చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

మనిషికి ఉండాల్సినవే లేవు!

దోపిడీ ఆస్తుల పంపకంలోనూ దుష్ట సాంప్రదాయమే..

by చైతన్యరధం
October 27, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మంచితనం, నిజాయితీ మచ్చుకైనా కానరాని జగన్‌రెడ్డి
  • సాక్షి పత్రికలో ‘ఆణిముత్యం’ అంటూ.. తప్పుడు రాతలు
  • జగన్‌ అక్రమ సంపదించిన సొమ్ము రూ.8 లక్షల కోట్లు
  • దోపిడీ ఆస్తుల పంపకంలోనూ దుష్ట సాంప్రదాయమే..

క్రూర మనస్తత్వం, అక్రమ ఆస్తులు కూడబెట్టడంపై అత్యంత మక్కువ వైసీపీ నేత జగన్‌ రెడ్డికి. తల్లిదండ్రుల ఆస్తులు తోబుట్టువుకు, తల్లికి అందకుండా చేయడం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.8 లక్షల కోట్ల అక్రమార్జనకు పాల్పడడం, అక్రమార్జన నుండి వేల కోట్లు ఖర్చుపెట్టి కోర్టులను తప్పుదోవ పట్టించి పదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా బయట తిరగడం, తన అవినీతిని నిలదీసిన వారిపై లేనిపోని ఆరోపణలు చేయడం, వాటిని తిప్పితిప్పి చెప్పి నిజమన్న భ్రమ కలిగించడం జగన్‌రెడ్డి ట్రేడు మార్కు రాజకీయం. ఇన్ని అవలక్షణాలున్న జగన్మోహన్‌ రెడ్డికి అతిమంచితనం, అతినిజాయితీ ఉందని సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ విరామం లేకుండా ప్రచారం చేయడం.. మనుషులను పీక్కుతినే దుర్మార్గపు రాకాసిని దేవుడిగా చిత్రీకరించి నమ్మించే ప్రయత్నమే.
దెయ్యాలు వేదాలు వల్లించడంటే ఇంతకు మించిన ఉదాహరణ ఉండకపోవచ్చు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షకోట్ల అవినీతి సంపాదన చేసిన జగన్మోహన్‌రెడ్డి తండ్రి మరణానంతరం పాపంపండి శ్రీకృష్ణ జన్మస్థానంలో 16నెలలు గడిపిన విషయాన్ని ప్రజల మదినుంచి చెరిపేసేందుకు వైసీపీ నాయకులు, బ్లూ మీడియా అహర్నిశలు శ్రమిస్తున్నాయి. కానీ జగన్‌రెడ్డి గురించి ఎన్ని అబద్దాలు చెప్పినా, జాకీలు పెట్టి దేవుడిగా చిత్రీకరించాలనుకున్నా.. చరిత్రపుటల్లో జగన్‌కు ఉన్న నీచపు పేజీల్లో ఉన్న అవినీతికి సంబంధించిన అక్షరాలను మాత్రం ఎవరూ చెరిపివేయలేరనే విషయం నగ్న సత్యం.
ఇదా.. అతిమంచితనం?
అతి నిజాయితీకి జగన్‌రెడ్డి, సాక్షి పత్రిక, బ్లూ మీడియా పర్యాయపదాలను పరిచయం చేశాయి. వక్రభాష్యాన్ని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయి. వీళ్ల దృష్టిలో అతి నిజాయితీ అంటే… ఎదుటివారి ఆస్తులను అడ్డగోలుగా దోచుకోవడం. ఆస్తులకు సంబంధించిన ఒప్పందాలను అడ్డగోలుగా రద్దు చేయడం. తల్లిదండ్రుల ఆస్తుల్లో తోబుట్టువులకు సమానవాటా ఇవ్వకుండా రోడ్డుకు ఈడ్చి కుటుంబం పరువును మంటగలపడం. ఆస్తుల విషయానికి వస్తే… జన్మనిచ్చిన తల్లి అయినా, తోబుట్టువైనా కోర్టుకు ఈడ్చి కుటుంబం పరువును కోర్టుబోనులో నిలబెట్టడమే అతినిజాయితీ.
తెలుగురాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన జగన్‌ కుటుంబ ఆస్తుల పంపకాల విషయాన్ని నిశితంగా పరిశీలిస్తే.. జగన్మోహన్‌ రెడ్డి అనే వ్యక్తి నాయకుడు అనే పదానికి నూటికి నూరు శాతం అనర్హుడు అని చెప్పాలి. ఇలాంటి వ్యక్తిని ఫ్యాను శ్రేణులు నిస్సిగ్గుగా పొగడటమే కాకుండా… వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిలా రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌లో ఫిడేల్‌ వాయించుకోవడం అతిమంచితనమా? తల్లి, చెల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వారించకుండా ఉంటాడా? సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌లో తల్లి, చెల్లిని ఎండగట్టే కార్యక్రమం మొత్తం జగన్మోహన్‌ రెడ్డి, భారతీరెడ్డి కనుసన్నల్లో జరుగుతున్నాయని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?
కుటుంబాన్ని రోడ్డుకీడ్చడమే మంచితనమా?
అతిమంచితనమే జగన్మోహన్‌ రెడ్డిని దెబ్బతీస్తోందని సాక్షి పత్రిక పదే పదే కథనాలు రాస్తోంది. వైసీపీ నాయకులు తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఊదరగొడుతున్నారు. అబద్ధాలతో ప్రజల కళ్లుగప్పాలని చూస్తున్నారు. నిజంగానే జగన్‌రెడ్డి ఆణిముత్యమైతే.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కుటుంబ వివాదాన్ని కోర్టుకెందుకు తెచ్చాడు? తండ్రికిచ్చిన మాట ఎందుకు తప్పాడు? తన ఇంట్లో ఉండాల్సిన తల్లి, చెల్లి తనకు దూరంగా ప్రక్కరాష్ట్రం వెళ్లి ఎందుకు బ్రతుకుతున్నారు. సొంత పిన్ని, చిన్నాన్న కూతురు వైఎస్‌ సునీతారెడ్డి జగన్మోహన్‌ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు గొంతువిప్పారు? వైఎస్‌ వివేకానందరెడ్డి కేసును ఎందుకు నీరుగార్చారు? వివేకా హంతకులకు వంతపాడి, వారికి రక్షణగా ఎందుకు నిలబడ్డాడు? 