- సీఎం చంద్రబాబును కలిసిన సంస్థ ఎండీ, డైరెక్టర్
- వరద బాధితులకు రూ. కోటి విరాళం అందజేత
అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబును 3ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సంజయ్ గోయెంకా, సంస్థ డైరెక్టర్ ఆశిష్ గోయెంకా ఆదివారం కలిశారు. ఇటీవల ఏపీలో వరదలు బీభత్సం సృష్టించి నేపథ్యంలో, వరద బాధితుల సహాయార్థం రూ.1 కోటి విరాళం తాలూకు చెక్‌ను ముఖ్యమంత్రి సహాయ నిధికి వారు అందించారు.
ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ఎక్స్ ద్వారా వెల్లడిరచారు. 3ఎఫ్ ఆయిల్ పామ్ సంస్థ పామాయిల్ శుద్ధి రంగంలో అగ్రగామి కంపెనీగా ఉందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ సౌకర్యంతో రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, తద్వారా రాష్ట్రంలో వారి వ్యాపార విస్తరణకు ఆసక్తి చూపిస్తున్నారని వివరించారు.