ఆంధ్రప్రదేశ్ లో.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంతో.. ప్రజల్లో.. చంద్రబాబు దూసుకుపోతుంటే.. యువగళం పాదయాత్రలో.. యువనేత నారాలోకేష్.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలతో మమేకమై సాగుతున్నారు. మరోవైపు టీడీపీ సీనియర్ నేతలు.. తమ కార్యక్రమాలతో.. ప్రజలకు చేరువతూ.. టీడీపీ అధికారంలోకి రాగానే.. చేయబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. జగన్ నాలుగేళ్ల పాలనలో.. అభివృద్ధి ఏం జరిగిందో తెలుసుకోవాలని.. ప్రజలను కోరుతున్నారు. 2019లో .. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత.. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి.. ఎలా ముంచేశారో వివరిస్తున్నారు. పెదకాకానిలో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో.. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఏపీలో ఎన్నికలెప్పుడు వచ్చినా.. టీడీపీ అఖండ విజయడం సాధించడం ఖాయమని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పాలనలో .. సమస్యలన్నీ ఎక్కడి వేసిన గొంగళి .. అక్కడే ఉన్న చందంగా తయరయ్యాయని .. అచ్చెన్న దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో.. సైకిల్ జైత్రయాత్ర మొదలైందన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు రావడం ఖాయమని అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్నికలు సకాలంలో వచ్చినా.. ముందొస్తు వచ్చినా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి.. జగన్ కు బుద్ధి చెప్పాలన్నారు. ఎన్టీఆర్ అంటే వ్యక్తి కాదు.. ఒక శక్తి అని .. తెలుగు ప్రజల హృదయాల్లో.. ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. అందుకే.. దేశ విదేశాల్లో కూడా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు అన్నారు. తండ్రి వైఎస్ఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని వచ్చిన వ్యక్తి, 16 మాసాలు జైల్లో ఉన్న వ్యక్తికి ఓటు వేసి ప్రజలు తప్పు చేశారని అచ్చెన్నాయుడు చెప్పారు.
అమరావతి రైతులను మోసం.. చేసి.. రాజధాని ప్రాంతాన్ని.. విచ్ఛిన్నం చేయాలని.. జగన్ రెడ్డి.. కంకణం కట్టుకున్నారని.. విమర్శించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో.. నిర్మించని రింగ్ రోడ్డులో అవకతవకలు జరిగాయని .. వైసీపీ నేతలు డ్రామాలాడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రప్రజలను.. జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలతో , పిచ్చి ప్రకటనలతో.. మోసం చేస్తున్నారని.. పేపర్, టీవీ తనకు లేదని చెప్పడం మోసం కాదా అని ప్రశ్నించారు. దేశంలోని ముఖ్యమంత్రులందరీలో.. 510 కోట్ల రూపాయల ఆస్తి ఉన్న సీఎం జగన్ పేద ముఖ్యమంత్రా? అని అచ్చెన్న ప్రశ్నించారు. ఆర్ బీఐ రద్దు చేసిన.. 2 వేల నోట్లను ఎలా మార్చాలో తెలియక .. జగన్ రెడ్డి.. కంగారు పడుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ నాలుగేళ్ల పాలనలో.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. తెచ్చిన.. 10 లక్షల కోట్లకు లెక్కలు అడిగితే.. చెప్పడం లేదన్నారు. ప్రజలపై 3 లక్షల కోట్ల పన్నుల భారం వేసి.. నట్టేట ముంచాడని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా.. వైసీపీ ప్రభుత్వం ఎక్కడైనా పేదవాడికి ఒక ఇల్లైనా ఇచ్చిందా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
పేదల సంక్షేమం, అభివృద్ధి పాటు పడింది.. ఒక తెలుగుదేశం పార్టీనేనని.. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ప్రజలకు .. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే అండగా నిలిచిందన్నారు. ఎందరో గొప్ప నాయకులను సమాజానికి అందించిన ఘనత ఎన్టీఆర్‌దే అని కొనియాడారు. ఆత్మాభిమానం గల ఎన్టీఆర్ వారసులుగా ఎవరికీ తలవంచమని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. సైకో జగన్ పరిపాలనలో.. ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. సంక్షేమ, అభివృద్ధి ఆగి పోయిందన్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో.. టీడీపీ అఖండమైన మెజార్టీతో విజయం సాధిస్తుందని.. ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.