చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి ప్రథమ స్థానం..వేధింపులు, అక్రమ కేసుల్లోనే!

చంద్రబాబు రాసిన లేఖపై కాదు.. అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి

by చైతన్యరధం
Oct 27, 2023 at 10:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్రానికి ప్రథమ స్థానం..వేధింపులు, అక్రమ కేసుల్లోనే!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టీడీపీకి వస్తున్న ఆదరణకు భయపడే కుట్రతో చంద్రబాబును  జైలుకు పంపించారు
  • చంద్రబాబును జైల్లోనే ఉంచి ఎన్నికలకు వెళ్లాలనేది జగన్‌ పన్నాగం
  • నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా?
  • నిరాహార దీక్షలపై హత్యాయత్నం కేసులు కాదు… ఎండుతున్న పొలాలకు నీళ్లివ్వండి
  • పవన్‌ తపన కూడా రాష్ట్రం కోసమే

తిరుపతి: నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్ర మైనా వచ్చిందా.. మన బిడ్డలకు ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని నారా భువనేశ్వరి ప్రశ్నించారు. భవిష్య త్‌కు గ్యారంటీ, యువగళం పాదయాత్ర విజయవంతం కావటంతో.. భయపడి చంద్రబాబును కుట్రపూరితం గా జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును జైల్లో ఉంచి ఎన్నికలకు వెళ్లాలని ప్రభు త్వం కుయుక్తులు పన్నుతోందన్నారు.ఆలస్యం అయినా ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది.. చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంపై కలిసి కట్టుగా పోరాడుదామన్నారు. చంద్ర బాబు దసరా శుభాకాంక్షలు చెబుతూ రాసిన లేఖపై ఈ ప్రభుత్వం విచారణ చేస్తుందట. ప్రభుత్వం సమయం ఎంతో విలువైనది. వర్షాలు లేని ఈ పరిస్థితుల్లో రైతులకు ఏం చేయాలని చూడాలి. ఇలా లేఖ గురించి విచారణ పేరుతో సమయం వృథా చేయటం పిచ్చి ఆలోచన మాత్రమేనని భువనేశ్వరి అన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా తమ లాగే రాష్ట్రం గురించే తపన పడుతున్నారన్నారు. నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు గురువారం తిరుపతిలోని అంకుర ఆసుపత్రి పక్కన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో భువనేశ్వరి ప్రసం గించారు. సభకు హాజరైన మహిళలు, ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సభలో భువనేశ్వరి మాట్లాడుతూ ప్రజల్ని వేధించడం, ఇబ్బందులు పెట్ట డం గొప్ప అనుకుంటున్నారని జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. నిరాహార దీక్షలు చేసిన వారిపై హత్యా యత్నం కేసులు పెట్టడం కాదు… ఎండుతున్న పొలాల కు ముందు నీళ్లివ్వండిని సూచించారు. ఈ రాష్ట్రం ఎందులోనైనా ఫస్ట్‌లో ఉందంటే అది అక్రమ అరెస్టు లు, వేధింపుల్లోనే అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పెట్టుబడిదారుల్ని భయపెట్టి బయటకు పంపిస్తున్నారు

సంబంధితవార్తలు

తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలి

ఒక నిజాయితీ.. ఒక హెరిటేజ్

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

2014లో చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అనంతపురం జిల్లాను ఆటోమెబైల్‌ హబ్‌ గా మార్చారు. చిత్తూరు జిల్లాను ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ హబ్‌ గా తీర్చిదిద్దారు. గతంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్లో ఇప్పుడు ఒకటి రెండు తప్ప అన్నీ రాష్ట్రం నుండి వెళ్లిపోయాయి. మన రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. మన రాష్ట్ర యువతకు రావాల్సిన ఉద్యోగాలన్నీ పక్క రాష్ట్రాల యువతకు పోతున్నాయి. అమర్‌ రాజా బ్యాటరీస్‌ ఈ జిల్లాలో 30 ఏళ్లుగా ఉంది..వాళ్లనూ ఇబ్బందులు పెట్టారు. దాంతో వాళ్లు రూ.9,300 కోట్ల పెట్టుబడిని తెలంగాణలో పెట్టారు.. అక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించారు. నేను కూడా హెరిటేజ్‌ నడిపిస్తున్నా..ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, ఢల్లీల్లో హెరిటేజ్‌ ఉంది. మమ్మల్ని వాళ్లు ఆహ్వానించి పరిశ్రమకు ఏం కావాలో అడుగుతారు..అన్నీ ఇచ్చి పెట్టుబడుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఏనాడూ మమ్మల్ని భయపెట్టలేదు.

