చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నాయకుడంటే చంద్రన్నే!

by చైతన్యరధం
Sep 11, 2024 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నాయకుడంటే చంద్రన్నే!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

విపత్కర పరిస్థితుల్లో సమర్థ నిర్ణయాలతో ప్రజలను ముందుకు నడపగలవాడే నాయకుడు. నాలుగు దశాబ్దుల రాజకీయ అనుభవంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని.. విపత్కర పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ `నేనున్నాంటూ ప్రజలకు ధైర్యంచెప్పి ముందుకు నడిపించే నాయకుడిగా.. బుడమేరు వరదల సమయంలో మరోసారి నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. భారీ వరదల్లో చిక్కుకుని విలవిల్లాడిన విజయవాడను ఒడ్డుకు చేర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సాహసం.. ఆయన సమర్థ రాజకీయ నాయకత్వానికి గీటురాయి.
విజయవాడను భారీ వరదలు ముంచెత్తాయి. అనుకోని విపత్తు నగరాన్ని పూర్తిగా జలదిగ్బంధంలోకి నెట్టింది. అంతకంతకూ పెరుగుతున్న వరదను చూసి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రధానంగా బుడమేరు వాగు పొంగిపొర్లడంతో నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో వరదకు ఎదురు నిలబడి.. ప్రజలకు రక్షణ కల్పించి ధైర్యం చెప్పిన నేతగా సీఎం చంద్రబాబు ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. నగర ప్రజలకు మనోబలమిస్తూనే.. వరద సహాయ చర్యలు చేపట్టి.. పరిస్థితులను చక్కదిద్దేందుకు చంద్రబాబు సలిపిన నిరంతర కృషి మాటల్లో చెప్పలేనిదే.
తొమ్మిది రోజులుగా వరద బాధితుల మధ్యే..
సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా.. విపత్తుల తర్వాత ఏరియల్‌ సర్వే చేసి బాధితులను పరామర్శించడం పరిపాటి. కానీ చంద్రబాబు దీనికి భిన్నం. హుద్‌హుద్‌ తుఫాను సమయంలోనూ పరిస్థితిని చక్కదిద్దేవరకూ క్షేత్రస్థాయిలో ఉండి.. విశాఖ నగరాన్ని సాధారణ స్థితికి తెచ్చినపుడు.. ఆ సాహసానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడూ అదే పంథాను అనుసరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడ వరద సమయంలోనూ.. తొమ్మిదిరోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉన్నారు. అనుక్షణం వరద బాధితుల మధ్యే గడిపి.. పీకల్లోతు కష్టంలోవున్న ప్రజలకు ధైర్యం చెబుతూ ముందుకు నడిపించారు. ముఖ్యమంత్రి హోదాను.. వయసును పక్కనపెట్టి వరదకు ఎదురు నిలిచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూనే.. యంత్రాంగంతో సమీక్షిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రజలకు నేరుగా సేవలందించడానికి పది రోజులపాటు విజయవాడ కలెక్టరేట్‌నే ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుగా మార్చుకుని.. సర్వశక్తులు ఒడ్డారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పడవల్లో తిరుగుతూ, ప్రోక్లెయిన్లపై ప్రయాణిస్తూ.. ప్రజల కష్టాలను తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యమైంది. అందుకే.. చంద్రబాబు ప్రజా హృదయాలపై బలమైన ముద్ర వేయగలిగారు.
కేంద్రం సహాయం తీసుకున్న విధానం
