- చారిత్రక ఉద్యమానికి తొలి పుట అమరావతి
- న జీవన్మరణ పోరుకు 1500 రోజులు..
- న అశువులు బాసిన వీరులు 275 మంది
ఇంకా పోలీస్ పహారాలోనే గ్రామాలు
ఒక మహా నిర్మాణం మొదలైంది. కల నెరవేరకముందే ` విధ్వంసం ఆవిష్కృతమైంది. ఈ రెంటిమధ్య కాలం `1500 రోజులు. పోరు నష్టం `275 ప్రాణాలు. ఇదొక చారిత్రక బలిదానం. ఉద్యమ చరిత్రకు సుదీర్ఘ పర్వం. మొత్తంగా రాజధాని అమరావతి చుట్టూ సాగిన, సాగుతున్న మహా పోరాటం. నమ్మకం నిలువునా శిథిలమైనపుడు.. శకలాలే సైన్యంగా యుద్ధం ప్రకటించు ` అంటాడొక విప్లవ కవి.
1500 రోజులుగా అమరావతిలో సాగుతున్నదదే. ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి జనవరి 25నాటికి `1500 రోజులు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతుల వెర్రిగొంతుక విచ్చుకుని `1500 రోజులు. భూమినీ, భుక్తినీ వదులుకుని రాజధానిపై భక్తితో వేల ఎకరాలు వదులుకున్న రైతుల మనోభావాలను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీసి `1500 రోజులు. రాజధాని పరిరక్షణ సమితి పోరాట పటిమకు `1500 రోజులు.
అమరావతి రాజధాని కోసం `పోటెత్తిన రైతు డొక్కలో తన్నారు. అడ్డొచ్చిన రైతు భార్య బట్టలూడదీశారు. పోరుబాట పట్టిన ముసలీ ముతకా, పిల్లా పీచును నడ్డి విరగ్గొట్టి నడిరోడ్డుకు ఈడ్చేశారు. ఉద్యమాన్ని అణగదొక్కేందుకు, రైతు గొంతు నొక్కేందుకు జగన్ సర్కారు అమలుచేయని దాష్టీకం లేదు. అయినా `రాజధాని కోసం రైతు పోరు ఆగలేదు. పాదయాత్రను అడ్డుకుంటే `ప్రాణాలు అడ్డేశారు. 144 సెక్షన్, పోలీసు చట్టంలో సెక్షన్ 30వంటివి ప్రయోగిస్తే `ఊపిరి వదిలారు తప్ప ఉద్యమాన్ని ఆపలేదు. సర్కారూ తగ్గలేదు. ఉద్యమాన్ని నీరుగార్చడానికి `పోలీస్ చర్యకు దిగింది. గ్రామాల్ని గుప్పిట్లో పెట్టకుంది. లాఠీలను ప్రయోగించింది. హింసాకాండను ప్రేరేపించింది. విభేదాలు సృష్టించింది. అయినా `మహిళలు, రైతులు ముందు వరుసలో ఉన్నారే తప్ప వెనకడుగు వేయలేదు.
ప్రజా రాజధానిపై పగబట్టిన ప్రభుత్వం ఉద్యమ గళాలను అణిచేయడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. మహిళలు స్నానం చేసే సమయంలో డ్రోన్ కెమేరాలు తిప్పారు. అడ్డుకున్న 40మందిపై కేసులు బనాయించి 20 రోజులు పాటు జైళ్లలో మగ్గపెట్టారు. నాలుగేళ్ల ఉద్యమ క్రమంలో 2000 మందిపై కేసులు బనాయించారు. మరోవైపు అమరావతిపై బెంగతో ఇప్పటివరకు 275 మంది రైతులు గుండెపగిలి చనిపోయారు.
ఇంత జరిగినా `అమరావతి ఉద్యమాన్ని నడిపించడం ధీరత్వానికి నిదర్శనంగా భావించారే తప్ప.. పోరుబాటను వదల్లేదు. మరోపక్క న్యాయ దేవతని నమ్మకున్న రైతులు హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్ళి వరుస విజయాలు సాధించారు. అయినా సీఎం జగన్‌కు కనువిప్పు కలగలేదు. రాజధాని పరిరక్షణ సమితి కూడా పోరుబాటను వీడలేదు.
మడమ తిప్పిన వైసీపీ
రాష్ట్రానికి మూడు రాజధానుల డ్రామాతో `2019 డిసెంబర్ 17న జగన్ రెడ్డి అమరావతి రాజధానికి మరణ శాసనం రాశాడు. దాంతో `ప్రజా రాజధానికి ప్రాణప్రదమైన భూముల్నే రాసిచ్చిన రైతులు భగ్గుమన్నారు. రైతులతో పాటు, రాష్ట్ర భవితనూ బలిపీఠం మీదకు నెట్టారంటూ పోరుబాట పట్టారు. చంద్రబాబు కలల రూపమైన రాజధాని అమరావతికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు రావడాన్ని భరించలేని వైసీపీ సర్కారు `అమరావతిపై కక్షగట్టింది. అంతకుముందు `తెలుగుదేశం హయాంలో అమరావతిని రాజధానిగా అంగీకరిస్తూ చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని సమర్థించిన వైసీపీ.. తరువాత అధికారంలోకి రాగానే మాట మార్చింది. మడమ తిప్పింది. మొత్తంగా రాజధాని విధ్వంసానికే శ్రీకారం చుట్టింది. అమరావతి ముంపు ప్రాంతమని, అనువుగాని నేలవల్ల అధిక వ్యయమవుతుందని కొత్తరాగం అందుకుంది. అప్పటికే మొదలైన మహా నిర్మాణంలో `ఇన్‌సైడర్ ట్రేడిరగ్ అవినీతి జరిగిందంటూ విమర్శల పాటెత్తుకుంది. అమరావతి శ్వశానం, ఎడారి అంటూ అబద్దాలు, అర్ధసత్యాలు, అభాండాలు, రాజకీయ నాటకాలతో.. నవ్యాంధ్రకు నిర్మితమవుతున్న రాజధాని నిర్మాణాన్ని నామరూపాల్లేకుండా చేసింది.