చంద్రబాబు ఉమ్మడి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌కు ఐఎస్బీ తీసుకొచ్చారు..దాని వెనక చంద్రబాబు కష్టం ఎంతో ఉంది. ఈ ఐఎస్బీలో ఒక్క సీటు కూడా ప్రభుత్వ కోటా కింద ఇవ్వబోమని వాళ్లు షరతు పెడితే..దానికి చంద్రబాబు మీ సంస్థ హైదరాబాద్‌ లో ఉంటే చాలు…మాకు ఏమీ వద్దు అని అన్నారు. దీంతో ఇప్పుడు వేలమంది విద్యార్థులు అక్కడ చదివి ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మాత్రం పెట్టుబడి దారులను హింసించి, భయపెట్టి బయటకు పంపిస్తోంది. అందరినీ భయపెట్టి కేసులు పెడుతున్నారు.

చంద్రబాబు రాజకీయ జీవితం ఎస్వీ యూనివర్సిటీలో స్టూడెంట్‌ లీడర్‌ గా ప్రారంభించారు. ఆయన అరెస్టును నిరసిస్తూ యూనివర్సిటీలో ఆయన అభిమానులు దిష్టిబొమ్మను దహనం చేస్తే హత్యాయత్నం కేసులు పెట్టారు. జనసేన మహిళా నేతలు మీడియాతో మాట్లాడితే కేసులు పెట్టారు. శ్రీకాళహస్తిలో దీక్షలు చేస్తే కేసులు పెట్టారు. ఇదా రాష్ట్ర గొప్పతనం.? మన రాష్ట్రం ఎలా అవుతుందో…భవిష్యత్‌ ఏంటో అంతా ఆలోచించాలి. నా పోరాటంలో మహాత్ముడు గుర్తొస్తున్నారు. ఆయన స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు.. మనం ఇప్పుడు రాష్ట్రంలో ఈ ప్రభుత్వంతో స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నాం. ఈ కార్యక్రమానికి నేను రాకముందు చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించాలని చంద్రబాబు చెప్పారు. టీడీపీ ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని  చెప్పారు. నిన్న, ఇవాళ చూశాను..లక్షల మందికి ఆయనపై అభిమానం ఉంది..అది ఆయనపై మీకున్న నమ్మకం..ఇందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజు మన పోరాటం మన భవిష్యత్‌ కోసం, మనం చేసే పోరాట బలంతో గెలుపు తథ్యం అని చెప్పారు. అందుకే కలిసి కట్టుగా నడుం బిగించి ఎన్టీఆర్‌ ఇచ్చిన పౌరుషంతో, చంద్రబాబు ఇచ్చిన క్రమశిక్షణతో పోరాడుదామని భువనేశ్వరి పిలుపునిచ్చారు. సభకు వచ్చిన మహిళలు, ప్రజలు అడిగిన ప్రశ్నలకు భువనేశ్వరి ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

వంగలపూడి అనిత: చంద్రబాబు తీసుకొచ్చిన స్కిల్‌ డెవలెప్మెంట్‌ సెంటర్ల ద్వారా 2019లోనూ ఏపీ ప్రభుత్వం అవార్డు అందుకుంది. 70 వేల మంది ఉద్యోగాలు వచ్చాయి. కానీ అందులో అవినీతి జరిగిందని చంద్రబాబును అరెస్టు చేశారు. దీనిపై మీరేమంటారు.?

భువనేశ్వరి: తప్పుడు కేసులు పెట్టి టీడీపీని లేకుండా చేయాలని చూస్తున్నారు. రూ.371 కోట్లు అవినీతి అంటున్నారు..అవి ఎవరి అకౌంట్లోకి వెళ్లాయో చెప్పడం లేదు. 48 రోజులుగా చంద్రబాబును నిర్బంధించారు. ఇలా ఇబ్బందులకు గురి చేస్తే పెట్టుబడిదారులెవరూ రాష్ట్రానికిరారు..పరిశ్రమలు పెట్టరు. సీఐడీ అధికారులు విచారణ చేసు కోండి… ఇలాంటి వాటికి టీడీపీ బెదరదు. పార్టీ సభ్యత్వానికి కార్యకర్తలు రూ.100 ఇస్తే దానిపైనా విచారణ చేస్తామంటున్నారు. ప్రజల సొమ్ముకు చంద్రబాబు ఎప్పుడూ ఆశపడరు.