వెల్లువెత్తిన బుడమేరు వరద విజయవాడపై విరుచుకు పడిరదన్న సమాచారం తెలిసిన వెంటనే.. క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన చంద్రబాబు.. విపత్కర పరిస్థితిని ఎదుర్కోడానికి కేంద్రం సహాయం తీసుకోవడంలోనూ కృతకృత్యులయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో చర్చించి, ఎన్డీఆర్‌ఎఫ్‌, మిలటరీ ఇంజనీరింగ్‌ బృందాలను రాష్ట్రానికి రప్పించడంలో చంద్రబాబు సుదీర్ఘ అనుభవానికి నిలువెత్తు నిదర్శనం. ఆగమేఘాల మీద ఆరు హెలికాఫ్టర్లు, పవర్‌ బోట్లును వరద ప్రాంతాలకు తేగలిగారు. కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాహసోపేత నిర్ణయాలతో చేపట్టిన సహాయక చర్యల వల్లే ప్రజలకు తక్షణ సాయం అందించగలిగారు. భారీ ప్రాణనష్టం ముప్పునుంచి రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చగలిగారు.
విలయాన్ని ఎదుర్కొన్న విజయవాడ
విజయవాడలోని ప్రధాన ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలకు ఆహార సరఫరా అత్యంత కష్టతరమైనదిగా మారింది. టెక్నాలజీని ఔపోసన పట్టిన చంద్రబాబు.. వరద సహాయక చర్యలకు సాంకేతికతను అనుసంధానించి బాధితులకు తక్షణం సాయం అందించారు. అధికార యంత్రాంగంతో అనుక్షణం సమీక్షలు నిర్వహిస్తూనే.. సహాయక చర్యలపై మార్గనిర్దేశం చేస్తూ.. ఆకలి బాధల నుంచి వరద బాధితులకు విముక్తి కలిగించారు. చరిత్రలో తొలిసారిగా డ్రోన్ల సాయంతో బాధితులకు ఆహారం మరియు నిత్యావసరాలను సరఫరా చేయడంవంటి వినూత్న చర్యలతో.. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వాలు ఎలా స్పందించవచ్చో చేసి చూపించారు.
పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ సహాయక చర్యలేకాకుండా, వరదల కారణంగా ఏర్పడిన పారిశుద్ధ్య సమస్యలను ఎదుర్కొనడంలోనూ ముఖ్యమంత్రి అనుసరణీయ విధానం అద్భుత ఫలితాలే ఇచ్చింది. వరద తగ్గిన వెంటనే ఫైర్‌ ఇంజిన్ల సాయంతో రోడ్లపై పేరుకున్న బురదను శుభ్రపర్చడం, కాల్వల్లో పేరుకున్న చెత్తను తొలగించడం, వ్యాధులు ప్రబలకుండా డ్రోన్ల సాయంతో బ్లీచింగ్‌ చల్లడంవంటి ఆధునిక ప్రక్రియ.. పనులను సులువు చేసే అంశమే.
వైద్య శిబిరాలు మరియు ఆరోగ్య సంరక్షణ
విపత్తు తరువాత ఎదుర్కోవాల్సిన యుద్ధంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు అవిరళ కృషినే సాగించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిరాశ్రయులకు, బాధితులకు అవసరమైన వైద్యసేవలను అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, ఉచితంగా మందులు, సేవలు అందించారు.
ప్రజల ఆదరణ
విజయవాడ వరద సహాయ కార్యక్రమాలలో ప్రభుత్వం స్పందించిన తీరుకి ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించడం, బాధితులనుంచి వివరాలు తెలుసుకోవడం, నిత్యావసరాల పంపిణీ.. ఇవన్నీ ప్రభుత్వంపై ప్రజలకి అపార నమ్మకాన్ని కలిగించాయి. ముఖ్యమంత్రి చందబాబు పిలుపు మేరకు దాతలు ముందుకొచ్చి భారీగా వరద సహాయ విరాళాలు అందించారు. అక్షయపాత్ర వంటి సంస్థలు 10 లక్షల మందికి ఆహారం అందించడం ఇందుకు ఉదాహరణ.

 

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

కెఎస్‌ జవహర్‌, మాజీ మంత్రి

Previous Post

ప్రకాశం బ్యారేజ్‌ విధ్వంసానికి ఇసుక బోట్లతో ప్లాన్‌

Next Post

ఉత్తరాంధ్రపై దృష్టిపెట్టండి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

కార్యకర్త
@ July 13, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026

కార్యకర్త
@ July 12, 2026
మళ్లీ కలుద్దాం
ఆంధ్రప్రదేశ్

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

చైతన్యరధం
@ July 12, 2026
‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం
ఆంధ్రప్రదేశ్

‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం

చైతన్యరధం
@ July 12, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist