చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

కార్మికుల క్షేమం, సంక్షేమం ముఖ్యం

అదే కూటమి ప్రభుత్వ విధానం: సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Aug 30, 2024 at 7:00am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
కార్మికుల క్షేమం, సంక్షేమం ముఖ్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రూ.10 లక్షల బీమాకు త్వరలో శ్రీకారం
  • కార్మికుల హక్కులు పరిరక్షించాలి
  • అర్థంలేని నిబంధనలతో పరిశ్రమలపై వేధింపులు ఉండకూడదు
  • సేఫ్టీ విషయంలో రాజీ వద్దు
  • ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలపై థర్డ్‌ పార్టీతో ఆడిట్‌
  • ఈఎస్‌ఐ ఆసుపత్రుల బలోపేతం, రాష్ట్ర వాటా నిధులు విడుదల చేస్తాం
  • 2019కి ముందు ఇచ్చిన చంద్రన్న బీమాను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది
  • పరిహారాన్ని కుదించి ఆంక్షలతో లబ్ధిదారులను తగ్గించింది
  • కార్మిక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

    అమరావతి(చైతన్యరథం): సంపద సృష్టికి మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. కార్మికశాఖ, పరిశ్రమలు, బాయిలర్స్‌, మెడికల్‌ సర్వీసెస్‌ శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం.. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్మికుల సంక్షేమం విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకెళ్లాలన్నారు. భద్రత విషయంలో పరిశ్రమలు రాజీ పడకుడదని, భద్రతా ప్రమాణాలపై థర్డ్‌ పార్టీ ఆడిట్‌ తప్పనిసరి చేయాలన్నారు. తనిఖీలు అనేవి భద్రత పెంచేలా, తప్పులు సరిదిద్దేలా ఉండాలన్నారు. అంతే కానీ తనిఖీల పేరుతో పరిశ్రమల యాజమాన్యాలను వేధింపులకు గురిచేయవద్దని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి తరవాత మళ్లీ సేఫ్టీ గురించి పట్టించుకోవడం లేదని….ఇలా కాకుండా నిర్దిష్టమైన ప్రణాళికతో భద్రత కోసం పనిచేయాలన్నారు. అధికారులు తరచూ తనిఖీలు చేయడంతో పాటు నిబంధనల అమలుపై నిరంతరం పర్యవేక్షించాలన్నారు. తనిఖీలతో పాటు థర్డ్‌ పార్టీ ద్వారా కూడా ఆడిట్‌ జరపాల్సిన అవసరం ఉందన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటు జరిగితేనే ఉపాధి లభిస్తుందని…అనుమతుల జారీ విషయంలో పారదర్శకంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పరిశ్రమలు, సిబ్బంది, వాటి భద్రతపై అధికారులు ప్రజెంటేషన్‌ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో 24,642 వేల ఫ్యాక్టరీలు రిజిస్టర్‌ అయ్యాయని వాటిలో 11.78 లక్షల మంది పనిచేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో రసాయన పరిశ్రమలు పెరిగిన దృష్ట్యా భద్రతా చర్యలు పర్యవేక్షించడానికి, ప్రమాదాలు అరికట్టడానికి ముగ్గురు కెమికల్‌ ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఉండాలన్నారు. రాష్ట్రంలో 3,700 బాయిలర్స్‌ ఉన్నాయని, ప్రతి ఏడాది వీటిని చెక్‌ చేస్తున్నామన్నారు. పరిశ్రమల్లో తనిఖీలకు అవసరమైన అధికారులను వెంటనే నియమిస్తామని ఈ మేరకు పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
    ఈఎస్‌ఐ ఆస్పత్రుల బలోపేతం
    మన రాష్ట్రంలో ఉన్న నాలుగు ఈఎస్‌ఐ ఆసుపత్రులను బలోపేతం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. 2014 నుంచి 2019 మధ్య ఈఎస్‌ఐ వైద్య సేవలు పొందే వారి సంఖ్య 5 లక్షల నుంచి 11 లక్షలకు పెరిగితే….ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఈఎస్‌ఐ సేవలు తగ్గాయని మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. సీనియర్‌ డాక్టర్‌ మాత్రమే ఈఎస్‌ఐ ఆసుపత్రికి సూపరింటెండెంట్‌గా ఉండాలని నిబంధనలు ఉన్నా…గత ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కిందన్నారు. వైఎస్‌ఆర్‌ బీమాలో జరిగిన అక్రమాలను ఈ సందర్బంగా మంత్రి …ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై సమాచారం సేకరించి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పేదలకు అందే సాయంలోను అక్రమాలకు పాల్పడితే ఎవరైనా ఉపేక్షించకూడదని….తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులతో మాట్లాడి ఈ విషయంలో ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
    ఈఎస్‌ఐ పెండిరగ్‌ బిల్లులు క్లియర్‌
    ఇఎస్‌ఐ ఆసుపత్రులకు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన రూ. 54 కోట్లు పెండిరగ్‌లో ఉన్నాయని అధికారులు చెప్పగా…వాటి విడుదలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఇఎస్‌ఐ ఆసుపత్రుల్లో సర్వీసులు అవుట్‌ సోర్సింగ్‌కు ఇవ్వడం ద్వారా సేవలను మెరుగుపరిచే విషయంలో కసరత్తు చేయాలని సూచించారు. లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు, మినిమం వేజెస్‌ బోర్డు, బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్‌ వర్కర్స్‌ బోర్డులను యాక్టివ్‌ చేసి కార్మికుల హక్కులు, సంక్షేమం అందేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
    గడిచిన ఐదేళ్లలో చంద్రన్న బీమా నిర్వీర్యం-లబ్ధిదారుల్లో భారీ కోత
    కార్మికులకు అండగా నిలిచేందుకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన చంద్రన్న బీమాను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. నాటి తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో అసంఘటిత రంగంలోని కార్మికులకు అందరికీ బీమా వర్తింప చేయగా…వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను కుదించేసింది. 2014-19 మధ్య బీమా కింద 2.50 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా గత ప్రభుత్వం దాన్ని 1.22 కోట్లకు తగ్గించింది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా బీమా పథకం అమలు చేస్తామని చెప్పి మొత్తం కార్యక్రమాన్నే నిర్వీర్యం చేశారు. నాడు సహజ మరణాలకు రూ.2 లక్షలు, ప్రమాద మరణాలకు రూ. 5 లక్షలు ఇచ్చాము. కానీ వైసీపీ ప్రభుత్వం సహజ మరణాలకు కేవలం రూ.1 లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంది. టీడీపీ హయాంలో సహజమరణం పొందిన 3,08,440 మందికి బీమా క్లెయిమ్‌ ద్వారా రూ.3393 కోట్లు చెల్లించగా…గత ప్రభుత్వం కేవలం 91 వేల మందికి రూ.1025 కోట్లు మాత్రమే చెల్లించింది. నాడు ప్రమాదవశాత్తూ మరణించిన 30,888 మందికి బీమా చెల్లింపుల ద్వారా రూ.1,360 కోట్లు చెల్లించగా, గత వైసీపీ ప్రభుత్వం కేవలం 9,938మందికి రూ.496 కోట్లు నామమాత్రంగా చెల్లించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో మూడేళ్లలో చంద్రన్న బీమా ద్వారా రూ.4,753 కోట్లు బాధిత కుటుంబాలకు అందించింది. వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 1,521 కోట్లు మాత్రమే ఇచ్చింది. చంద్రన్న బీమా కింద రూ.10 లక్షలు ఇస్తామనే ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నాం. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకొస్తాం. కార్మికులకు బీమా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఇందుకోసం అవసరమైన విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించాము. కేవలం కార్మికులే కాకుండా ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు, ఇతర వర్గాల వారికి బీమా అందించేలా పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించాము. డ్వాక్రా సంఘాల ద్వారా ప్రమాద బీమా కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 20-02-2026