2019 ఎన్నికలకు ముందు నా కొడుకు…నా కొడుకు అని కలవరించిన విజయలక్ష్మి (విజయమ్మ).. జగన్‌ సీఎం అయిన అతి తక్కువ కాలంలోనే కొడుకును విజయమ్మ ఎందుకు దూరం పెట్టింది? తల్లిని పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి నుండి జగన్‌ ఎందుకు తప్పించాడు? కొడుకు ముఖ్యమంత్రి అయితే ఆనంద బాష్పాలతో కంటతడి పెట్టిన విజయలక్ష్మి.. అనతి కాలంలోనే జగన్‌ ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడురా బాబు? అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? జగన్‌ ఐదేళ్ల పాలనలో ప్రజల్లోకి రావాలంటే పరదాలు కట్టుకుని ఎందుకు తిరిగాడు? ప్రతిపక్షపార్టీ నాయకులపై కక్షసాధింపులకు ఎందుకు పాల్పడ్డారు? ముంబై రాష్ట్రానికి సంబంధించిన నటిని, ఆమె కుటుంబాన్ని ఏపీకి తెచ్చి ఎందుకు ఇబ్బందిపెట్టారు? ఈ విషయంలో ఐపీఎస్‌ అధికారుల జీవితంతో ఎందుకు చెలగాటం ఆడారు? వారిని కోర్టుల చుట్టూ తిరిగేలా ఎందుకు చేశారు?
రూ.8 లక్షల దోపిడీయే మంచితనమా?
తన అతిమంచితనం, అతినిజాయితీ వల్ల తనకు సమస్యలు వస్తున్నాయని జగన్‌ సాక్షి పత్రికలో రాయించుకోవడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా లేదా? జగన్‌లో ఉన్నది ధన పిశాచి, దుష్ట రాజకీయం తప్ప మంచితనం, నిజాయితీ మచ్చుకైనా కానరాదు. జగన్మోహన్‌రెడ్డికి 2004లో ఉన్న ఆస్తులు 1.73కోట్లు మాత్రమే. ఆ యేడాది ఆయన చెల్లించిన ఆదాయ పన్ను (ఇన్‌కం ట్యాక్స్‌) రూ.10 లక్షల లోపు మాత్రమే. కానీ నేడు జగన్మోహన్‌రెడ్డి నేడు ఆస్తులు రూ.8లక్షల కోట్లు. ఇది దోపిడీ కాక సక్రమంగా ఎలా సాధ్యమైందో జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పే దమ్ముందా? బహిరంగంగా 16 కంపెనీలకు, రహస్యంగా 50కి పైగా సూట్‌ కేసు కంపెనీలకు, వేలాది ఎకరాల భూములు, 9 నగరాల్లో అధునాతనమైన ప్యాలెస్‌లకు అధిపతి ఎలా అయ్యాడో నోరు విప్పే దమ్ముందా? జగన్‌ కేసుల సీబీఐ చార్జిషీటులో రూ.43వేల కోట్ల అవినీతి జరిగిందని పేర్కొనబడిరది. జగన్‌పై సీబీఐ 12 చార్జిషీట్లతో పాటు మొత్తం 38 కేసులు రిజిస్టరై వున్నట్టు ఎన్నికల అఫిడవిట్‌ స్పష్టం చేస్తోంది. అక్రమాస్తుల కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి 10ఏళ్లుగా బెయిల్‌పై ఎలా ఉన్నాడో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కోర్టులను తప్పుదారి పట్టిస్తూ బయట తిరుగుతున్నాడు. జయలలిత, లాలూప్రసాద్‌ యాదవ్‌, బంగారప్ప, శిబుసోరెన్‌, ఓంప్రకాశ్‌ చౌతాలా, మధుకోడా సీఎంలుగా ఉన్నప్పటికీ వారికి లేని మినహాయింపులు జగన్‌రెడ్డి ఎలా మేనేజ్‌ చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రూ.8లక్షల కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగిన జగన్‌.. తన తల్లి, చెల్లికి ఇవ్వాల్సిన పిసరంత ఆస్తిని తిరిగి లాక్కునేందుకు, రాజకీయంగా బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు కోర్టులో కేసులు వేశాడు. కుటుంబ కలహాలు అందరి ఇళ్లలో ఉంటాయంటూ తన దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలందరికీ అంటకడుతున్నాడు. జగన్‌లాంటి బరితెగించిన కలహాలు, నేరాలు ఏ కుటుంబంలోనూ ఉండవు. చిన్నాన్నను చంపిన నేరస్తులను సమర్థిస్తున్న జగన్‌ చేష్టలు మరే ఇతర కుటుంబాల్లో లేవు. ఆస్తుల పంపకంలో తల్లిదండ్రులు చెప్పిన దానికి విరుద్దంగా, చెల్లికి పంగనామాలు పెట్టిన మోసం ఎక్కడా ఉండదు. చెల్లి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆమె చంద్రబాబు వదిలిన బాణమంటూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. జగన్‌ బంగారం మంచిదైతే స్వర్ణకారులేమీ చేయలేరు కదా? చెల్లి, తల్లి, పిన్నమ్మకు న్యాయం చేసి ఉంటే వారెందుకు గడప దాటుతారు? కుటుంబ ఆస్తుల పంపకంలోనూ దుష్ట సంప్రదాయానికి ఒడిగట్టిన జగన్‌ నాయకుడు ఎలా అవుతాడు?
భూ దోపిడీ చేయడమే అతిమంచితనమా?
ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములు పరిరక్షంచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుంది. అందుకు విరుద్ధంగా జగన్‌ రెడ్డి భూదోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. కొండలు, గుట్టలు, ప్రభుత్వ, ప్రైవేటు భూములతో పాటు బడుగు, బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్‌ భూములను సైతం బలవంతంగా లాక్కున్నాడు. విలువైన ప్రభుత్వ భూములను కారుచౌకగా కొట్టేయడంతోపాటు వేలాది ఎకరాల భూములను తన బినామీలకు దోచిపెట్టారు.

