జగన్ అసమర్ధత వల్లే అదనపు ఖర్చు
ఇంకో 6 నెలల్లో జగన్ ఇంటికి పోతాడు
పుట్టిన రోజు ప్రజలమధ్య వుండాలనుకున్న
ప్రజలు అండగా వుంటే కొండను అయినా బద్ధలు చేస్తా
గిద్దలూరు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు
టిడిపి అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యత కింద వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వెలిగొండ పూర్తి అయితే సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి గిద్దలూరులో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అంతకు ముందు బద్వేలు నుంచి గిద్దలూరు చేరుకున్న చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. గిద్దలూరు లో జరిగిన రోడ్ షో లో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. రోడ్ షో అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ 2014లో మళ్లీ సిఎం అయిన తరువాత ప్రాజెక్టుపై కేసులు పరిష్కరించి పనులు పరుగులు పూర్తి చేశాను.
2019 నాటికి 95 శాతం పనులు పూర్తి చేశాను. 5 శాతం పనులు పూర్తి చేయలేని ప్రభుత్వం మూడు రాజధానులు కడతాడా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును జగన్ గోదావరిలో కలిపేశాడు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే 2020 కే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేది నదుల అనుసంధానం జరిగి ఉంటే రాయలసీమకు లబ్ది జరిగేది. గోదావరి నీళ్లు పెన్నా నదికి తీసుకువెళ్లే అవకాశం ఉండేది. నదుల అనుసంధానంతో పశ్చిమ ప్రకాశం సస్యశాసమలం అయ్యేది పోలవరంపై ప్రాజెక్టుపై రివర్స్ టెండర్ అని రివర్స్ చేసి గోదాట్లో కలిపారు.
ఇప్పుడు అదనపు ఖర్చు అంటూ రూ.2 వేల కోట్లు అవుతుంది. జగన్ అసమర్థత వల్లనే ఈ అదనపు ఖర్చు పడింది అని చెప్పారు. పెట్టుబడులు వస్తేనే పిల్లలకు ఉద్యోగాలు, పెట్టుబడులు రాకుండా బిడ్డలకు ఉద్యోగాలు ఎక్కడ నుంచి వస్తాయి. జాబు కావాలి అంటే….బాబు రావాలి అని ప్రజలే అంటున్నారు . చదువుకున్న తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఈ ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఒక్కడికి అయినా ఉద్యోగం ఇచ్చాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ఇచ్చింది ఒక్కటే ఉద్యోగం, అదే వాలంటీర్ ఉద్యోగం. నేను ఐటీ, టీచర్ ఉద్యోగాలు ఇచ్చాను. ఇప్పుడు మటన్ కొట్లో, ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు జగన్ భవిష్యత్ అని చెపుతున్నాడు… జగన్ మీ బిడ్డ కాదు. జగన్ సమాజాన్ని పట్టి పీడుతున్న క్యాన్సర్. జగనే మీ నమ్మకం కాదు. జగనే రాష్ట్రానికి దరిద్రం. జగన్ ఒక ఐరన్ లెగ్. ఒక సైతాన్ గా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాడు అని ధ్వజమెత్తారు. నాలుగేళ్లు దాటింది. ఇంకో 6 నెలల్లో జగన్ ఇంటికిపోతాడు. ఏం చేశాడో చెప్పగలడా? నేను నాడు హైటెక్ సిటీ కట్టాను. సైబరాబాద్ నిర్మాణం చేశాను. జీనోమ్ వ్యాలీని ప్రారంభించింది తెలుగు దేశం పార్టీ. హంద్రీ నీవా , గాలేరునగరి ప్రారంభించింది, పనులు చేసింది టీడీపీ. హైదరాబాద్ కు ధీటుగా అమరావతిని రూపకల్పన చేశాను అని వివరించారు.
విశాఖ వాసులు భయపడుతున్నారు
జగన్ ఇంటికి పోయే సమయం వచ్చింది. ఇడుపుల పాయకు వెళ్లాల్సిన జగన్ ఇప్పుడు విశాఖ పోతాను అంటున్నాడు. రాజధాని సుప్రీం కేసులో ఉంటే సెప్టెంబర్ లో విశాఖ పోతాను అని జగన్ చెపుతున్నాడు. జగన్ వస్తాడు అంటే విశాఖ ప్రజలు భయపడుతున్నారు అని చంద్రబాబు చెప్పారు. పులివెందులకు బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తి స్టీల్ ప్లాంట్ కడతాడా? రామాయపట్నం పోర్టుకు నాడు ఫౌండేషన్ వేస్తే…దాన్ని పూర్తి చెయ్యలేదు. భావనపాడు పోర్ట్ ను టీడీపీ తలపెడితే ఇప్పుడు జగన్ దానికి ఫౌండేషన్ వేశాడు. బందరు పోర్టుకు మేం పనులు ప్రారంభిస్తే జగన్ ఇంటికి పోయే సమయంలో మళ్లీ శంకుస్థాపన అంటున్నాడు. కియా మోటార్స్ ను తీసుకువచ్చి 13 వేల కోట్లు పెట్టుబడులు తెచ్చి 15 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాను అని చంద్రబాబు వివరించారు. ఉద్యోగం అడిగితే గంజాయి ఇస్తాను అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. మద్యం ధరలు పెరిగాయని….చాలా మంది గంజాయికి అలవాటు పడుతున్నారు. యువకులు గంజాయికి అలవాటు పడడం అనేది చాలా ప్రమాద కరం.