రాజేశ్వరి, గూడూరు: చంద్రబాబు 45 ఏళ్ల జీవితంలో ప్రజలకు కనబడకుండా ఏఒక్క రోజు కూడా లేదు. కానీ ఇప్పుడు చూడక 49 రోజులైంది..చంద్రబాబు ఎలా ఉన్నారు..మాకు ఏమి చెప్పమన్నారు.?

భువనేశ్వరి: చంద్రబాబు ప్రజల మనిషి..నాకుంటే మీకే ఎక్కువ ఆయన గురించి తెలుసు. కుటుంబసభ్యు లకు ములాఖత్‌కు 30 నిమిషాలు సమయం ఇస్తు న్నారు. 25నిమిషాలు పార్టీ, ప్రజల గురించే అడు గుతారు. 5నిమిషాలే మా గురించి మాట్లాడతారు. చంద్రబాబు స్ట్రాంగ్‌ పర్సన్‌.. ఆయన్ను ఎవరు ఏమి చేసినా బెదరడు.

గిరిజ, తిరుపతి: ఎన్నికల ముందు చంద్రబాబును అరెస్టు చేసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు.?

భువనేశ్వరి: మీరు కరెక్టుగా చెప్పారు. ఎన్నికలు వస్తు న్నాయని చంద్రబాబును బయటలేకుండా చేయా లని చూస్తున్నారు. భవిష్యత్‌ గ్యారంటీ, యువగళం పాదయాత్ర సక్సెస్‌ అయ్యాయి. దీంతో భయపడి చంద్రబాబును లోపల వేశారు. లోకేష్‌ మళ్లీ పాద యాత్ర చేస్తారు. ఎన్నికలొస్తున్నాయి.. ఓటు చాలా విలువైంది. మీబిడ్డల భవిష్యత్‌ గురించి ఆలోచించి ఓటేయాలి.

సుధ: మీ తండ్రి ఎన్టీఆర్‌, భర్త చంద్రబాబు సీఎంలుగా, మీకొడుకు మంత్రిగా చేశారు.ఇంత గొప్ప స్థాయిని చూసిన మీరు ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కొంటారు.?

భువనేశ్వరి: మా తండ్రి పౌరుషం నాలో ఉంది. చంద్ర బాబుతో పెళ్లయ్యాక క్రమశిక్షణ, ఓర్పు నేర్చు కున్నా. ఇవే నన్ను ముందుకు తీసుకెళ్తాయి.

ప్రవీణ, తిరుపతి : జగన్‌ అరెస్టు అయినప్పుడు ఇంట్లో నలుగురు తప్ప ఎవరూ న్యాయం అడగలేదు. కానీ చంద్రబాబు అరెస్టు అయ్యాక, తెలుగు ప్రజలు, ఉద్యోగులు న్యాయం కావాలిని అడుగుతున్నారు. దీనిపై మీరేమంటారు.?

భువనేశ్వరి: చంద్రబాబు కష్టం వారు మర్చిపోలేదు.. వారి ఇంట్లో వెలుగులు నింపారు. అలాంటి మనిషిని మర్చిపోలేదు..ఇప్పుడూ నమ్ముతున్నారు. అందుకే మహిళలు న్యాయం కోసం మందుకు వచ్చి పోరాడుతున్నారు. ఏనాడూ రాని మహిళలు బయటకు వచ్చి పోరాడుతుంటే పోలీసులు ఇబ్బందులు పెడతున్నారు. చంద్రబాబు నాయక త్వాన్ని వారు నమ్మతున్నారు. చంద్రబాబు దసరా శుభాకాంక్షలతో లేఖ రాశారు..దానిపైనా విచారణ చేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి మరో పనిలేదా.? ఉత్తరంపై విచారణా.? సమయం వృథా చేస్తు న్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే.. నీరు ఎలా ఇవ్వాలో ఆలోచించకూండా పనిలేని ఆలోచనలు చేస్తున్నారు.

