మెగా డీఎస్సీ జాబ్ క్యాలెండర్ అంతా జగన్నాటకమే అని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ శుక్రవారం ఉదయం నందిగామ పట్టణం ఆర్డీవో కార్యాలయం ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి యువత భవిష్యత్తును నాశనం చేశారంటూ తెలుగు యువత, టిడిపి నేతలతో కలిసి నిరసన తెలియజేసి ఆర్డిఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? మటన్, ఫిష్ మార్ట్లతో ఉన్నత చదువులు చదువుకున్న యువత భవిత ప్రశ్నార్ధకం అయిపోయింది.
నాలుగేళ్లు పూర్తయిన మెగా డీఎస్సీ ఊసే లేదు. జాబ్ లెస్ క్యాలెండర్‌తో యువత భవిష్యత్తు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ మాయతో చేసిన తప్పును రాష్ట్ర యువత తెలుసుకుందన్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించాలని ఆమె కోరారు.