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

Previous Post

ప్రజలకు, పార్టీకి హరికృష్ణ సేవలు చిరస్మరణీయం

Next Post

ఏఐ సిటీగా అమరావతి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026

కార్యకర్త
@ February 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-02-2026

కార్యకర్త
@ February 20, 2026
పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!
ఆంధ్రప్రదేశ్

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

చైతన్యరధం
@ February 20, 2026
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ February 20, 2026
డిన్నర్ విత్ లోకేష్..
ఆంధ్రప్రదేశ్

డిన్నర్ విత్ లోకేష్..

చైతన్యరధం
@ February 20, 2026
దమ్ము లేకే దొంగ డ్రామాలు!
ఆంధ్రప్రదేశ్

దమ్ము లేకే దొంగ డ్రామాలు!

చైతన్యరధం
@ February 20, 2026
ఐక్యంగా, అప్రతిహతంగా..!
ఆంధ్రప్రదేశ్

విజన్ లక్ష్యాలకు అనుగుణంగా వీబీ జీ రామ్‌జీ పనులు

చైతన్యరధం
@ February 20, 2026
ఎవరెన్ని కుట్రలు చేసినా.. అమరావతి అన్ స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

నేడు ఢిల్లీకి సీఎం

చైతన్యరధం
@ February 20, 2026
Load More

ముఖ్య వార్తలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

చైతన్యరధం
@ February 20, 2026
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ February 20, 2026
డిన్నర్ విత్ లోకేష్..

డిన్నర్ విత్ లోకేష్..

చైతన్యరధం
@ February 20, 2026
దమ్ము లేకే దొంగ డ్రామాలు!

దమ్ము లేకే దొంగ డ్రామాలు!

చైతన్యరధం
@ February 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist