదే ఎక్కువ. ఈయన ఆదాయం రూ.510కోట్లు అయితే, దేశంలోని మిగతా ముఖ్యమంత్రులందరి ఆదాయం మాత్రం రూ.465కోట్లు. తాను రోజు రోజుకీ ధనికుడు అవుతుంటే, ఓట్లేసిన ప్రజలు మాత్రం కడు దుర్భరస్థితిలో పేదరికంలో మగ్గిపోతున్నారు. జగన్ కు అంతడబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. దోచుకుంటేనే వచ్చింది అని ఆరోపించారు.
ఇంతటి అవినీతిపరుడు, నేరచరితుడు, అసమర్థుడైన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశామా? ప్రజలకు సేవచేసే క్రైస్తవుల్ని, వారి సంస్థల్ని ఆస్తుల్ని కూడా ఈ ప్రభుత్వం వదలడంలేదు. జగన్ కు భయపడి చాలా మంది క్రైస్తవులు వారిఆస్తులు, సంస్థల్ని అతనికి సరెండర్ చేశారు. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన, పవిత్రమైన క్రిస్టియన్ భవన్ ని జగన్ క్వారంటైన్ కేంద్రంగా మార్చాడు. అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుడిగా నేనుచెప్పడంకాదు. మీ బాధలు, సమస్యలు, మనోభావాలు ఏంటో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. తెలుగుదేశంపార్టీ వివివర్గాలతో చర్చిస్తూ, మీరిచ్చే సూచనలు, సలహాలు తెలుసుకుంటోంది. భవిష్యత్ లో కచ్చితంగా వాటిని పరిగణనలోకి తీసుకుంటుంది అని హామీ ఇచ్చారు. క్రైస్తవసోదరులకు ఇంతకు ముందు ఏంచేశామో, భవిష్యత్ లో ఇంకా మెరుగ్గా వారికి ఏంచేస్తామో మాట్లాడుకోవడానికే మనం ఇక్కడ సమావేశమయ్యాం. చర్చిల మరమ్మతులకు టీడీపీప్రభుత్వం మాత్రమే డబ్బులిచ్చింది. గుంటూరులో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి టీడీపీప్రభుత్వం రూ.16కోట్లనిధులిచ్చి, 2 ఎకరాల భూమిఇచ్చింది. 80 శాతం వరకు పనులుకూడా పూర్తిచేసింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక దాని పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఆఖరికి పవిత్రమైన క్రిస్టియన్ భవన్ ని జగన్ క్వారంటైన్ కేంద్రంగా మార్చారు. బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటు, నిర్మాణానికి కూడా టీడీపీప్రభుత్వం నిధులిచ్చింది. క్రైస్తవ ఆడబిడ్డలకు పెళ్లికానుక కింద రూ.50వేల ఆర్థికసహాయం అందించాము. జెరూసలేం వెళ్లడానికి రూ.75వేల ఆర్థికసహాయం చేసింది టీడీపీ ప్రభుత్వమే. క్రిస్మస్ కానుక ఇచ్చి పేదక్రైస్తవులు సంతోషంగా క్రిస్మస్ పండుగ చేసుకునేలా చేశాం. క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి, దాని ద్వారా పేద క్రైస్తవులను ఆదుకున్నాం. టీడీపీ ప్రభుత్వం క్రైస్తవులకోసం అమలుచేసినవి ఏవీ ఈ ప్రభుత్వంలో లేవు అని చంద్రబాబు వివరించారు.
నేను ముఖ్యమంత్రి అయ్యాకే ఉమ్మడిరాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించేలా చేశాను అని చంద్రబాబు చెప్పారు.క్రైస్తవులు సేవాభావంతో పనిచేస్తూ, ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్నారు. అలాంటివారికి ఎయిడ్ అవకాశం కల్పించాము. జగన్ వచ్చాక ఎయిడ్ ఆపేసి, క్రైస్తవ విద్యాసంస్థల్ని కబ్జాచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలామంది ఇప్పటికే భయంతో క్రైస్తవ మిషనరీలు, విద్యాసంస్థల్ని సరెండర్ చేశారన్నారు. క్రైస్తవ సేవాసంస్థలు, విద్యాసంస్థలు, మతకేంద్రాలు అన్నీపలునగరాలు, పట్టణాల్లో ప్రధానకూడళ్లలో ఉండటంతో ఈప్రభుత్వం వాటిపై కన్నేసింది. వాటితాలూకా భూములు, ఆస్తుల్ని కబ్జాచేస్తోంది. టీడీపీప్రభుత్వం రాగానే వాటిని తిరిగి, ఆయాసంస్థలకు అప్పగిస్తుంది. టీడీపీ ప్రభుత్వంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలపై దాడులు జరిగితే తీవ్రంగా పరిగణించాం.అన్ని మతాలను సమానంగా గౌరవించాం. తాడేపల్లిలో ఒక చర్చిమీద దాడి జరిగితే నేనే స్వయంగా హెలికాఫ్టర్లో అక్కడికి వెళ్లి పరిశీలించి, నిందితుల్ని కఠినంగా శిక్షించేలా చేశాను అని చెప్పారు.
టిడిపి అండగా వుంటుంది
క్రైస్తవ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల్ని నాదృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వాటిని పరిష్కరిస్తుంది. క్రైస్తవుల్లో చాలామందిపేదలు ఉన్నారు. అలాంటి పేదలకు అండగా ఉండటమే టీడీపీ లక్ష్యం. ప్రజలకు దగ్గరగా ఉంటూ, వారిలో కలిసి పోయేది పాస్టర్లే. వారుకూడా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వంతో కలిసిరావాలి. సేవల విషయంలో ముందుండే క్రైస్తవమతపెద్దలు, పేదరికనిర్మూలనలో కూడా ముందుంటే, వారికి టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది అని చంద్రబాబు హామీ ఇచ్చారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, నాడు నేనుచూపిన విజనరీ వల్లే హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం విడిపోయాక అమరావతి, పోలవరం నిర్మాణాలతోపాటు, రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధిని పరుగులు పెట్టించాము. సంక్షేమపథకాల్ని దేశంలో ఏరాష్ట్రం అమలు చేయని విధంగాచేశాం. కానీ దురదృష్టవశాత్తూ ఒక్కఛాన్స్ అనే దాన్ని నమ్మి ప్రజలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా జగన్ నిలిచాడు. దేశంలోని అందరి ముఖ్య మంత్రుల వద్ద ఉన్న సంపద కంటే, జగన్ సంపదే ఎక్కువ. ఈయన ఆదా యం రూ.510 కోట్లు అయితే, దేశంలోని మిగతా ముఖ్యమంత్రులందరి ఆదాయం మాత్రం రూ.465కోట్లు. తాను రోజురోజుకీ ధనికుడు అవుతుంటే, ఓట్లేసిన ప్రజలు మాత్రం కడుదుర్భరస్థితిలో పేదరికంలో మగ్గిపోతున్నారు. జగన్ కు అంతడబ్బు ఎక్కడినుంచి వచ్చింది. దోచుకుంటేనే వచ్చిందన్నారు.