కబ్జా చేసిన భూమి వివరాలు ఎకరాలు
ఇండో సోలార్‌ (జగన్‌ కుటుంబ బినామీ) 38,000
విశాఖలో జే గ్యాంగ్‌ భూ దోపిడీ 3,000
సరస్వతి పవర్‌ 2,000
పెనగలూరు ఎస్టేట్‌ 2,000
ఇడుపులపాయ ఎస్టేట్‌ 600
వాన్‌ పిక్‌లో బినామీ భూములు 28,000
భారతి సిమెంట్‌ భూములు 2,037
వర్ధిల్లి మురళి (బినామీ, హైదరాబాద్‌) 400
వైఎస్‌ అనిల్‌ రెడ్డి (బినామీ, విశాఖ భూములు) 70
హైదరాబాద్‌ కె.పి.హెచ్‌.బి భూములు 10
మొత్తం 76,117

ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్‌రెడ్డి రూ.8లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. భూకేటాయింపులు, గనుల తవ్వకాలు, సోలార్‌కు అనుమతులు.. ఇలా ప్రతిదానిలో ఆశ్రిత పక్షపాతానికి ఒడిగట్టి లక్షల కోట్లు సంపాదించారు. ఆంధ్రప్రదేశ్‌ గుండెకాయలాంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు. టీడీఆర్‌ బాండ్లు, స్మార్ట్‌ మీటర్ల కొనుగోలు, రేషన్‌ బియ్యంలో సైతం చేతివాటం చూపారు. చివరికి చిన్నారుల పోషణకు పెట్టే చిక్కీలు, కోడిగుడ్లు వంటి వాటిలోనూ పెద్దఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు.