ఉద్యమ ఘట్టాలు :
- 2019 డిశెంబరు 17న సీఎం జగన్ అసెంబ్లీలో మూడు రాజధానులను ప్రకటించారు. అదే రోజు న తుళ్లూరులో రైతులు ఆందోళనకు దిగారు.
- డిశెంబర్ 19న అమరావతిలో రైతులు బంద్ పాటించారు. ప్రభుత్వం వెంటనే 30 యాక్ట్, 144 సెక్షన్ అమలు చేసింది. వందల మంది పోలీసులు రాజధాని గ్రామాల్లో కవాతు నిర్వహించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.
- డిశెంబరు 31న తమను కారుణ్య మరణాలకు అనుమతించాని రాజధాని రైతులు రాష్ట్రపతికి లేఖలు రాసి.. ఉద్యమాన్ని కొత్తమలుపు తిప్పారు.
- 2020 జనవరి 3న అమరావతి మహిళా రైతులపై పోలీసులు దాడి. నిరసనగా రాజధాని గ్రామాలు బంద్.
- జనవరి 9న విపక్ష నేత చంద్రబాబు తలపెట్టిన బస్సుయాత్రను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు అక్కడే బైటాయించి నిరసన తెలిపారు.
- జనవరి 10న దుర్గమ్మకు ముడుపులు చెల్లించుకునేందుకు వెళుతున్న మహిళలపై పోలీసులు దాడి. అప్పటి గుంటూరు ఎస్పీ విజయరావు సైతం లాఠీ పట్టి కొట్టి, మహిళల జుట్టు పట్టుకులాగడం, ఇనుప కంచెను మహిళ లపై వేసి ఒళ్లు చీరుకుపోయేలా చేయడం వంటి దుర్మార్గపు పనులకు పోలీసులు పాల్పడ్డారు. పోలీసుల అనైతిక చర్యలపై హైకోర్టు జనవరి 13న సుమోటోగా కేసు నమోదు చేసింది.
- 2020 మార్చి 20న కరోనా కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అలాంటి సమయంలోనూ ఇళ్లలోనే నిరసన దీక్షలు కొనసాగించారు.
- 2021 జూలై 4న ఉద్యమం 200 రోజులకు చేరుకుంది. 200 నగరాల నుంచి ఎన్‌ఆర్‌ఐలు కొవ్వొత్తుల ప్రదర్శన చేసి ఉద్యమానికి మద్దతు తెలిపారు.
- అక్టోబరు 12 నాటికి ఉద్యమం 300 రోజులకు చేరింది. రాజధాని పోరులో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళిగా తుళ్లూరులో ‘ఆత్మబలిదాన యాత్ర’ పేరిట భారీ ప్రదర్శన నిర్వహించారు. ఉద్యమంలో అప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన 92మంది రైతులు, రైతు కూలీల చిత్రాలు ఉంచి న పాడెలను మోస్తూ పాదయాత్ర నిర్వహించారు. అప్పటి మంత్రులు ధర్మాన కృష్టదాస్, కొడాలి నాని, బొత్సా సత్యనారాయణ, అప్పలరాజు వ్యాఖ్యల్ని నిరసిస్తూ మంత్రుల వేషధారులకు ఉరి బిగిస్తూ నిరసన ప్రకటించారు.
- 2021 జనవరి 20 నాటికి ఉద్యమం 500 రోజులు మైలురాయి చేరింది. పలు పార్టీలు, జేఏసీ నేతలు ప్రధాని మోదీకి లేఖలు రాశారు.
- 2021 ఆగస్టు8 నాటికి ఉద్యమం 600 రోజులకు చేరింది. ఈ సమయా నికి మరణించిన రైతులు, కూలీలు సంఖ్య 170కి చేరింది.
- నవంబరు 16న అమరావతి ఉద్యమం 700వ రోజులకు చేరుకుంది. ఈ సమయంలోనే ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్లు హైకోర్టు తెలిపింది. ఇది అమరావతి ఉద్యమ నైతిక విజయంగా ఉద్యమకారులు పేర్కొన్నారు.
- 2020 జనవరి 7న చినకాకాని వద్ద జాతీయ రహదారిని అన్నదాతలు నిర్భందించడంతో వైసీపీ ప్రభుత్వం ఖంగు తిని ఉద్యమాన్ని అణచి వేసేందుకు మరింత అరాచకాలకు ఒడికట్టింది.
- 2020 జనవరి 10న విజయవాడ కనకదుర్గమ్మకు పొంగళ్లు సమర్పించి రైతుల బాధలను తెలిపేందుకు వెళ్లిన మహిళలపై పోలీసులు లాఠీఛార్జీ చేసి అతి నీచానికి పాల్పడ్డారు. మందడంలో దీక్ష చేస్తున్న మహిళలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఒక గర్భిణీని కసాయి పోలీసు దారుణంగా తన్నడంతో ఆమె తీవ్రంగా గాయపడిరది.
- ఏపీ రాజధాని అమరావతేనని కేంద్రం ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేసినా… జగన్ ప్రభుత్వం కుట్రలు మానలేదు. పైగా పదోతరగతి పాఠ్యపుస్తకాల్లో అమరావతిపై ఉన్న పాఠ్యాంశాన్ని తొలగించింది.