సిఎం గంజాయిపై ఒక్క రోజు సమీక్ష చేశాడా? చివరికి తిరుమల దేవస్థానంలో కూడా గంజాయి దొరుకుతుంది అంటే ఏమి చెప్పాలి ? వెంకటేశ్వర స్వామిని అప విత్రం చేసిన ఏ వ్యక్తిని ఆ స్వామి వదలిపెట్టడు అని హెచ్చరించారు. జగన్ కొత్త నాటకంతో మీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన పేదల ప్రతినిధి అని చెపుతున్నాడు. ఎడిఆర్ అనే సంస్థ నివేదిక ప్రకారం జగన్ ఆదాయం రూ.510 కోట్లు. 29 మంది ముఖ్యమంత్రుల కంటే జగన్ ఆస్తి ఎక్కువ. జగన్ పేదల కోసం పనిచేసే వ్యక్తి కాదు. పేదల రక్త తాగే వ్యక్తి అని దుయ్యబట్టారు. సంక్షేమానికి చిరునామా తెలుగు దేశం పార్టీ…రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చింది, అన్న క్యాంటీన్, చంద్రన్న భీమా ఇచ్చింది టీడీపీ. ఇదే నియోజకవర్గానికి చెందిన రమేష్ అనే సర్పంచ్ చెప్పుతో కొట్టుకున్నాడు. జగన్ కు ఓటేసినందుకు బాధపడుతున్నా అన్నాడు. నాడు వైసిపినీ నమ్మి మోసపోయాను అని ఒక ముస్లిం సోదరుడు వచ్చి నేడు కలిశాడు. టీడీపీకి రూ.50 వేల ఫండింగ్ కూడా ఇచ్చాడు. టీడీపీతోనే రాష్ట్రం అభివృద్ది అని చెపుతున్నాడు అని చెప్పారు. జగన్ ఒక స్టిక్కర్ సిఎం. మీ ఇంటికి ఆయన స్టిక్కర్ ఏంటి. జగన్ ఇంటికి వెళ్లి మనం స్టిక్కర్ వేస్తే వేయనిస్తారా? మన ఇంటికి రావడానికి వైసీపీకి ఏం అర్హత ఉంది. అనుమతి లేకుండా స్టిక్కర్లు వేస్తే కాళ్లు విరగొట్టినా కేసుల లేదు. జగన్ పని అయిపోయింది. వైసీపీ గెలవదు అని చంద్రబాబు చెప్పారు.
మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు
అమరావతి అనంతపూర్ ఎక్స్ ప్రెస్ వే గిద్దలూరు మీదుగా వెళ్లేది. దాన్ని కూడా నిలిపివేశాడు. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ. మార్కాపురం కేంద్రంగా జిల్లా కేంద్రం కావాలని.టీడీపీ అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గిద్దలూరు అభివృద్ది రూ. 1370 కోట్లు నాడు మంజూరు చేశాను. ప్రతి ఇంటికి నీరు ఇచ్చేందుకు నిధులు ఇచ్చాను. మీ గ్రామాల్లో వైసీపీ వచ్చిన తరువాత ఒక్క పని అయ్యిందా? గిద్దలూరు లో తాగునీటికి 90 కోట్లు, నియోజకవర్గానికి సుంకేసుల నుంచి తాగునీరు ఇచ్చేందుకు మంజూరు చేసిన 350 కోట్లు రద్దు చేశారు. రాచర్ల రైల్లే బ్రిడ్జ్ కోసం ఇక్కడ డిమాండ్ ఉంది. ఆసమస్యను కూడా పూర్తి చేస్తాం. సగిలేరు ముంపు నివారణకు మంజూరు చేసిన నిధులను కూడా రద్దు చేశారు.
