అమరావతి,చైతన్యరధం: తనకు ప్రతిపక్షపార్టీ నేత హోదా కల్పించాలంటూ స్పీకర్ అయన్యపాత్రుడుకు వైసీపీ శాసనసభాపక్ష నేత వైస్ జగన్‌రెడ్డి లేఖ రాయడంపై మంత్రులు, టీడీపీ నేతలు మండిపడ్డారు. గత ఐదేళ్లు జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలన్నారు. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. స్పీకర్ కు జగన్ లేఖ రాయడం హాస్యాస్పదమని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
అర్హత లేకపోయిన జగన్ కు అసెంబ్లీలో గౌరవం లభించిందని, జగన్ వాహనాన్ని లోపలికి అనుమతించారని గుర్తు చేశారు. వక్ర భాష్యంతో స్పీకర్ కు జగన్ లేఖ రాశారని, స్పీకర్ ను జగన్ టార్గెట్ చేశారని రవికుమార్ విమర్శించారు. జగన్ కి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిరచినప్పటికీ టీడీపీపై పడి ఏడవడం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ అన్నారు. గతంలో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అన్న జగన్.. ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని ప్రశ్నించారు. జగన్ తన తీరు మార్చుకోకపోతే వైసీపీకి ప్రజలు సమాధి కట్టడం ఖాయన్నారు.
జగన్‌కు ఇంకా పదవీకాంక్ష తీరలేదా అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఒకసారి రాజ్యాంగనిపుణులను కనుక్కొని లేఖ రాయాల్సిందని అన్నారు. మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది ప్రజలేనని గుర్తు చేశారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుని.. బాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దామనుకున్నారని, కానీ మీకు ప్రతిపక్ష హోదా కాదు కదా అసెంబ్లీలో కూర్చునే అర్హత కూడా లేదని బుద్దా వెంకన్న ద్వజమెత్తారు.