అవినీతి వివరాలు దోచుకున్న సొమ్ము రూ.లలో
లిక్కర్‌ కమిషన్‌, అన్‌ ఆథరైజ్డ్‌ సేల్స్‌ రూ.1,05,000కోట్లు
22 (ఏ), అసైన్డ్‌ భూముల కుంభకోణం రూ.1,00,000కోట్లు
ఇండోసోల్‌ (జగన్‌ బినామీ) కుంభకోణం రూ.75,000కోట్లు
జి.ఐ.ఎస్‌ విద్యుత్‌ ఒప్పందాల కుంభకోణం రూ.50,000కోట్లు
టీడీఆర్‌ బాండ్ల కుంభకోణం రూ.50,000కోట్లు
విశాఖ భూముల కుంభకోణం రూ.40,000కోట్లు
ఇసుక దోపిడీ రూ.60,000కోట్లు
ఎర్రచందనం కుంభకోణం రూ.25,000కోట్లు
గ్రావెల్‌ దోపిడీ రూ.22,000కోట్లు
సిలికా, బీచ్‌ శాండ్‌, క్వార్ట్జ్‌ దోపిడీ రూ.17,000కోట్లు
గంజాయి, డ్రగ్స్‌ వాటా రూ.37,000కోట్లు
ప్రభుత్వ కొనుగోళ్లలో కమీషన్లు రూ.16,000కోట్లు
కూకట్‌ పల్లిలో 11ఎకరాలు, లేపాక్షి భూములు రూ.15,000కోట్లు
స్మార్ట్‌ మీటర్లు, ట్రాన్స్‌ ఫార్మర్లు కొనుగోలు, ఇతరాలు రూ.15,000కోట్లు
కోవిడ్‌ మందులు, కిట్లు కొనుగోళ్లు రూ.14,000కోట్లు
భారతి సిమెంట్‌ దోపిడీ రూ.12,000కోట్లు
సరస్వతి పవర్‌ రూ.10,000కోట్లు
రేషన్‌ బియ్యం కుంభకోణం రూ.7,000కోట్లు
ఇళ్ల స్థలాల కొనుగోలు కుంభకోణం రూ.7,000కోట్లు
బైజూస్‌, విద్యాకానుక, నాడు-నేడు రూ.4,500కోట్లు
పోర్టుల్లో అవినీతి రూ.4,000కోట్లు
సాగునీటి ప్రాజెక్టుల్లో కమీషన్లు రూ.2,500కోట్లు
సాక్షికి ప్రకటనల రూపంలో దోపిడీ రూ.400కోట్లు
అమూల్‌ కమీషన్‌ రూ.1,000కోట్లు
జే ట్యాక్సులు రూ.40,000కోట్లు
సీబీఐ చార్జిషీట్లలో నిర్ధారించినవి రూ.43,000కోట్లు
సీబీఐ నిర్ధారించాల్సిన ఆస్తులు విలువ రూ.60,000కోట్లు
మొత్తం ఆస్తులు విలువ రూ.8,32,400కోట్లు
గురివిందగింజ తన కిందఉన్న నలుపును గ్రహించకుండా.. ఎదుటివారి నలుపు గురించి మాట్లాడడం ఎంత హాస్యాస్పదమో.. జగన్మోహన్‌ రెడ్డి తన అవినీతి చిట్టాను మరచిపోయి, ఎదుటివారికి తన అవినీతి మరకలను ఆపాదిస్తూ మాట్లాడడం కూడా అంతే హాస్యాస్పదం. జగన్మోహన్‌ రెడ్డి తన నేరాలు, దోపిడీలు, లూటీలు, కబ్జాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షంపై నోటికొచ్చిన విధంగా ఆరోపణలు చేయడంలో సిద్ధహస్తుడు. ఒక అబద్దాన్ని 100సార్లు చెప్పి దాన్ని నిజమని నమ్మించడం జగన్‌ రెడ్డి ట్రేడ్‌ మార్కు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్‌ రెడ్డి మరోసారి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం కోసం అబద్దాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి విద్రోహశక్తులు. ఇలాంటి వారు రాజకీయాల్లోకి రావడం వల్ల రాష్ట్ర అభివృద్ధి సర్వనాశనం అవుతుందని గత ఐదేళ్ల పాలన నిలువుటద్దంలా కనబడుతుంది. జగన్మోహన్‌ రెడ్డి లాంటి వ్యక్తికి నాయకుడు అని పిలిపించుకునే నైతిక హక్కు, అర్హత లేవు.
-మునీంద్ర కొడాలి, అనలిస్ట్‌.

Previous Post

ప్రజలకు పూర్తిస్థాయిలో ఉచిత ఇసుకకు చర్యలు

Next Post

తెలుగుజాతి చిరునామా.. టీడీపీ!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

November 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
Next Post
తెలుగుజాతి చిరునామా.. టీడీపీ!

తెలుగుజాతి చిరునామా.. టీడీపీ!

ముఖ్య వార్తలు

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

by కార్యకర్త
November 3, 2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.