- అమరావతిలో సెంట్రల్ లైబ్రరీకి రూ.100 కోట్లు ఇవ్వండి
- కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రికి నారా లోకేష్ విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన మంత్రి..సాయానికి హామీ
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలోని పాఠశాలల్లో కొత్తగా అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6,762 కోట్లు మంజూరు చేయాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల న్యూఢల్లీిలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని కలిసి రాష్ట్రంలోని పాఠశాలలకు సంబంధిం చి పలు వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రంలోని 32,818 పాఠశాలల్ల్లో తరగతి గదుల మరమ్మతులు, టాయిలెట్లు, తాగునీటి వసతులకు రూ.4,141 కోట్లు, 7579 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.2621 కోట్లు అవసరమని, మొత్తంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 6,762 కోట్లు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 విజయవంతంగా అమలుచేస్తున్న ఏపీకి పీఎం శ్రీ పథకం మూడో విడతలో 1514 స్కూళ్లు మంజూరు చేయాలని కోరారు. మొత్తం 2,369 పాఠశాల లకు రాష్ట్ర ప్రభు త్వం ప్రతిపాదించగా రెండువిడతల్లో 855 పాఠశాలలు మాత్రమే మంజూ రయ్యాయని తెలిపారు. తక్షణమే కొత్త స్కూళ్లను మంజూరు చేసి పేదలకు నాణ్యమైన విద్య ను అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. రాజధాని అమరావతిలో అత్యాధునిక వసతులతో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటుకు రూ.100 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైబ్రరీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు పరిమితమైందని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నవ్యాంధ్ర ప్రదేశ్లో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఏపీి మినహా దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలన్నీ ఐకానిక్ భవనాలతో స్టేట్ సెంట్రల్ లైబ్రరీలను కలిగి ఉన్నాయని తెలిపారు. మంత్రి లోకేష్ వినతులపై కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సానుకూలంగా స్పందిస్తూ ఏపీలో స్కూళ్ల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.