సులోచన, తిరుపతి : మీరు ఈ జిల్లాకు కోడలు అయ్యి 40 ఏళ్లు అయింది..మిమ్మల్ని మేము ఎప్పుడూ ఒంటరిగా చూళ్లేదు. తిరుపతి, నారావారిపల్లికి ఒంటరిగా వెళ్లారు. దీన్ని మీరు ఎలా భావిస్తారు.?

భువనేశ్వరి: జీవితంలో ఇబ్బందులు అందరికీ వస్తాయి. ఇవాళ కాకపోయినా రేపైనా న్యాయం జరుగుతుంది..ఈ ధైర్యంతో అంతా కలిసి ఉన్నాం.

భువన, లా స్టూడెంట్‌: ఎంపీ హత్య చేస్తే ఆధారాలున్నా అరెస్టు చేయలేదు.. కానీ చంద్రబాబుపై ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారు. దీనిపై మీరేమంటారు.?

భువనేశ్వరి: ఆలస్యం అయినా ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది. చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరు.

హరిప్రసాద్‌, జనసేన: ధర్మాన్ని కటకటాల వెనక్కు నెట్టారు..అందుకే పవన్‌ కళ్యాణ్‌ ఒక లక్ష్మణుడిలా కదిలి వచ్చారు. పవన్‌ మిమ్మల్ని కలవడం మీకు ఎలా అనిపించింది.?

భువనేశ్వరి: నన్ను పవన్‌ కళ్యాణ్‌ కలిసినప్పుడు బాగు న్నారా అమ్మా అని ఆప్యాయంగా అడిగారు. ఈ రాష్ట్రంలో జరిగే అత్యాచారాల గురించి చెప్పి బాధపడ్డారు. మాలాగే రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నా రు. మన రెండు పార్టీలు కలసి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నా.

Tags: అంకుర ఆసుపత్రిఅక్రమ కేసులుఅనంతపురం జిల్లాఅభివృద్దిఅమర్‌ రాజా బ్యాటరీస్‌ఆటోమెబైల్‌ హబ్‌ఎన్నికలుఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ హబ్‌చంద్రబాబునాయుడుచిత్తూరు జిల్లాజైలుతిరుపతినారా భువనేశ్వరినిజం గెలవాలినిరాహార దీక్షపన్నాగంపవన్ కల్యాణ్పెట్టుబడిదారులుప్రభుత్వంభవిష్యత్ కు గ్యారంటీయువగళంయువతలేఖవేధింపులుహెరిటేజ్‌
Previous Post

చంద్రబాబు గారి అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు భువనమ్మ పరామర్శ.

Next Post

నారా భువనేశ్వరి గారి ‘నిజం గెలవాలి’ 3వ రోజు పర్యటన వివరాలు – శ్రీకాళహస్తి నియోజకవర్గం నియోజకవర్గం (27.10.2023)

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-02-2026

కార్యకర్త
@ February 20, 2026
పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!
ఆంధ్రప్రదేశ్

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

చైతన్యరధం
@ February 20, 2026
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ February 20, 2026
డిన్నర్ విత్ లోకేష్..
ఆంధ్రప్రదేశ్

డిన్నర్ విత్ లోకేష్..

చైతన్యరధం
@ February 20, 2026
దమ్ము లేకే దొంగ డ్రామాలు!
ఆంధ్రప్రదేశ్

దమ్ము లేకే దొంగ డ్రామాలు!

చైతన్యరధం
@ February 20, 2026
ఐక్యంగా, అప్రతిహతంగా..!
ఆంధ్రప్రదేశ్

విజన్ లక్ష్యాలకు అనుగుణంగా వీబీ జీ రామ్‌జీ పనులు

చైతన్యరధం
@ February 20, 2026
ఎవరెన్ని కుట్రలు చేసినా.. అమరావతి అన్ స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

నేడు ఢిల్లీకి సీఎం

చైతన్యరధం
@ February 20, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

సమగ్రశిక్ష సిబ్బంది జీతాల

చైతన్యరధం
@ February 20, 2026
Load More

ముఖ్య వార్తలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

చైతన్యరధం
@ February 20, 2026
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ February 20, 2026
డిన్నర్ విత్ లోకేష్..

డిన్నర్ విత్ లోకేష్..

చైతన్యరధం
@ February 20, 2026
దమ్ము లేకే దొంగ డ్రామాలు!

దమ్ము లేకే దొంగ డ్రామాలు!

చైతన్యరధం
@ February 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist