- పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారు?
- పరిశీలించి నివేదిక ఇవ్వాలని పవన్కళ్యాణ్ ఆదేశం
మంగళగిరి(చైతన్యరథం): పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతీ పవర్ సంస్థకు చెందిన భూముల్లో అటవీ భూములు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటి విస్తీర్ణం ఎంత ఉందో నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను, పల్నాడు జిల్లా యం త్రాంగాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ మంత్రి పవన్కళ్యాణ్ ఆదేశించారు. ఈ సంస్థకు 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే వార్తలు వెలుగుచూసిన క్రమంలో ఆయన అధికార యంత్రాంగంతో చర్చిం చా రు. ఆ సంస్థకు చెందిన భూముల్లో ప్రభుత్వ భూములు, జలవనరులు ఏ మేరకు ఉన్నా యో తెలియచేయడంతో పాటు, అటవీ భూములు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో సమగ్రంగా పరిశీలించి నివేదికలు ఇవ్వాలని స్పష్టం చేశారు. వాగులు, వంకలు, కొండలు ఉన్నందున ఆ సంస్థకు పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారో తెలియచేయాలని పీసీబీకి ఆదేశాలు ఇచ్చారు. ఈ అంశంపై అటవీ, రెవెన్యూ, పీసీబీ ఉన్నతాధికారులతో త్వరలో సమీ క్షించాలని నిర్ణయించారు.