అశోక్ రెడ్డి ఎప్పుడు వచ్చినా గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ది గురించి నిధులు అడిగేవాడు అని వివరించారు. స్థానిక ఎమ్మెల్యే వేధింపుల వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు. అలాంటి అహంకారులు ఈ వైసీపీ నేతలు. ఈ ప్రాంతంలో రెడ్లకు ఏమైనా న్యాయం జరిగిందా? పనులు చేసిన రెడ్లకు బిల్లులు ఇచ్చాడా? వారికి ప్రత్యేకంగా ఏమైనా చేశాడా? షెడ్యూల్ కులాలను ఊచకోత కోసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని తీవ్రంగా విమర్శించారు. పుట్టిన రోజున ప్రజల మధ్యన ఉండాలి అని ఈ వెనుకబడిన ప్రాంతంలో నేను పర్యటన పెట్టుకున్నా. తెలుగు దేశం జెండా. పేదవారికి అండ. రాష్ట్రానికి రక్షణ. ప్రజలంతా తిరుగుబాటు చేసి జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఈ రోజు గిద్దలూరు గర్జించింది. మీరు అండగా ఉంటే కొండను అయినా బద్దలు చేస్తాను అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ ఆరిపోయే దీపం
వైసీపీ ఆరిపోయే దీపం. ఎక్సైపైరీ డేట్ దగ్గర పడింది. నాలుగేళ్లలో ఒక్క పని చేశారా? మీ జీవితాల్లో వెసులుబాటు, వెలుగు వచ్చిందా?ఈ వైసీపీ పాలన వల్ల కష్టాలు బాధలు తప్ప ప్రజలకు ఏమి మిగిలింది? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం వల్ల బాదుడే బాదుడు…వీర బాదుడు. నిత్యావసర వస్తువులు సహా అన్ని ధరలు పెరిగాయి. అన్ని ధరలు పెరిగాయి…పెరగనిది ప్రజల ఆదాయం ఒక్కటే. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, కరెంట్ చార్జీలు పెంచాడు. ఇవన్నీ చాలవు అన్నట్లు ఆర్టీసీ రేట్లు, ఇంటి పన్నులు పెంచాడు. చెత్త మీద కూడా పన్నేసిన చెత్త సిఎం ఈ వైఎస్ జగన్ అని విమర్శించారు. ఒకప్పుడు ఉచితంగా ఇచ్చే ఇసుక బంగారంగా మారింది. వైసీపీ నేతలకు వరంగామారింది. మద్యం ధరలు భారీగా పెరిగాయి. కొత్త కొత్త బ్రాండ్ల మద్యం తెచ్చారు. అన్నీ జె బ్రాండ్లే. జగనే తయారు చేస్తాడు.. జగనే అమ్ముతాడు.
తోపుడు బండ్ల వద్ద కూడా ఆన్లైన్ లో డబ్బులు పే చేస్తున్నారు. మరి మద్యం షాపుల్లో ఎందుకు ఆన్ లైన్ లో చెల్లింపులు తీసుకోవడం లేదు. మద్యం అమ్మకాల డబ్బు. తాడేపల్లి ఇంటికి పోతుంది. పేదల ఆరోగ్యం కూడా లెక్కబెట్టకుండా ఇష్టానుసారం చేస్తున్నారు. జగన్ బటన్ నొక్కుడు కాదు. అక్రమాలతో బొక్కుడు అని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక జగన్ రూ. 2 లక్షల కోట్లు అక్రమంగా ఆర్జించాడు. రాష్ట్ర ప్రజలపై రూ. 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయల భారంమోపాడు. ప్రతి వ్యక్తిపై రెండు లక్షల అప్పులు తెచ్చాడు. ఈ అప్పులు ఎవరు కట్టాలి…ప్రజలే కదా కట్టాల్సింది. విద్యా వసతి ఎత్తిపోయింది. డబ్బులు లేవంట. పోలీసులకు డిఎలు లేవు. వారి గురించి కూడా నేనే మాట్లాడాలి. కష్టపడి డ్యూటీ చేసే పోలీసులకు, ప్రజలకు సేవలు చేసే ఉద్యోగులకు ఎందుకు జీతాలు ఇవ్వడం లేదు.
ఒకప్పుడు జీతాలు పెంచమని చెప్పిన ఉద్యోగులు. ఇప్పుడు జీతాలు ఇస్తే చాలు అంటున్నారు అని చంద్రబాబు చెప్పారు. అవినీతిలో సిద్దహస్తుడు జగన్ మోహన్ రెడ్డి, తండ్రి అధికారం అడ్డంపెట్టుకుని రూ. 43 వేల కోట్లు అక్రమంగా ఆర్జించాడు అని సిబి ఐ తేల్చింది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని కాదు పోలీసులు జైల్లో పెట్టాల్సింది. బాబాయిని చంపిన వారిని, కోడికత్తి డ్రామా ఆడిన వారిని జైల్లో పెట్లాలి. వివేకా హత్యలో అవినాష్ ను కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్ అని ఆరోపించారు. నాడు గుండెపోటు అన్నారు…రక్తపు వాంతులు అన్నారు. ఎవరు కుట్లు వేశారు.నాడు సిబిఐ విచారణ కావాలి అన్నాడు. తరువాత వివేకా కేసులోనే మళ్లీ సిబిఐ విచారణ అవసరం లేదు అన్నాడు. వివేకా కేసు పోలీసులకు, హంతకులకు, న్యాయవాదులకు కూడా ఒక కేస్ స్టడీ అని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ ప్రకాశంలో కరువు నివారణకు నేనే శంకుస్థాపన చేశాను. తరువాత వచ్చిన ప్రభుత్వాలు నామమాత్రంగా పనిచేశాయి.2014లో మళ్లీ సిఎం అయిన తరువాత ప్రాజెక్టుపై కేసులు పరిష్కరించి పనులు పరుగులు పూర్తి చేశాను.2019 నాటికి 95 శాతం పనులు పూర్తి చేశాను. 5 శాతం పనులు పూర్తి చేయలేని ప్రభుత్వం మూడు రాజధానులు కడతాడా అని ప్రశ్నించారు.