యువగళం సభతో వైసీపీ పతనం మొదలవుతుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పటంలేదన్నారు. వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ నవరత్నాల పేరిట.. నవ మోసాలు చేశారని విమర్శించారు.